MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • Gold Rate Today: చర్చలకు సిద్ధమైన అమెరికా-ఇరాన్..ఇవాళ స్థిరంగా బంగారం ధరలు

Gold Rate Today: చర్చలకు సిద్ధమైన అమెరికా-ఇరాన్..ఇవాళ స్థిరంగా బంగారం ధరలు

Gold Rate Today: అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, తాజాగా రెండు దేశాలు చర్చలకు సిద్ధమవుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది. దీంతో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 03 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చర్చలకు సిద్ధమైన అమెరికా ఇరాన్
Image Credit : chatgpt

చర్చలకు సిద్ధమైన అమెరికా-ఇరాన్

గత కొన్నిరోజులుగా ఇరాన్‌పై అమెరికా భారీ స్థాయిలో దాడులు చేపట్టే అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతుండగా, ప్రస్తుతం మిలిటరీ ఆపరేషన్‌ను నిలిపివేసి దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, తాజాగా రెండు దేశాలు చర్చలకు సిద్ధమవుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ప్రపంచ మార్కెట్లకు కొంత ఊరటనిచ్చింది. దీంతో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పెట్టుబడిదారుల్లో  ఆందోళన
Image Credit : Asianet News

పెట్టుబడిదారుల్లో ఆందోళన

ట్రంప్ వ్యాఖ్యల ప్రకారం, అమెరికా అత్యంత భారీ సైనిక దాడికి సిద్ధమైనప్పటికీ, అది జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ఆపరేషన్‌గా నిలిచేదన్నారు. అయితే పశ్చిమాసియాలోని మిత్రదేశాల సూచనలు, ప్రాంతీయ శాంతి దృష్ట్యా యుద్ధాన్ని పక్కనపెట్టి చర్చల మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళన కొంత తగ్గింది.

34
ఇవాళ స్థిరంగా బంగారం ధరలు
Image Credit : x.com/IDF

ఇవాళ స్థిరంగా బంగారం ధరలు

సాధారణంగా ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు లేదా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమవుతాయనే సంకేతాలు రావడంతో బంగారం మార్కెట్లో పెద్ద ఎత్తున కొనుగోళ్లు కనిపించలేదు. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి.

44
రూ.1,44,220గా 24 క్యారెట్ల బంగారం
Image Credit : X

రూ.1,44,220గా 24 క్యారెట్ల బంగారం

తాజా ధరల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,220గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,200 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి ధర రూ.2,35,000గా నమోదైంది.రానున్న రోజుల్లో అమెరికా-ఇరాన్ చర్చలు విజయవంతమైతే అంతర్జాతీయ మార్కెట్లలో రిస్క్ తగ్గే అవకాశం ఉంది. అప్పుడు బంగారం ధరలపై ఒత్తిడి పెరిగి స్వల్ప తగ్గుదల కనిపించవచ్చు. అయితే చర్చలు విఫలమై మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటే పెట్టుబడిదారులు తిరిగి బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Related Stories
Recommended image1
Gold Price Hike: పరుగులు పెడుతున్న బంగారం..పూర్తిగా తగ్గని అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు
Recommended image2
Gold Price Hike: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు...పరుగులు పెడుతున్న బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved