MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Silver Price: దీపావళి వేళ పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్...పాతాళానికి దిగొచ్చిన బంగారం, వెండి

Gold Silver Price: దీపావళి వేళ పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్...పాతాళానికి దిగొచ్చిన బంగారం, వెండి

Gold Silver Price: దీపావళి పండుగకు ముందు బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. అటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. దీంతో పండుగ వేళ నగలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఊరట లభిస్తోంది.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 30 2026, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దీపావళికి ముందు బంగారం ధరలు భారీగా పతనం
Image Credit : AI Image

దీపావళికి ముందు బంగారం ధరలు భారీగా పతనం

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పసిడి ధరల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య పెట్టుబడిదారులు బంగారం కంటే అధిక రాబడులు అందించే అమెరికా బాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారంపై పెట్టుబడుల ఆసక్తి తగ్గి ధరలపై ఒత్తిడి ఏర్పడుతోంది.

మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, డాలర్ బలపడటం కూడా పసిడి ధరల కదలికలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలతో దీపావళికి ముందు బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
Image Credit : pexels

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో అక్టోబర్ 30న బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,690 తగ్గి రూ.1,42,260 వద్దకు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,30,400 పలుకుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,270 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,06,690 వద్ద ట్రేడవుతోంది. మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు ఒక్కరోజులోనే భారీగా దిగిరావడంతో పసిడి ప్రియులకు కొంత ఊరట లభించింది.

34
వెండి ధరలు కూడా భారీగా డౌన్
Image Credit : Getty

వెండి ధరలు కూడా భారీగా డౌన్

బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల భారీ హెచ్చుతగ్గులకు లోనవుతున్న వెండి మార్కెట్‌లో మరోసారి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,10,000కు చేరింది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి కూడా కొంత ఉపశమనం లభించింది.

44
దీపావళి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?
Image Credit : Pixabay

దీపావళి కొనుగోళ్లకు ఇదే సరైన సమయమా?

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ బంగారం, వెండి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కలిసొచ్చే పరిణామం. అయితే ధరలు ఇంకా తగ్గుతాయా? లేక మళ్లీ పెరుగుతాయా? అనేది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ కదలికలు, అమెరికా వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది.

అయితే నగలు కొనుగోలు చేసేవారు మార్కెట్ ధరలతో పాటు జీఎస్టీ, తరుగు, మేకింగ్ ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. బులియన్ మార్కెట్‌లో ధరలు మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షాపులో తాజా ధరలను నిర్ధారించుకోవడం మంచిది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
SIP vs Lumpsum: నెలకు రూ. 15 వేలు కడితే రూ. 3 కోట్లు ఎలా వస్తాయి? ఈ సీక్రెట్ లంప్‌సమ్ ట్రిక్ ఇదే !
Recommended image2
Gold Price: తులం బంగారం రూ. 2 ల‌క్ష‌లు కానుందా.? అస‌లు లెక్క‌లు ఇవే
Recommended image3
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రూ.2000 జమా.. పూర్తి వివరాలు ఇవే
Related Stories
Recommended image1
Gold Silver Price: ఈ దీపావళికి బంగారం కొనగలమా? మూడో రోజు ఆకాశాన్నింటిన పసిడి
Recommended image2
Gold Silver Rates: హౌతీల దాడుల వేళ మార్కెట్‌లో గందరగోళం.. రూ.2లక్షలకు పడిపోతున్న వెండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved