MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • FD Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులివే..!

FD Interest Rate: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇచ్చే బ్యాంకులివే..!

FD Interest Rate:  ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వడ్డీ రేటు.  వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే రిటర్న్స్  ఎక్కువ వస్తుంది. అయితే.. జూన్ 2025లో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన తరువాత ఎఫ్‌డీలపై అధిక వడ్డీ అందిస్తున్న  బ్యాంకులు ఏవి ?

2 Min read
Author : Rajesh K
Published : Jun 23 2025, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎఫ్‌డీలపై కొత్త వడ్డీ రేట్లు
Image Credit : Google

ఎఫ్‌డీలపై కొత్త వడ్డీ రేట్లు

ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2025లో  రెపో రేటును 0.50 శాతం తగ్గించింది. ఈ చర్యతో బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించాయి. ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున ఆర్థిక వృద్ధికి మద్దతుగా రెపో రేటును తగ్గించింది. దీని ఫలితంగా SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ తదితర ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వెంటనే తమ డిపాజిట్ రేట్లను సవరించాయి. 

కొత్త రేట్లు స్టాక్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, సాంప్రదాయ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా మధ్యస్థం నుండి దీర్ఘకాలిక హోరిజోన్ ఉన్నవారికి, FDలు సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఒకటి. వడ్డీ రేటు లో తగ్గింపు ఉన్నప్పటికీ,  కొన్ని బ్యాంకులు రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులను ఆకర్షించేలా వడ్డీని అందిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వడ్డీ రేట్లు ఇలా
Image Credit : Google

వడ్డీ రేట్లు ఇలా

ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రధానమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుతం  సాధారణ పౌరులకు 3.05% నుండి 6.45% వరకు వడ్డీని అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు 7.05% వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అందిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 7.40% వరకు వడ్డీ అందిస్తోంది, అయితే కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  ఇండియన్ బ్యాంకులు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దాదాపు 6.50% నుండి 6.90% వరకు వడ్డీ అందిస్తున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ చర్యకు ప్రతిస్పందనగా HDFC,  ICICI  వంటి ప్రైవేట్ రంగ సంస్థలు తమ వడ్డీ రేట్లను తగ్గించాయి.  HDFC సాధారణ కస్టమర్లకు 6.40% వడ్డీ ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ రేటు అందిస్తుంది. ఇక  ICICI బ్యాంక్ సాధారణంగా  6.60% వడ్డీ అందిస్తుండగా.. సీనియర్ సిటిజన్స్ కు  7.10% వడ్డీ అందిస్తున్నాయి. ఆక్సిస్ బ్యాంక్ 6.50% వడ్డీ ఇస్తుండగా..  YES బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల డిపాజిట్‌పై 7.85% అందిస్తోంది. 

35
అధిక రాబడినిచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు
Image Credit : మాది

అధిక రాబడినిచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) ఈ సీజన్‌లో అధిక FD రేటు ప్రొవైడర్లుగా మారాయి.  యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ SFB వంటి  5 సంవత్సరాల డిపాజిట్లకు 8.25% నుండి 8.60% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.  కొన్ని పథకాలలో రేట్లు 9.10% వరకు ఇస్తున్నాయి.  ప్రధాన బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ రిస్క్‌.   

45
5 ఏండ్లలో రాబడి ఇలా..
Image Credit : Google

5 ఏండ్లలో రాబడి ఇలా..

ఐదేళ్లకు రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే..  ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం SBI లో మెచ్యూరిటీ సమయానికి రూ. 7.07 లక్షలు పొందుతారు. అంటే.. నికర వడ్డీ గా రూ. 2.07 లక్షలు పొందువచ్చు.  ఇక ICICI బ్యాంక్ లో 6.60% వద్ద రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఐదేండ్లకు రూ. 7.15 లక్షలు పొందవచ్చు. HDFC బ్యాంక్ లో 6.40%  వడ్డీ రేట్ వద్ద  5 లక్షలు డిపాజిట్ చేస్తే దాదాపు రూ.  7.05 లక్షలు పొందవచ్చు. YES బ్యాంక్‌లో 7.85% వడ్డీ రేట్ వద్ద డిపాజిట్ చేస్తే.. దాదాపు ₹8.19 లక్షలు పొందుతారు, ఐదేళ్లలో మొత్తం వడ్డీ ₹3.19 లక్షలకు పైగా సంపాదిస్తారు.

55
అత్యధిక ఎఫ్ డీ వడ్డీ రేట్లు
Image Credit : మాది

అత్యధిక ఎఫ్ డీ వడ్డీ రేట్లు

జూన్ 2025 FD రేటు సవరణలు సగటు రాబడిని తగ్గించినప్పటికి రిస్క్ తక్కువగా ఉండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసినవారు, జీతన జీవులు, సాంప్రదాయ పెట్టుబడిదారులకు అవి DICGC నిబంధనల ప్రకారం ఒక బ్యాంక్‌కు ₹5 లక్షల వరకు  మూలధన భద్రత,  భీమాను అందిస్తాయి. సీనియర్ సిటిజన్లకు, 8.2% అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లేదా YES బ్యాంక్ 7.85% 5 సంవత్సరాల FD అవకాశాన్ని అందిస్తున్నాయి.  

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
మహిళలు
పురుషులు
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Best 5G Phones: రూ.12,000 బడ్జెట్‌లో 3 సూపర్ 5G ఫోన్లు.. దీపావళికి భారీ తగ్గింపు ధరలు
Recommended image2
DA Hike: ఉద్యోగులకు దీపావళి కానుక.. 3 శాతం డిఏ పెంపు.. జీతాలు ఎంత పెరుగుతాయంటే?
Recommended image3
ఇండియ‌న్ రైల్వే సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాత్రి 11 త‌ర్వాత మొబైల్ ఛార్జింగ్ బంద్
Related Stories
Recommended image1
Interest Rates: రెపో రేటు తగ్గిందని చింతించకండి.. FDలపై ఎక్కువ వడ్డీ ఇచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకులివే
Recommended image2
FD Interest Rates ఈ బ్యాంకుల్లో ఎఫ్‌డిలపై అత్యధిక వడ్డీ.. మరి ఇంకెందుకు ఆలస్యం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved