MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? మళ్లీ పెరిగిన పసిడి ధరలు..హైదరాబాద్ లో రేట్లు ఇవే

Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? మళ్లీ పెరిగిన పసిడి ధరలు..హైదరాబాద్ లో రేట్లు ఇవే

Gold Price Hike: బంగారం ధరల్లో మళ్లీ స్వల్ప పెరుగుదల నమోదైంది. నిన్న ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన పసిడి.. ఇవాళ ఎగబాకింది. అయితే పెరుగుదల పెద్దగా లేకపోయినా అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా బంగారం ధరలపై మరోసారి ఆసక్తి పెరిగింది.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 25 2026, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
Image Credit : adobe stock

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనను అమెరికా సెనెట్ తిరస్కరించడం కూడా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి పెడతారు. ఇందులో భాగంగానే బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కనిపిస్తున్న కదలికలకు కూడా ఇదొక కారణంగా చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రూ.1,52,840కి చేరిన పసిడి
Image Credit : our own

రూ.1,52,840కి చేరిన పసిడి

ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,52,840కి చేరింది. అంటే నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ బంగారం కొనుగోలుకు కొంత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం కూడా పెరిగింది. 10 గ్రాముల ధర రూ.150 ఎగబాకి రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.120 మేర పెరిగినట్లు మార్కెట్ ధరలు సూచిస్తున్నాయి. వెండి విషయానికి వస్తే.. కిలో ధర ప్రస్తుతం సుమారు రూ.2.55 లక్షల స్థాయిలో కొనసాగుతోంది. వెండి ధరలో మాత్రం ఈరోజు చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు.

33
మార్కెట్లు గమనించాలి
Image Credit : our own

మార్కెట్లు గమనించాలి

గురువారం మార్కెట్ ముగిసిన ధరలతో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.160, 22 క్యారెట్ల బంగారం రూ.150, 18 క్యారెట్ల బంగారం రూ.120 చొప్పున పెరిగాయి. మొత్తంగా చూస్తే ఇది స్వల్ప పెరుగుదలే. కానీ అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పసిడి ధరలు ఎలా కదులుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ విలువ, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు వంటి అనేక అంశాలపై ఆధారపడి మారుతుంటాయి. కాబట్టి ఇవాళ కనిపించిన పెరుగుదల ఆధారంగా వచ్చే వారం ధరల దిశను కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
GST On UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై 18% జీఎస్‌టీ? రూ. 2000 దాటితే కొత్త రూల్స్
Recommended image2
ఈ నెల 25వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు... కారణం ఏంటంటే.?
Recommended image3
Investment Schemes : రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు రిటర్న్.. మీ డబ్బును డబుల్ చేసే సూపర్ స్కీమ్స్!
Related Stories
Recommended image1
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image2
Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved