MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో రెండో రోజు బంగారం ధరలకు బ్రేక్

Gold Price Hike: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో రెండో రోజు బంగారం ధరలకు బ్రేక్

Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మరోసారి షాక్ తగిలింది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్లు...ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

2 Min read
Author : Nandini Arava
Published : Jul 25 2026, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ధరలకు బ్రేక్
Image Credit : chatgpt

పసిడి ధరలకు బ్రేక్

ఈ వారం ప్రారంభంలోనే బంగారం ధరలు వరుసగా పెరిగాయి. గురువారం, శుక్రవారం కొంత తగ్గడంతో ఇక ధరలు మరింత దిగొస్తాయని చాలా మంది భావించారు. కానీ శనివారం మార్కెట్ ఓ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. రెండు రోజుల తగ్గుదలకు బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,930గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.600 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850గా ఉండగా... ఇది కూడా రూ.550 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 

ఇక వెండి విషయానికి వస్తే... అంతర్జాతీయ మార్కెట్ కదలికలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో కూడా ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్‌ను బట్టి వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న ప్రపంచ పరిణామాలు
Image Credit : Asianet News

మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న ప్రపంచ పరిణామాలు

అమెరికాలో ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వస్తే... పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి. అమెరికా డాలర్ విలువలో ప్రతి చిన్న మార్పు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. డాలర్ బలహీనపడితే అంతర్జాతీయ పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి కొనుగోలు చేస్తారు. ఫలితంగా ధరలు పైకి వెళ్తాయి.

Related Articles

Related image1
Gold Price Hike: ఇంకా చల్లారని యుద్ధ మంటలు..బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు
Related image2
Gold Price Crash: ఇవాళ కుప్పకూలిన బంగారం ధరలు..అంతర్జాతీయ పరిస్థితులతో పసిడిపై ఒత్తిడి
34
గమనిస్తున్న మార్కెట్లు
Image Credit : Asianet News

గమనిస్తున్న మార్కెట్లు

ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ పరిస్థితులు లేదా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే... పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ లాంటి రిస్కీ ఆస్తుల నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడులు పెడతారు. అయితే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధంగా మారిన పరిస్థితి లేదు. అయినప్పటికీ మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులపై మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి ప్రతికూల పరిణామం జరిగినా... బంగారంపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు తగ్గితే ధరలు కాస్త శాంతించే అవకాశం ఉంది.

44
పరిస్థితులు ఎప్పుడు ఎలా అయినా మారొచ్చు
Image Credit : Chat gpt

పరిస్థితులు ఎప్పుడు ఎలా అయినా మారొచ్చు

అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్, మధ్యప్రాచ్య పరిణామాలు, తర్జాతీయ స్పాట్ గోల్డ్ ధరలు, ఈ నాలుగు అంశాలే బంగారం ధరలకు కీలకంగా మారనున్నాయి. ఈ పరిణామాలను బట్టి గోల్డ్ ధరలు మరోసారి పెరిగే అవకాశమూ ఉంది... లేక కొంత మేర తగ్గే అవకాశమూ ఉంది. అందుకే బంగారం కొనుగోలు చేసే వారు రోజువారీ ధరలను తప్పకుండా గమనించడం మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొండి.. మీ పైస‌లే, పైస‌ల‌ను సంపాదిస్తాయి
Recommended image2
ఇదొక్కటి ఉంటే చాలు.. కారులోనే ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టుకోవ‌చ్చు. ధ‌ర కూడా త‌క్కువే
Recommended image3
Business Ideas: డే కేర్ సెంట‌ర్‌.. ఇప్పుడిదే ట్రెండీ బిజినెస్‌. క్లిక్ అయితే ల‌క్ష‌ల్లో ఆదాయం ఖాయం
Related Stories
Recommended image1
Gold Price Hike: ఇంకా చల్లారని యుద్ధ మంటలు..బ్రేక్ లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు
Recommended image2
Gold Price Crash: ఇవాళ కుప్పకూలిన బంగారం ధరలు..అంతర్జాతీయ పరిస్థితులతో పసిడిపై ఒత్తిడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved