MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • లైసెన్స్ అక్కర్లేకుండానే నడిపే స్కూటర్ కావాలా? ధర కేవలం రూ.42 వేలే..

లైసెన్స్ అక్కర్లేకుండానే నడిపే స్కూటర్ కావాలా? ధర కేవలం రూ.42 వేలే..

తక్కువ బడ్జెట్ లో లైట్ వెయిట్, సింపుల్ గా ఉండే స్కూటర్ కావాలంటే మీరు ఓడిస్సీ సంస్థ రిలీజ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి. ఇది నడపాలంటే మీకు లైసెన్స్ కూడా అవసరం లేదు. హైఫై పేరుతో రిలీజ్ చేసిన ఈ స్కూటర్ ఫీచర్స్, ధర, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 07 2025, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓడిస్సీ తన కంపెనీ వెహికల్స్ లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని రిలీజ్ చేసింది. కేవలం రూ.42,000 (ఎక్స్-షోరూమ్) ధరకు లభించే హైఫై స్కూటర్ సింపుల్ ఫీచర్స్ ని కలిగి ఉంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లు, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా మే 10, 2025 నుండి హైఫై స్కూటర్ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. మీరు కావాలంటే ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని ఓడిస్సీ సంస్థ తెలిపింది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

హైఫై స్పెసిఫికేషన్లు & ఫీచర్లు 

ఓడిస్సీ సంస్థ ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ V2 అనే 2 స్కూటర్లను అందిస్తుంది. రెండు స్కూటర్లలో 250 వాట్ మోటార్ అమర్చారు. ఇది గంటకు 25 కి.మీ వేగంతో నడుస్తుంది. అంటే, వాటిని నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ హైఫై స్కూటర్ 48V, 60V బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. చూడ్డానికి చాలా చిన్నదిగా, నగరాల్లో, లోకల్ గా తిరగడానికి వీలుగా ఉంటుంది. ఇందులో అధునాతన లిథియం-అయాన్, గ్రాఫేన్ బ్యాటరీని ఉపయోగించారు.

ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుండి 89 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. బ్యాటరీ ఛార్జ్  చేయడానికి 4-8 గంటలు పడుతుంది.


 

35

అయిదు రంగుల్లో హైఫై స్కూటర్

నగర వాతావరణానికి ఈ స్కూటర్ చాలా అనుకూలం. తేలికైన, కాంపాక్ట్ డిజైన్, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో సులభంగా నావిగేట్ చేయవచ్చు. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, LED డిజిటల్ మీటర్, రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత బూట్ స్పేస్ ఉన్నాయి. ఈ స్కూటర్ ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది. అవి రాయల్ మ్యాట్ బ్లూ, సిరామిక్ సిల్వర్, అరోరా మ్యాట్ బ్లాక్, ఫ్లేర్ రెడ్ మరియు జేడ్ గ్రీన్.

45

హైఫై లో V2 స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అయితే V2+ ఒక్క ఛార్జ్‌తో 150 కి.మీ వరకు వెళతుందని కంపెనీ ప్రకటించింది. అయితే, రెండు స్కూటర్లు ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి 3.5 గంటల సమయం తీసుకుంటాయి. 

హైఫై స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 215 mm. ఈ స్కూటర్ బరువు కేవలం 88 కిలోలు. అందువల్ల ఆడవాళ్లు, యువత కూడా దీన్ని ఈజీగా నడపొచ్చు.

 

55

V2, V2+ మధ్య ప్రధాన తేడా ఏమిటంటే.. V2 1.3kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. V2+ 2.6kWh బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంది. ఇక ప్రత్యేకంగా కీలెస్ ఆపరేషన్, ఆల్ అరౌండ్ LED లైటింగ్, రివర్స్ మోడ్ ఉన్నాయి. 

ఈ స్కూటర్ చిన్నదైనా డిస్క్ బ్రేకులు కూడా కలిగి ఉంది. అందువల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
విద్యుత్ వాహనాలు
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
D Mart : డీ మార్ట్ లో ఈ సీక్రెట్ ట్రై చేస్తే రూ.వేలల్లో డబ్బు ఆదా చేయొచ్చు
Recommended image2
Business Idea : ఈ స్కీమ్ కి అప్లై చేస్తే చాలు... బిజినెస్ చేసేందుకు ఫ్రీగా రూ.10 లక్షలు
Recommended image3
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Related Stories
Recommended image1
Top 5 Electric Vehicles: ఒక్కసారి ఛార్జ్ చేస్తే వందల కి.మీ. దూసుకుపోయే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Recommended image2
ఏంటీ.. ఎలక్ట్రిక్ బైక్‌కి కూడా గేర్స్ ఉంటాయా? ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ అయిన ఎరా మేటర్ కొత్త ఇ-బైక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved