MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !

Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !

Mukesh Ambani: రూ.21 లక్షల కోట్ల రిలయన్స్ వ్యాపారాన్ని అంబానీ కుటుంబం ఎలా నడుపుతోంది? జియో, రిటైల్, గ్రీన్ ఎనర్జీలో ఆకాశ్, ఇషా, అనంత్‌ల రోల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 30 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రూ.21 లక్షల కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం: ముకేశ్ అంబానీ కుటుంబంలో ఎవరికి ఏ బాధ్యతలు?
Image Credit : Chatgpt

రూ.21 లక్షల కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం: ముకేశ్ అంబానీ కుటుంబంలో ఎవరికి ఏ బాధ్యతలు?

భారతదేశంలోనే అత్యంత భారీ బిజినెస్ నెట్‌వర్క్ అంటే మనకు ముకేశ్ అంబానీ లీడ్ చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) గుర్తుకొస్తుంది. ప్రెజెంట్ ఈ కంపెనీ మొత్తం వాల్యూ దాదాపు రూ.21 లక్షల కోట్లకు పైగానే ఉంది. ముకేశ్ అంబానీ విజన్ వల్ల ఈ కంపెనీ దేశంలోనే నంబర్ వన్ బిజినెస్ గ్రూప్‌గా మారింది.

అయితే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కోసం అంబానీ తన ప్లాన్స్ మార్చేశారు. తన ముగ్గురు పిల్లలైన ఆకాశ్, ఇషా, అనంత్‌లకు గ్రూప్ లోని మెయిన్ బిజినెస్‌లను అప్పగించారు. జియో డిజిటల్, రిటైల్, గ్రీన్ ఎనర్జీ వర్టికల్స్ బాధ్యతలను వారికి ఇచ్చారు. మరోవైపు నీతా అంబానీ సోషల్, కల్చరల్ విషయాలను చూస్తున్నారు. ముకేశ్ అంబానీ వీరందరికీ గైడెన్స్ ఇస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ముకేశ్ అంబానీ: ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
Image Credit : stockPhoto

ముకేశ్ అంబానీ: ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్

ముకేశ్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌కు మేజర్ స్ట్రాటజిస్ట్‌గా ఉన్నారు. కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆయనదే. ప్రెజెంట్ ఆయన మెయిన్ ఫోకస్ సక్సెషన్ ప్లానింగ్ మీదనే ఉందని బిజినెస్ వర్గాల టాక్. అంటే నెక్స్ట్ జనరేషన్‌కు బిజినెస్ బాధ్యతలు స్మూత్‌గా ట్రాన్స్‌ఫర్ చేయడం ఆయన లక్ష్యం.

కంపెనీని పూర్తిగా అప్పులు లేని ఆర్గనైజేషన్‌గా మార్చాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఆయిల్ అండ్ పెట్రోకెమికల్స్ వంటి పాత సాంప్రదాయ బిజినెస్‌లను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు, తన పిల్లలకు ప్రతి విషయంలో సరైన సలహాలు ఇస్తూ గైడ్ చేస్తున్నారు. రిలయన్స్‌ను గ్లోబల్ టెక్ అండ్ ఎనర్జీ లీడర్‌గా మార్చడమే ఆయన మెయిన్ టార్గెట్.

36
నీతా అంబానీ: ఫౌండర్ అండ్ ఛైర్‌పర్సన్ - రిలయన్స్ ఫౌండేషన్
Image Credit : dais.edu.in

నీతా అంబానీ: ఫౌండర్ అండ్ ఛైర్‌పర్సన్ - రిలయన్స్ ఫౌండేషన్

నీతా అంబానీ రిలయన్స్ గ్రూప్ సామాజిక, సాంస్కృతిక, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌ను లీడ్ చేస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్, విపత్తు నిర్వహణ విభాగాల్లో ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు.

ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్‌ను చూసుకుంటారు. నీతా అంబానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లో మెంబర్‌గా కూడా ఉన్నారు. ముంబైలో 'నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ను స్టార్ట్ చేసి, భారతీయ ఆర్ట్ అండ్ కల్చర్‌ను వరల్డ్ లెవెల్‌కు తీసుకెళ్లారు.

46
ఆకాశ్ అంబానీ: ఛైర్మన్ - రిలయన్స్ జియో
Image Credit : ANI

ఆకాశ్ అంబానీ: ఛైర్మన్ - రిలయన్స్ జియో

ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ గ్రూప్‌లోని టెలికామ్ అండ్ డిజిటల్ బిజినెస్ చూస్తున్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఆయన చేతిలోనే ఉన్నాయి.

జియోను కేవలం నార్మల్ టెలికామ్ ఆపరేటర్‌గా ఉంచకుండా, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కంపెనీగా మార్చడమే ఆయన మెయిన్ రోల్. ఇండియా వ్యాప్తంగా 5G నెట్‌వర్క్ ఎక్స్‌పాన్షన్, జియో సినిమా, జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వర్క్స్ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఫ్యూచర్ టెక్నాలజీస్‌పై ఆకాశ్ ఫుల్ ఫోకస్ పెట్టారు.

56
ఇషా అంబానీ: నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - రిలయన్స్ రిటైల్
Image Credit : Getty

ఇషా అంబానీ: నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - రిలయన్స్ రిటైల్

ఆకాశ్ అంబానీ ట్విన్ సిస్టర్ ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) లీడ్ చేస్తున్నారు. రెవెన్యూ పరంగా ఇది ఇండియాలోనే లార్జెస్ట్ రిటైల్ కంపెనీగా ఉంది.

సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ బ్రాండ్స్ (ట్రెండ్స్, అజియో), ఈ-కామర్స్, కన్స్యూమర్ గూడ్స్ వర్టికల్స్ అన్నీ ఇషా మేనేజ్ చేస్తున్నారు. గ్లోబల్ లగ్జరీ బ్రాండ్స్‌తో టైఅప్స్ పెట్టుకోవడమే కాకుండా, లోకల్ బ్రాండ్స్‌ను ఎంకరేజ్ చేయడానికి 'ఇండిపెండెన్స్' వంటి కొత్త బ్రాండ్స్‌ను లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ బిజినెస్ జియాంట్స్‌కు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారు.

66
అనంత్ అంబానీ: డైరెక్టర్ - రిలయన్స్ న్యూ ఎనర్జీ
Image Credit : Jio Youtube Channel

అనంత్ అంబానీ: డైరెక్టర్ - రిలయన్స్ న్యూ ఎనర్జీ

ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రిలయన్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయిన గ్రీన్ ఎనర్జీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్‌ను హెడ్ చేస్తున్నారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భారీగా నిర్మిస్తున్న 'ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గీగా కాంప్లెక్స్' డెవలప్‌మెంట్ ఆయన అండర్‌లోనే జరుగుతోంది. 2035 నాటికి రిలయన్స్‌ను నెట్-కార్బన్ జీరో కంపెనీగా మార్చడమే ఆయన టార్గెట్. సోలార్ ప్యానెల్స్, గ్రీన్ హైడ్రోజన్, అడ్వాన్స్డ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ ఇందులో ఉన్నాయి. బిజినెస్‌తో పాటు యానిమల్ వెల్ఫేర్ కోసం జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్ రెస్క్యూ సెంటర్ 'వంతారా' ను కూడా అనంత్ అంబానీ స్టార్ట్ చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
4th T20 • NZ vs IND 2026
Innings Break
NZNZ
(20.0 ov)259/7
INDIND
-
IND chose to bowl.
Schedule ›
3rd TEST • SA vs AUS
Live
SASA
(56.2 ov) 329 & 158/4
AUSAUS
429
Day 4 - Session 1
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
PM kisan: పీఎం కిసాన్ 24వ విడత డబ్బులు ఖాతాలో పడలేదా? రైతులు వెంటనే చేయాల్సిన పనులివే!
Recommended image2
Gold Silver Price: దీపావళి వేళ పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్...పాతాళానికి దిగొచ్చిన బంగారం, వెండి
Recommended image3
SIP vs Lumpsum: నెలకు రూ. 15 వేలు కడితే రూ. 3 కోట్లు ఎలా వస్తాయి? ఈ సీక్రెట్ లంప్‌సమ్ ట్రిక్ ఇదే !
Related Stories
Recommended image1
SIP vs Lumpsum: నెలకు రూ. 15 వేలు కడితే రూ. 3 కోట్లు ఎలా వస్తాయి? ఈ సీక్రెట్ లంప్‌సమ్ ట్రిక్ ఇదే !
Recommended image2
World’s Most Expensive Almond: ప్రపంచంలోనే ఖరీదైన బాదం పప్పు ఇదే.. వీటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత ధర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved