MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • EPFO: పీఎఫ్ అకౌంట్‌ మర్చిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త పోర్టల్ వచ్చేస్తోంది !

EPFO: పీఎఫ్ అకౌంట్‌ మర్చిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త పోర్టల్ వచ్చేస్తోంది !

EPFO E Praapti Portal: పాత, ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలను గుర్తించి, వాటిని ప్రస్తుత UAN నంబర్‌తో లింక్ చేసేందుకు ఈపీఎఫ్ఓ 'E-Praapti' పోర్టల్‌ను లాంచ్ చేస్తోంది. దీనివల్ల పీఎఫ్ క్లెయిమ్‌లు మరింత సులభం కానున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 05 2026, 10:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆధార్ ఉంటే చాలు.. ఆగిపోయిన పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్‌లోకి వస్తాయి!
Image Credit : Gemini

ఆధార్ ఉంటే చాలు.. ఆగిపోయిన పీఎఫ్ డబ్బులు మీ అకౌంట్‌లోకి వస్తాయి!

చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు పాత కంపెనీకి సంబంధించిన పీఎఫ్ వివరాలను మర్చిపోతుంటారు. అలాంటప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక, వాటిని ఎలా తీసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్‌డేట్‌ ఇచ్చింది. అదే ఈ-ప్రాప్తి (E-Praapti) పోర్టల్.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త పోర్టల్ వివరాలను వెల్లడించారు. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అసలు ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల మీకు కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అసలు ఈపీఎఫ్ఓ'ఈ-ప్రాప్తి' అంటే ఏంటి?
Image Credit : Asianet News

అసలు ఈపీఎఫ్ఓ'ఈ-ప్రాప్తి' అంటే ఏంటి?

ఈ పోర్టల్ పూర్తి పేరు "ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆధార్-బేస్డ్ యాక్సెస్ పోర్టల్ ఫర్ ట్రాకింగ్ ఇనోపరేటివ్ అకౌంట్స్" (ఈ-ప్రాప్తి). సింపుల్‌గా చెప్పాలంటే, మీ పాత పీఎఫ్ అకౌంట్లు ఏవైనా ఇనాక్టివ్‌గా ఉంటే, వాటిని వెతికి పట్టుకోవడానికి ఇది ఒక డిజిటల్ టూల్ లాంటిది. 2014 కంటే ముందు నుంచి పనిచేస్తున్న వారు లేదా అప్పట్లో UAN నంబర్ లేని వారు తమ పాత అకౌంట్లను ఆధార్ కార్డు ద్వారా సులభంగా గుర్తించవచ్చు.

Related Articles

Related image1
Aadhaar Card : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ 5 డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ప్రాసెస్ ఇదే!
Related image2
Thalapathy Vijay : తమిళ ప్రజల ప్రేమ ముందు డబ్బు ఓడిపోయింది.. విజయ్ దళపతి షాకింగ్ కామెంట్స్!
36
పీఎఫ్ ఇనాక్టివ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసా?
Image Credit : Social Media

పీఎఫ్ ఇనాక్టివ్ అకౌంట్ అంటే ఏంటో తెలుసా?

పీఎఫ్ నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి పని మానేసిన తర్వాత వరుసగా 36 నెలల పాటు ఆ అకౌంట్‌లో ఎలాంటి కొత్త డిపాజిట్లు పడకపోతే, దానిని ఇనోపరేటివ్ లేదా ఇనాక్టివ్ అకౌంట్ అంటారు. రిటైర్మెంట్ తర్వాత లేదా విదేశాలకు వెళ్లిపోయినప్పుడు కూడా ఇలా జరుగుతుంది. ఇలాంటి అకౌంట్లలో ఉన్న డబ్బుపై వడ్డీ రాదు. అందుకే వీటిని కనిపెట్టి, మెయిన్ అకౌంట్‌కు లింక్ చేయడం చాలా ముఖ్యం.

46
ఆధార్‌తో పాత అకౌంట్లు ఇట్టే లింక్
Image Credit : Asianet News

ఆధార్‌తో పాత అకౌంట్లు ఇట్టే లింక్

ఈ 'ఈ-ప్రాప్తి' పోర్టల్ పూర్తిగా ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీ పాత పీఎఫ్ మెంబర్ ఐడీని ఉపయోగించి అకౌంట్‌ను వెతకవచ్చు. ఒకవేళ మీకు ఐడీ గుర్తులేకపోయినా, భవిష్యత్తులో ఆధార్‌తోనే ట్రాక్ చేసే ఆప్షన్ కూడా తీసుకురానున్నారు. ఒకసారి అకౌంట్ దొరికిన తర్వాత, దానిని మీ ప్రస్తుత 12 అంకెల UAN తో లింక్ చేసుకోవచ్చు. దీనివల్ల డాక్యుమెంట్ల గోల ఉండదు, నేరుగా ఆన్‌లైన్‌లోనే పనులు అయిపోతాయి.

56
పీఎఫ్ క్లెయిమ్స్‌లో సరికొత్త రికార్డు
Image Credit : our own

పీఎఫ్ క్లెయిమ్స్‌లో సరికొత్త రికార్డు

పీఎఫ్ సేవలు ఇప్పుడు చాలా స్పీడ్ అయ్యాయి. మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఏకంగా 8.31 కోట్ల క్లెయిమ్స్‌ను సెటిల్ చేసి రికార్డు సృష్టించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇందులో 5.51 కోట్ల క్లెయిమ్స్ అడ్వాన్స్ లేదా పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు సంబంధించినవి. దాదాపు 71.11 శాతం క్లెయిమ్స్‌ కేవలం మూడు రోజుల్లోనే ఆటోమేటిక్‌గా సెటిల్ అయిపోయాయి.

66
ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలతో పెరిగిన పారదర్శకత
Image Credit : Freepik

ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవలతో పెరిగిన పారదర్శకత

గతంలో పీఎఫ్ డబ్బులు కావాలంటే కంపెనీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ అయ్యాయి. సుమారు 1.59 కోట్ల మంది మెంబర్లు తమ యజమాని ప్రమేయం లేకుండానే బ్యాంక్ అకౌంట్లను లింక్ చేసుకోగలిగారు. ఇప్పుడు రాబోతున్న 'ఈ-ప్రాప్తి' పోర్టల్ ద్వారా పేపర్ వర్క్ మరింత తగ్గుతుంది. పాత అకౌంట్ల కోసం ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అంతా మీ చేతిలో ఉన్న మొబైల్ నుంచే చేసేసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వ్యాపారం
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Aadhaar Card : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఈ 5 డాక్యుమెంట్లు ఉంటే చాలు.. ప్రాసెస్ ఇదే!
Recommended image2
Thalapathy Vijay : తమిళ ప్రజల ప్రేమ ముందు డబ్బు ఓడిపోయింది.. విజయ్ దళపతి షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved