MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Today Gold Rate: రష్యా తీసుకున్న నిర్ణయంతో పతనం దిశగా బంగారం, వెండి

Today Gold Rate: రష్యా తీసుకున్న నిర్ణయంతో పతనం దిశగా బంగారం, వెండి

Today Gold Rate: పసిడి మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల దృష్టి అంతా ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై పడింది. ఈ నేపథ్యంలో ధరలు మరింత పడిపోతాయా? ఇదే సరైన సమయమా?

1 Min read
Author : Nandini Arava
Published : Apr 24 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
Image Credit : Getty

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు ప్రస్తుతం మంచి అవకాశం దొరికినట్టే కనిపిస్తోంది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల వ్యూహాలు, ముడి చమురు ధరల మార్పులు ఇవన్నీ కలిపి పసిడి రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. 

25
4 రోజుల్లో రూ.3వేలు పతనం
Image Credit : Getty

4 రోజుల్లో రూ.3వేలు పతనం

గత నాలుగు రోజుల్లోనే తులం బంగారం ధర సుమారు రూ.2800 మేర తగ్గింది. తాజాగా ఏప్రిల్ 24న హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.600 మేర తగ్గి రూ.1,52,950కు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.550 మేర పడిపోయి 10 గ్రాములకు రూ.1,40,200 వద్ద నమోదైంది.

Related Articles

Related image1
Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు..గ్రాము పసిడి ఎంతుందో తెలుసా?
Related image2
Today Gold Price: పసిడి కొనడానికి ఇదే మంచి సమయం..అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు ఢమాల్
35
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం
Image Credit : Asianet News

అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం

బంగారం ధరల పతనానికి ప్రధాన కారణాల్లో అంతర్జాతీయ ఉద్రిక్తతలు కీలకంగా మారాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. హార్ముజ్ జలసంధి అంశం కూడా ఇంధన సరఫరాపై అనిశ్చితిని పెంచింది. 

45
రష్యా నిర్ణయమే కారణమా?
Image Credit : Asianet News

రష్యా నిర్ణయమే కారణమా?

ఇక ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, గరిష్ఠ స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతోంది. అదనంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల పెట్టుబడులు ఇతర మార్గాలకు మళ్లుతున్నాయి.

మరోవైపు, రష్యా భారీగా బంగారం విక్రయిస్తున్నట్లు వస్తున్న వార్తలు కూడా మార్కెట్లో సరఫరా పెరగడానికి కారణమవుతున్నాయి. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

55
నాలుగు సెషన్లలో క్షీణించిన కిలో వెండి
Image Credit : Getty

నాలుగు సెషన్లలో క్షీణించిన కిలో వెండి

బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. గత నాలుగు సెషన్లలో కిలో వెండి ధర రూ.15,000 వరకు తగ్గగా, ఒక్కరోజులోనే రూ.5,000 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గడం పెట్టుబడిదారులకు ఒక అవకాశం కావచ్చు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు ఇంకా అస్థిరంగా ఉండటంతో, ధరలు భవిష్యత్తులో మరింత మారే అవకాశం కూడా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : రూ.80 ఖర్చుతో రూ.800 లాభం... ఇంట్లోనే నెలకు రూ.30,000 సంపాదించే సూపర్ బిజినెస్
Recommended image2
మ‌రో కొత్త ఫీచ‌ర్‌.. ఇక‌పై వాట్సాప్‌లోనే మొబైల్ రీఛార్జ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Recommended image3
100 గ‌జాల స్థలం ఉంటే చాలు నెల‌కు రూ. 30 వేలు సంపాదించొచ్చు.. ఆలోవెరతో అద్భుతాలు
Related Stories
Recommended image1
Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు..గ్రాము పసిడి ఎంతుందో తెలుసా?
Recommended image2
Today Gold Price: పసిడి కొనడానికి ఇదే మంచి సమయం..అక్షయ తృతీయ తర్వాత మార్కెట్లు ఢమాల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved