MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • Mobile Recharge Tips : మీరు రూ.199 రీచార్జ్ ప్లాన్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే

Mobile Recharge Tips : మీరు రూ.199 రీచార్జ్ ప్లాన్ వాడుతున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే

దాదాపు అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు రూ.199 రీఛార్జ్ ప్లాన్‌ అందిస్తున్నాయి. చాలా తక్కువ ఖర్చులో రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్లాన్ చాలామందికి ఆకట్టుకుంటుంది. మరి దీనివల్ల లాభమా, నష్టమా?  

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 03 2026, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.199 రీచార్జ్ తో లాభమా, నష్టమా?
Image Credit : gemini ai

రూ.199 రీచార్జ్ తో లాభమా, నష్టమా?

మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు చాలామంది ముందుగా చూసేది దాని ధర మాత్రమే. తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ఉండే రీచార్జ్ ప్లాన్ నే ఎవరైనా ఎంచుకునేది. అయితే అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు తక్కువ ధరలో రూ.199 రీచాార్జ్ ప్లాన్ అందిస్తున్నాయి. అయితే ఈ ప్లాన్ ఎంచుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం గమనించకపోతే మీ డబ్బు వృథా అయ్యే ప్రమాదం ఉంది… అదేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

ఈ రోజుల్లో మొబైల్ రీఛార్జ్ అందరికీ తప్పనిసరి ఖర్చుగా మారింది. ముఖ్యంగా రూ.199 వంటి తక్కువ ధర ప్లాన్‌లు విద్యార్థులు, వృద్ధులు, ఫోన్ వాడకం తక్కువగా ఉన్నవారిని బాగా ఆకర్షిస్తాయి. కానీ ‘’రూ.199 తో రీచార్జ్ చేశాం కదా... అంతా ఓకే!'' అని అనుకోవడం పెద్ద పొరపాటు. ఎందుకంటే ఒక్కో కంపెనీ ఈ ధరలో ఇచ్చే ఆఫర్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొబైల్ రీచార్జ్ కి ముందే ఈ విషయాలు తెలుసుకొండి
Image Credit : Gemini AI

మొబైల్ రీచార్జ్ కి ముందే ఈ విషయాలు తెలుసుకొండి

చాలామంది రీఛార్జ్ చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే చూసి ప్లాన్‌ను ఎంచుకుంటారు. ఇది కరెక్ట్ పద్దతి కాదు.. ధరతో పాటు ఏమేం గమనించాలో తెలుసా? 

రోజువారీ డేటా ఎంత? 

అన్‌లిమిటెడ్ కాల్స్ నిజంగా వస్తున్నాయా? 

ఎస్ఎంఎస్ (SMS) సౌకర్యం ఉందా? 

వ్యాలిడిటీ ఎన్ని రోజులు? 

5జి (5G) డేటా అందుబాటులో ఉందా? 

ఓటిటి (OTT) లేదా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా? 

ఈ విషయాలు చెక్ చేసుకోకుండా రీఛార్జ్ చేస్తే కొన్ని రోజులకే మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. 

అన్ని రూ.199 ప్లాన్‌లు ఒకేలా ఉండవు

ధర రూ.199 ఒకటే అయినా ఒక్కో కంపెనీ బెనిఫిట్స్ ఒక్కోలా ఉంటాయి. ఓ కంపెనీలో కేవలం 18 రోజుల వ్యాలిడిటీ ఉండొచ్చు… మరో కంపెనీలో 28 రోజులు ఉండొచ్చు. కొన్ని కంపెనీల ప్లాన్‌లలో రోజువారీ డేటా వస్తుంది…కొన్నింటిలో మొత్తం డేటా మాత్రమే ఉంటుంది. కొన్ని ప్లాన్‌లు కేవలం వాయిస్-ఓన్లీ కూడా కావచ్చు. కాబట్టి ధర ఒకటే కదా అని ఆఫర్లు కూడా ఒకటే అనుకోకూడదు.

35
రూ.199 ప్లాన్ వీరికి అస్సలు పనిచేయదు
Image Credit : GEMINI AI

రూ.199 ప్లాన్ వీరికి అస్సలు పనిచేయదు

మీరు యూట్యూబ్ లో వీడియోలు ఎక్కువగా చూస్తారా? 

ఇన్స్టాగ్రామ్ (Instagram) లో రీల్స్ ఎక్కువగా చూస్తారా? 

వాట్సాప్ (WhatsApp) వీడియో కాల్స్ చేస్తారా? 

ఆన్‌లైన్ క్లాసులు లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంటర్నెట్ డాటా వాడుతున్నారా? 

