- Home
- Business
- Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్యా మారన్ తల్లి కావేరి స్వస్థలం కర్ణాటకలోని కొడగు. వ్యాపార రాజకీయ నేపథ్యం ఉన్న కావ్యా మారన్ త్వరలోనే సంగీత దర్శకుడు అనిరుధ్‌ను పెళ్లి చేసుకోనున్నారు. సన్ నెట్వర్క్ పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?

కావ్యా మారన్ రూట్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే కావ్యా మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె.
అయితే సన్ నెట్వర్క్ కుటుంబానికి చెందిన కావ్యా మారన్ రక్తంలో కర్ణాటక, ముఖ్యంగా కొడగు (కూర్గ్) ప్రాంతానికి చెందిన అనుబంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. కావ్యా మారన్ తల్లి కావేరి మారన్ స్వస్థలం కర్ణాటకలోని కొడగు జిల్లా.
కొడగు గడ్డపై పుట్టిన కావేరి మారన్ నేపథ్యం
కావ్యా మారన్ తల్లి కావేరి కలానిధి మారన్ కొడగు జిల్లా గోణికొప్పలు సమీపంలోని కైకేరి గ్రామానికి చెందిన జమ్మడ కుటుంబానికి చెందినవారు. జమ్మడ ఎ. బెళ్లయప్ప, నీనా దంపతుల కుమార్తే కావేరి. ఈ జమ్మడ కుటుంబానికి కొడగులో మంచి రాజకీయ, వ్యాపార నేపథ్యం ఉంది.
కావేరి తండ్రి బెళ్లయప్ప మద్రాస్‌లోని వేపేరి కింగ్ హాస్టల్లో నివసించేవారు. కావేరి చిన్నాన్న గయా కరుంబయ్య కొడగులో ప్రముఖ రాజకీయ నాయకుడిగా, జిల్లా పంచాయత్ అధ్యక్షుడిగా, హాకీ అంపైర్‌గా సేవలు అందించారు.
కావ్యా మారన్ వివాహ వేడుక విశేషాలు
వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంచుకునే కావ్యా మారన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కావ్యా మారన్ వివాహం నిశ్చయమైంది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
నవంబర్ 21న చెన్నైలో అట్టహాసంగా మ్యారేజ్ రిసెప్షన్ జరగనుంది. ఈ శుభకార్యం కోసం కలానిధి మారన్, కావేరి మారన్ దంపతులు వ్యాపార, రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రితో సహా పలువురు కీలక నాయకులకు ఆహ్వాన పత్రికలు అందాయి.
కావ్యా మారన్ చదువు, బిజినెస్ లైఫ్, కెరీర్ ప్రయాణం
1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించిన కావ్యా మారన్, అక్కడి స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూకేలోని ప్రతిష్ఠాత్మక వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంతో సన్ గ్రూప్ ఆస్తులకు ఆమె ఏకైక వారసురాలిగా ఉన్నారు.
2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన కావ్యా, ఐపీఎల్లో జట్టును బలమైన శక్త్నిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. క్రికెట్‌తో పాటు సన్ నెట్‌వర్క్‌కు చెందిన సన్ మ్యూజిక్, ఎఫ్ఎమ్ ఛానెళ్ల బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన రజనీకాంత్ జైలర్ మూవీ ఆడియో లాంచ్ వేడుకలోనూ మెరిశారు.
మారన్ కుటుంబం వ్యాపార, రాజకీయ ప్రభావం
కావ్యా మారన్ తండ్రి కలానిధి మారన్ ₹26,000 కోట్లకు పైగా నికర ఆస్తి కలిగిన సన్ గ్రూప్ వ్యవస్థాపకులు. తల్లి కావేరి మారన్ సన్ టీవీ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, భారతదేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన మహిళల లిస్టులో ఒకరిగా నిలిచారు. ఆమె ఏడాదికి సుమారు ₹87 కోట్ల వేతనాన్ని పొందుతున్నారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన కావేరి, 1991లో అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి వచ్చిన తర్వాత కలానిధి మారన్‌ను ప్రేమవివాహం చేసుకున్నారు.
1993లో సన్ టీవీ ప్రారంభమైనప్పటి నుంచి భర్తకు తోడుగా నిలిచారు. ఈ సంస్థ ఈరోజు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీలతో పాటు 2024లో 'సన్ నియో' ద్వారా హిందీ మార్కెట్‌కు విస్తరించి 30కి పైగా ఛానెళ్లను నడుపుతోంది. రాజకీయంగానూ మారన్ కుటుంబానికి పెద్ద నేపథ్యమే ఉంది. కావ్యా తాత మురసోలి మారన్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా, చిన్నాన దయాకర్ మారన్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కుటుంబంతోనూ వీరికి బంధుత్వం ఉంది. కరుణానిధి అక్క షణ్ముగసుందరి మనవరాలే కావ్యా మారన్.





