MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Silver Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి...రూ.2లక్షలకు పడిపోతున్న వెండి

Gold Silver Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి...రూ.2లక్షలకు పడిపోతున్న వెండి

Gold Silver Rate: తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తులం ధర మరింత దిగొస్తుందని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు తాజా పెరుగుదల నిరాశ కలిగిస్తోంది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్‌లో 22, 24 క్యారెట్ల పసిడి ధరలు ఎంత ఉన్నాయో తెలుసా?

1 Min read
Author : Nandini Arava
Published : Oct 24 2026, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మళ్లీ పెరిగిన పసిడి..దిగొచ్చిన వెండి
Image Credit : Asianet News

మళ్లీ పెరిగిన పసిడి..దిగొచ్చిన వెండి

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ధరలు మరింత తగ్గుతాయని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఈ పరిణామం కొంత నిరాశ కలిగిస్తోంది. శనివారం హైదరాబాద్‌లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర మాత్రం తగ్గింది. మరి ప్రస్తుతం పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,42,580కు చేరిన బంగారం
Image Credit : Asianet News

రూ.1,42,580కు చేరిన బంగారం

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ.1,42,580కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 పెరిగి రూ.1,30,700గా నమోదైంది. ఇక ఆభరణాల తయారీలో ఉపయోగించే 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.80 పెరిగింది. దీంతో ఈ ధర రూ.1,06,940కు చేరింది.

ఇటీవల బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలా? లేక మరికొంతకాలం వేచి చూడాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు.

34
మళ్లీ తగ్గిన వెండి ధర
Image Credit : Getty

మళ్లీ తగ్గిన వెండి ధర

బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2.20 లక్షలకు చేరింది. వెండి కొనాలనుకునేవారికి ఈ తగ్గుదల కొంత ఊరటనిచ్చింది.

44
బంగారం ధరలు ఎందుకు మారుతున్నాయి?
Image Credit : Getty

బంగారం ధరలు ఎందుకు మారుతున్నాయి?

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల కదలికలు, డాలర్ విలువలో మార్పులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కూడా ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.

అయితే, బంగారం ధరలు మళ్లీ తగ్గుతాయా లేదా మరింత పెరుగుతాయా అనేది కచ్చితంగా చెప్పలేం. ఆభరణాలు కొనుగోలు చేసేవారు రోజువారీ ధరలను పరిశీలించడంతో పాటు, జీఎస్టీ, తరుగు, మజూరీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Second Hand Mobile: సెకండ్‌ హ్యాండ్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ బిజినెస్‌లో లాభాలు ఎలా ఉంటాయి?
Recommended image2
Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్
Recommended image3
Jio IPO: జియో ఐపీఓ సంచలనం.. భారత్‌లో ఫస్ట్ టైమ్ 10 మిలియన్లకు పైగా దరఖాస్తులతో రికార్డు
Related Stories
Recommended image1
Gold Silver Rate: దసరా నుంచి దిగొస్తున్న పసిడి, వెండి..ధరలు చూస్తే కొనాలనిపిస్తోందా?
Recommended image2
Gold Silver Rate: పశ్చిమాసియా యుద్ధం వల్ల రెండో రోజూ కుప్పకూలిన పసిడి, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved