Gold Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్..పతనమైన వెండి.. పసిడి ప్రియులకు భారీ ఊరట
Gold Price: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? వరుసగా షాక్‌లు ఇస్తున్న గోల్డ్ రేట్లు ఈరోజు తగ్గుముఖం పట్టాయి. వెండి అయితే ఏకంగా రూ.5 వేల వరకు పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ఎంత ఉంది? ఇప్పుడే కొనడం మంచిదా?

పసిడి ప్రియులకు ఊరట
బంగారం కొనుగోలుదారులకు ఈరోజు కొంత ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు కారణంగా దేశీయ బులియన్ మార్కెట్లో ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
కొనుగోలుచేయాలనుకునేవారికి ఊరట
హైదరాబాద్ లో ధరలు చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.160 తగ్గి రూ.1,51,370గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 క్షీణించి రూ.1,38,750 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోలిస్తే తక్కువగా ఉంది. ముఖ్యంగా ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ తగ్గుదల కొంత ఉపశమనం కలిగిస్తోంది.
రూ.5 వేలు క్షీణించిన వెండి
ఇక వెండి విషయానికి వస్తే, ధరల్లో మరింత స్పష్టమైన పతనం కనిపించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది. ఒక్కరోజులోనే రూ.5,000 వరకు తగ్గడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పారిశ్రామిక అవసరాలు, గ్లోబల్ డిమాండ్ ప్రభావంతో వెండి ధరలు ఇటీవల తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొంటున్నాయి.
మార్కెట్ పరిస్థితులు గమనించడం మంచిది
ప్రపంచ ఆర్థిక పరిణామాలు, డాలర్ మార్పులు, కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే పెట్టుబడి లేదా కొనుగోలు చేసే ముందు తాజా మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు.

