MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • GST On UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై 18% జీఎస్‌టీ? రూ. 2000 దాటితే కొత్త రూల్స్

GST On UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై 18% జీఎస్‌టీ? రూ. 2000 దాటితే కొత్త రూల్స్

UPI Payments: సామాన్య వినియోగదారులు రోజూ జరిపే యూపీఐ లావాదేవీలపై 18% జీఎస్‌టీ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 25 2026, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
UPI పేమెంట్స్ లో కీలక మార్పులు
Image Credit : Chatgpt

UPI పేమెంట్స్ లో కీలక మార్పులు

టీ కొట్టు దగ్గర రూ. 10 స్కాన్ చేయడం దగ్గర్నుంచి పెద్ద షాపింగ్ మాల్స్‌లో వేలల్లో పేమెంట్స్ చేయడం వరకు ఈ రోజుల్లో మనందరికీ యూపీఐ అలవాటుగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఈ యూపీఐ పేమెంట్స్ రూల్స్‌లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. పేమెంట్ అగ్రిగేటర్లు వ్యాపారుల నుంచి వసూలు చేసే ఫీజుపై 18% జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) విధించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ ప్రతిపాదనపై కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎండీఆర్ అంటే ఏమిటి? ఎవరిపై ఈ భారం?
Image Credit : AI Generated

ఎండీఆర్ అంటే ఏమిటి? ఎవరిపై ఈ భారం?

యూపీఐ ట్రాన్సాక్షన్లపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ పైన జీఎస్టీ పడుతుందా లేదా అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. సేవలకు సంబంధించిన ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుందనీ, కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రజల సంక్షేమం దృష్ట్యా వ్యాపారులపై పడే ఈ ఫీజుపై 18% జీఎస్టీ అంశాన్ని కౌన్సిల్ పరిశీలిస్తుందని ఆశిస్తున్నారు. గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియం విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్న సంగతి తెలిసిందే.

35
అక్టోబర్ 7న జీఎస్టీ కౌన్సిల్ భేటీ
Image Credit : Asianet News

అక్టోబర్ 7న జీఎస్టీ కౌన్సిల్ భేటీ

జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం అక్టోబర్ 7న జరగనుంది. ఈ మీటింగ్‌లో ప్రాసెస్ సరళీకరణ, సింప్లిఫికేషన్‌పై ప్రధానంగా దృష్టి పెడతారని తెలుస్తోంది. యూపీఐ ఎండీఆర్ పై జీఎస్టీ అంశం ప్రస్తుతానికి అజెండాలో నేరుగా లేకపోయినప్పటికీ, కౌన్సిల్ దీనిపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం యూపీఐ ఎండీఆర్ పై అమలు తేదీని వాయిదా వేసే ఆలోచనలో లేదు. అక్టోబర్ 15 నుంచి కేటాయించిన రూల్స్ అమలులోకి రానున్నాయి. యూపీఐ వ్యవస్థను సరిగ్గా నిర్వహించడానికి అయ్యే ఖర్చును ఈ ఎండీఆర్ ఛార్జీలు పూర్తిగా భర్తీ చేయలేవని ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

45
అక్టోబర్ 15 నుంచి రూ. 2000 దాటితే 0.4% ఎండీఆర్
Image Credit : Gemini AI

అక్టోబర్ 15 నుంచి రూ. 2000 దాటితే 0.4% ఎండీఆర్

వ్యాపారులకు చేసే ₹2000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై 0.4% ఎండీఆర్ ను అక్టోబర్ 15 నుంచి వర్తింపజేయనున్నారు. అలాగే ₹75,000 లేదా అంతకంటే ఎక్కువ చేసే పేమెంట్స్‌పై ఈ ఛార్జీలు గరిష్ఠంగా ₹300 మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సాధారణ వ్యక్తుల మధ్య జరిగే పర్సన్-టు-పర్సన్ ట్రాన్సాక్షన్లకు, చిన్న చిన్న అమౌంట్ పేమెంట్లకు ఎలాంటి ఫీజు ఉండదు. ఎండీఆర్ అనేది వ్యాపారులు భరించాల్సిన బ్యాక్-ఎండ్ ఫీజు. సెటిల్మెంట్ సమయంలో బ్యాంకులు ఆటోమేటిక్‌గా ఈ మొత్తాన్ని కట్ చేసుకుంటాయి.

55
18% జీఎస్టీ లెక్కింపు ఎలా ఉంటుంది?
Image Credit : Asianet News

18% జీఎస్టీ లెక్కింపు ఎలా ఉంటుంది?

చాలామందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే.. ఈ 18% జీఎస్టీ అనేది మనం చేసే మొత్తం పేమెంట్ మీద పడుతుందా అని. అసలు కాదు.. 18% జీఎస్టీ అనేది ₹2000 దాటిన పూర్తి అమౌంట్ మీద పడదు. కేవలం ఎండీఆర్ అమౌంట్ మీద మాత్రమే పడుతుంది. ఒక ఉదాహరణ గమనిస్తే..

• ఒక కస్టమర్ షాప్‌లో ₹10,000 యూపీఐ పేమెంట్ చేశారనుకుందాం.

• 0.4% ఎండీఆర్ ఛార్జ్ లెక్కన వ్యాపారి నుంచి ₹40 ఎండీఆర్ కట్ అవుతుంది.

• ఆ కట్ అయిన ₹40 ఎండీఆర్ పై 18% జీఎస్టీ పడుతుంది. అంటే ₹7.20 జీఎస్టీ అవుతుంది.

• దీనితో వ్యాపారికి అయ్యే మొత్తం ఖర్చు ₹47.20 అవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
పర్సనల్ పైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ నెల 25వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు... కారణం ఏంటంటే.?
Recommended image2
Investment Schemes : రూ.5 లక్షలు పెడితే రూ.10 లక్షలు రిటర్న్.. మీ డబ్బును డబుల్ చేసే సూపర్ స్కీమ్స్!
Recommended image3
Most Expensive Areas India: భారత్‌లో అత్యంత ఖరీదైన టాప్ 5 ఏరియాస్ ఇవే.. ఇక్కడ ఒక బంగ్లా ధర వందల కోట్లు
Related Stories
Recommended image1
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image2
OTT: క్రైమ్, యాక్షన్, రొమాన్స్‌.. ఈ వారం ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved