MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు..గ్రాము పసిడి ఎంతుందో తెలుసా?

Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు..గ్రాము పసిడి ఎంతుందో తెలుసా?

Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ పసిడి రేట్లు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 Min read
Author : Nandini Arava
Published : Apr 22 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్
Image Credit : Getty

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

పసిడి ప్రియులకు ప్రస్తుతం అనుకూలమైన సమయం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో సెషన్‌లో తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. గత రెండు రోజుల్లో తులం బంగారం ధర రూ.1000కుపైగా పడిపోయింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా గత సెషన్‌లో భారీగా తగ్గి, ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రూ.1,54,750కు చేరిన మేలిమి బంగారం
Image Credit : Getty

రూ.1,54,750కు చేరిన మేలిమి బంగారం

ఇప్పుడు హైదరాబాద్ బులియన్ మార్కెట్ విషయానికి వస్తే, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఈరోజు మరో రూ.540 తగ్గి రూ.1,54,750 వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.1,41,850 వద్ద కొనసాగుతోంది. వరుసగా రెండు రోజులు ధరలు తగ్గడం వల్ల బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. 

34
స్థిరంగా కొనసాగుతున్న వెండి
Image Credit : X

స్థిరంగా కొనసాగుతున్న వెండి

వెండి ధరల విషయానికి వస్తే, గత సెషన్‌లో కిలోకు రూ.5వేలు వరకు తగ్గిన ధర ఈరోజు అదే స్థాయిలో స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,75,000 వద్ద ఉంది. భారీ తగ్గుదల తర్వాత స్థిరత్వం కనిపిస్తోంది. 

44
రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం
Image Credit : Getty

రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం

దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధోరణి కారణంగా రాబోయే రోజుల్లో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల పెట్టుబడి లేదా కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా గమనించడం అవసరం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Today Gold Rate: బంగారం కొనాలంటే ఇదే ఛాన్స్.. దిగొచ్చిన ధరలు
Recommended image2
Today Gold Rate: భారీగా పతనమైన వెండి..స్థిరంగా కొనసాగుతున్న పసిడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved