- Home
- Business
- ఏంటీ.. ఎలక్ట్రిక్ బైక్‌కి కూడా గేర్స్ ఉంటాయా? ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిన ఎరా మేటర్ కొత్త ఇ-బైక్
ఏంటీ.. ఎలక్ట్రిక్ బైక్‌కి కూడా గేర్స్ ఉంటాయా? ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిన ఎరా మేటర్ కొత్త ఇ-బైక్
Era Motor electric bike: ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చరిత్రలో నిలిచిపోయే మైలు రాయి లాంటి ఆవిష్కరణ ఇది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ గేర్స్ లేవు కదా.. ఇదే ఫీచర్ తో ఎలా మేటర్ అనే బైక్ ఫ్లిక్ కార్ట్ లో అమ్మకానికి దొరుకుతోంది. గేర్స్ బైక్ నడపడం ఇష్టపడే వారు పెట్రోల్ తలనొప్పులు లేకుండా జస్ట్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని దూసుకుపోవచ్చు. ఈ గేర్స్ బైక్ ఈవీ ధర, ఫీచర్స్ తెలుసుకుందాం రండి.

భారతదేశపు మొట్టమొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా మేటర్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయింది. ఈ వినూత్న బైక్‌ను ఎరా మోటార్స్ రూపొందించింది. ఇది అత్యాధునిక ఫీచర్లతో పాటు మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌గా గుర్తింపు పొందింది. రీసెంట్ గా లాంచ్ కావడంతో కంపెనీ కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ ఇస్తోంది.
రూ.40 వేల వరకు డిస్కౌంట్స్
ఎరా మేటర్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1,83,308గా ఉంది. ప్రస్తుతం ఈ బైక్‌పై కంపెనీ రూ.39,827 వరకు లాంచ్ తగ్గింపును అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌లు, ప్రారంభ ధర ఆఫర్‌లు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ల రూపంలో అమలవుతోంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ 5 kWh సామర్థ్యంతో IP67 రేటింగ్ ఉన్న బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ బైక్ 172 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది కేవలం 2.8 సెకన్లలో 0 నుండి 40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది.
గేర్లు ఉన్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే
ఈ బైక్ 4 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండడం విశేషం. అలాగే రైడింగ్ మోడ్‌ల విషయానికి వస్తే ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు మోడ్‌లు వినియోగదారుల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రైడ్ అనుభవాన్ని అందిస్తాయి.
బెస్ట్ ఫీచర్లు ఇవే..
టెక్నాలజీ ప్రేమికుల కోసం బైక్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డాష్‌బోర్డ్ కూడా ఉంది. ఇది నావిగేషన్, మీడియా కంట్రోల్, కాల్ ఫంక్షన్‌లు, OTA అప్‌డేట్‌లను సపోర్ట్ చేస్తాయి. అదనంగా, 5A హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఉన్న ఆన్‌బోర్డ్ ఛార్జర్ కూడా ఇందులో ఉంది.
ఇతర స్మార్ట్ ఫీచర్లలో యాప్ కనెక్టివిటీ, జియో ఫెన్సింగ్, రిమోట్ లాకింగ్, రియల్ టైమ్ డేటా యాక్సెస్, నిర్వహణ హెచ్చరికలు ఉన్నాయి. ఈ ఫీచర్లు బైక్‌ను కరెక్ట్ గా కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి.
ఈ బైక్ రాక మార్కెట్ లో సంచలనమే..
ఈ బైక్ లాంచ్‌తో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో గణనీయమైన మార్పు రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పరిమిత ఖర్చుతో ఎక్కువ ప్రయాణ దూరం, గేర్ మెకానిజంతో కూడిన ఇ-బైక్‌గా ఇది వినియోగదారులకు ప్రత్యేక ఆకర్షణగా మారనుందని అభిప్రాయపడుతున్నారు.