అయితే రూ.199 ప్లాన్ మీ అవసరానికి సరిపోతుందో లేదో ముందుగా చెక్ చేసుకోవాలి. రోజువారీ డేటా లిమిట్ ముగిశాక ఇంటర్నెట్ వేగం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. మళ్లీ రీచార్జ్ చేసుకునే అవసరం రావచ్చు… అంటే అదనపు ఖర్చు తప్పదన్నమాట. 

ఇక చాలామంది రీచార్జ్ చేసముందు ఇంటర్నెట్ డేటా మాత్రమే చూస్తారు… వ్యాలిడిటీని పెద్దగా పట్టించుకోరు. ఉదాహరణకు రూ.199 ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటే నెలకు రెండుసార్లు రీఛార్జ్ చేయాల్సి రావచ్చు. అదే సమయంలో కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ తీసుకుంటే, నెలవారీ ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

45
రూ.199 ప్లాన్ రీచార్జ్ రూల్స్ తెలుసుకొండి
Image Credit : X/BSNL India

రూ.199 ప్లాన్ రీచార్జ్ రూల్స్ తెలుసుకొండి

చాలా కంపెనీల రూ.199 ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అని ఉన్నప్పటికీ, కొన్ని కంపెనీలు ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP), కమర్షియల్ యూసేజ్ లేదా ఇతర నిబంధనలు పెట్టొచ్చు. కాబట్టి Terms & Conditions ఒకసారి చూసుకోవడం మంచిది.

ఎస్ఎంఎస్ (SMS) సౌకర్యం అవసరమా?

ఇప్పటికీ చాలా బ్యాంక్ OTPలు, UPI రిజిస్ట్రేషన్, SIM వెరిఫికేషన్ వంటి సేవలకు SMS అవసరం. కొన్ని తక్కువ ధర ప్లాన్‌లలో SMSల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. ఇది కూడా సరిచూసుకుని రీఛార్జ్ చేయడం ముఖ్యం. 

5G వాడేవాళ్లు ఇది మర్చిపోవద్దు

మీ దగ్గర 5G ఫోన్ ఉన్నప్పటికీ మీ ఏరియాలో 5G సర్వీస్ ఉండటం ముఖ్యం. మీరు ఎంచుకునే ప్లాన్ 5Gకి అర్హత కలిగి ఉందో లేదో కూడా చూడాలి. లేదంటే 5G ఫోన్ ఉన్నా 4G వేగంతోనే వాడాల్సిన పరిస్థితి వస్తుంది.

55
రూ.199 తో రీచార్జ్ చేసేముందు ఇవి తెలుసుకొండి
Image Credit : ChatGPT

రూ.199 తో రీచార్జ్ చేసేముందు ఇవి తెలుసుకొండి

చాలామంది ఒక్కోసారి ఆటో రీఛార్జ్‌ను ఆన్ చేసి మర్చిపోతారు. దీనివల్ల అనవసరమైన సమయంలో కూడా డబ్బు కట్ అవ్వొచ్చు… వేరే మంచి ప్లాన్‌కు మారే అవకాశాన్ని కోల్పోవచ్చు. కాబట్టి ఆటో రీఛార్జ్ సెట్టింగ్స్‌ను అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం మంచిది. 

రీఛార్జ్ చేసే ముందు ఈ 7 విషయాలు చెక్ చేసుకోండి

  • ప్లాన్ వ్యాలిడిటీ 
  • రోజువారీ లేదా మొత్తం డేటా 
  • అన్‌లిమిటెడ్ కాల్స్ 
  • SMSల సంఖ్య 
  • 5G అర్హత
  • OTT లేదా అదనపు బెనిఫిట్స్
  • ఆటో రెన్యూవల్ సెట్టింగ్

రూ.199 రీఛార్జ్ అందరికీ సరైన ఎంపిక అని చెప్పలేం. మీ వాడకానికి తగిన ప్లాన్‌ను ఎంచుకోవడమే తెలివైన పని. కేవలం ధర చూసి రీఛార్జ్ చేసే బదులు వ్యాలిడిటీ, డేటా, కాల్స్, SMS, అదనపు ఆఫర్లను పోల్చి చూశాకే రీఛార్జ్ చేస్తే, అనవసర ఖర్చును నివారించవచ్చు… మీ డబ్బుకు పూర్తి విలువను పొందవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Recharge Plan: ఖ‌త‌ర్నాక్ రీఛార్జ్ ప్లాన్‌... 55 రూపాయ‌ల‌తో 1000కిపైగా లైవ్ టీవీ ఛాన‌ల్స్
Recommended image2
Recharge Plan: రోజుకు 1.5 జీబీ డేటా 84 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved