MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Gold Price: పసిడి ప్రియులకు భారీ ఊరట... ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

Gold Price: పసిడి ప్రియులకు భారీ ఊరట... ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

Gold Price: పసిడి కొనాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారా? గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ఒకే రోజులో తులం బంగారంపై వెయ్యి రూపాయలకు పైగా తగ్గడంతో కొనుగోలుదారుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.

1 Min read
Author : Nandini Arava
Published : Jul 13 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ ఊరట
Image Credit : Getty

భారీ ఊరట

దేశీయ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ ఊరట లభించింది. గత వారం వరకు వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయిలకు చేరుకున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నమోదైన బలహీన ధోరణి ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మళ్లీ తగ్గిన పసిడి ధరలు
Image Credit : our own

మళ్లీ తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,420 తగ్గి రూ.1,42,910 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం కూడా గణనీయంగా చౌకైంది. 10 గ్రాముల ధర రూ.1,300 తగ్గి రూ.1,31,000 వద్దకు చేరింది. ఇక వెండి కొనుగోలు చేసే వారికి మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. వెండి ధరలు నిన్నటి స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కిలో వెండి రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.

Related Articles

Related image1
Gold Price Fall: కన్ఫ్యూజ్ చేస్తున్న పసిడి ధరలు..అసలు ఇప్పుడు కొనాలా? వద్దా..?
Related image2
Gold Price Today: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..ఆ ప్రభావంతో మళ్లీ ఎగబాకిన పసిడి
34
ప్రధాన కారణం ఇదే
Image Credit : our own

ప్రధాన కారణం ఇదే

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు బంగారంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, అలాగే గ్లోబల్ బులియన్ ట్రేడింగ్‌లో కొనుగోళ్ల వేగం తగ్గడం వంటి అంశాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు పడిపోవడంతో దాని ప్రభావం భారత మార్కెట్‌పైనా కనిపించింది. ఒక్క రోజులోనే తులంపై వెయ్యి రూపాయలకు పైగా తగ్గడం వల్ల మొత్తం కొనుగోలు వ్యయంలో గణనీయమైన ఆదా సాధ్యమవుతోంది.

44
ఇకపై బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి?
Image Credit : our own

ఇకపై బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి?

అయితే ఇకపై బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి అన్నది చాలామందిలో ఆసక్తి కలిగిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, అమెరికా డాలర్ కదలికలు, కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు, ప్రపంచ మార్కెట్‌లో పెట్టుబడిదారుల వైఖరిని బట్టి బంగారం ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ప్రతిరోజూ ధరలను గమనిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
Gold Price Fall: కన్ఫ్యూజ్ చేస్తున్న పసిడి ధరలు..అసలు ఇప్పుడు కొనాలా? వద్దా..?
Recommended image2
Gold Price Today: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..ఆ ప్రభావంతో మళ్లీ ఎగబాకిన పసిడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved