MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Silver Price: పాతాళానికి పడిపోయిన బంగారం.. 11 నెలల కనిష్టానికి వెండి

Gold Silver Price: పాతాళానికి పడిపోయిన బంగారం.. 11 నెలల కనిష్టానికి వెండి

Gold Silver Price: కొన్నాళ్లుగా చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. పసిడి ధరలు భారీగా తగ్గగా.. వెండి ధరలు 11 నెలల కనిష్టానికి చేరాయి. ఒక్కరోజే తులం బంగారంపై వేల రూపాయలు, కిలో వెండిపై రూ.10 వేల మేర తగ్గుదల నమోదైంది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 31 2026, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీగా పడిపోయిన బంగారం
Image Credit : chatgpt

భారీగా పడిపోయిన బంగారం

బంగారం కొనాలనుకునే వారికి ఇది ఊరటనిచ్చే వార్తే. గత కొంతకాలంగా వరుస హెచ్చుతగ్గులతో ఆందోళనకు గురిచేసిన పసిడి ధరలు శనివారం భారీగా తగ్గాయి. గుడ్‌రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,880గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే ఏకంగా రూ.3,880 తగ్గింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,300కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే రూ.3,100 మేర దిగొచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వెండి కూడా పతనం
Image Credit : Getty

వెండి కూడా పతనం

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.10,000 తగ్గుదల నమోదై ధర రూ.2 లక్షలకు చేరింది. దీంతో వెండి ధరలు గత 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు ఇలా ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ధరలు మరింత తగ్గుతాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనే విషయంలో మార్కెట్‌ పరిస్థితులను గమనించాల్సి ఉంటుంది.

34
పసిడి ధరలు పడిపోవడానికి కారణాలేంటి?
Image Credit : iSTOCK

పసిడి ధరలు పడిపోవడానికి కారణాలేంటి?

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు పసిడి మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలో అంచనాలను మించి జీడీపీ వృద్ధి నమోదవడం, సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం పెరగడం వంటి పరిణామాలు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలకు బలం చేకూర్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లు వంటి వడ్డీ ఆదాయం ఇచ్చే పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే బంగారంపై ఎలాంటి వడ్డీ ఆదాయం లభించదు. దీంతో పసిడిపై పెట్టుబడుల ఆసక్తి తగ్గి ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంది.

44
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. మార్కెట్లలో అనిశ్చితి
Image Credit : Getty

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. మార్కెట్లలో అనిశ్చితి

మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కూడా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. సాధారణంగా యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్ కదలికలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా పేరున్న బంగారం సైతం భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది.

మొత్తంగా అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినప్పటికీ, పెట్టుబడి పెట్టాలనుకునేవారు మార్కెట్ కదలికలను గమనించడం అవసరం. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతాయా? లేక మరింత తగ్గుతాయా? అనేది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్ నుంచి రూ.5876 కోట్ల వస్తువులు కొన్న పాకిస్తాన్.. ఏమేం కొన్నారంటే
Recommended image2
Phonepe: 11 రూపాయ‌ల‌తో రూ. 25 వేల హెల్త్ పాల‌సీ.. ఫోన్‌పేలో అదిరిపోయే ఆఫర్
Recommended image3
Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !
Related Stories
Recommended image1
Gold Silver Price: ఈ దీపావళికి బంగారం కొనగలమా? మూడో రోజు ఆకాశాన్నింటిన పసిడి
Recommended image2
Gold Silver Price: దీపావళి వేళ పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్...పాతాళానికి దిగొచ్చిన బంగారం, వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved