MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • EPF + SIP అదిరిపోయే కాంబో.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో మీ అకౌంట్‌లోకి రూ. 1 కోటి పక్కా బాస్ !

EPF + SIP అదిరిపోయే కాంబో.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో మీ అకౌంట్‌లోకి రూ. 1 కోటి పక్కా బాస్ !

Wealth Creation: కోటి రూపాయలు సంపాదన టార్గెట్ పెట్టుకున్నారా? అయితే, ఈపీఎఫ్ భద్రత, ఎస్‌ఐపీ లాభాలు కలిపితే రూ. 1 కోటి టార్గెట్ చాలా ఈజీ. శాలరీ ఉద్యోగుల కోసం సూపర్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 27 2026, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మార్కెట్ రిస్క్ వద్దు, టెన్షన్ వద్దు.. ఈ ఫార్ములాతో సూపర్ ఫాస్ట్‌గా కోటి రూపాయలు మీ సొంతం !
Image Credit : Gemini

మార్కెట్ రిస్క్ వద్దు, టెన్షన్ వద్దు.. ఈ ఫార్ములాతో సూపర్ ఫాస్ట్‌గా కోటి రూపాయలు మీ సొంతం !

భారతదేశంలో ప్రతీ మిడిల్ క్లాస్ ఉద్యోగికి కోటి రూపాయలు సంపాదించాలనేది ఒక పెద్ద డ్రీమ్. పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్, సొంత ఇల్లు, లేదా హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్.. ఇలా కారణం ఏదైనా కావచ్చు, ఆ 1 కోటి రూపాయల మైల్‌స్టోన్ రీచ్ అయితే వచ్చే కిక్కే వేరు.

అయితే, కేవలం జీతం దాచుకుంటూ కూర్చుంటే ఈ కాలంలో కోటీశ్వరులు అవ్వడం కష్టం. దీనికోసం ఒక పక్కా ప్లాన్, క్రమశిక్షణ కావాలి. శాలరీ తీసుకునే ఉద్యోగుల కోసం మార్కెట్లో ఒక అదిరిపోయే ప్లాన్ ఉంది. అదే ఉద్యోగుల భవిష్య నిధి (EPF), మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కాంబినేషన్. ఈ రెండింటినీ కలిపి వాడితే చాలా వేగంగా మీ అకౌంట్‌లో కోటి రూపాయలు చూసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఈపీఎఫ్ అంటే ఏంటి? దీనివల్ల లాభం ఏంటి?
Image Credit : iSTOCK

ఈపీఎఫ్ అంటే ఏంటి? దీనివల్ల లాభం ఏంటి?

శాలరీ వచ్చే ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ అనేది ఒక బెస్ట్ రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో ఉద్యోగితో పాటు కంపెనీ కూడా బేసిక్ శాలరీ + డియర్‌నెస్ అలవెన్స్ నుంచి 12 శాతం చొప్పున కాంట్రిబ్యూట్ చేస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY 2025-26) గానూ ప్రభుత్వం దీనిపై 8.25 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీని ప్రతి నెలా క్యాలిక్యులేట్ చేసి, ఏడాదికి ఒకసారి మీ అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు.

అయితే, కేవలం ఈపీఎఫ్ ద్వారానే రూ. 1 కోటి టార్గెట్ రీచ్ అవ్వడం కొంచెం కష్టం. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ఇందులో వచ్చే రిటర్న్స్ తక్కువగా, కాన్సర్వేటివ్‌గా ఉంటాయి.

36
ఎస్‌ఐపీ పవర్ ఏంటో తెలుసా?
Image Credit : Asianet News

ఎస్‌ఐపీ పవర్ ఏంటో తెలుసా?

మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ అమౌంట్‌ను ఇన్వెస్ట్ చేయడాన్నే ఎస్‌ఐపీ అంటారు. ఇందులో మీరు ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. లాంగ్ టర్మ్‌లో ఈక్విటీ ఎస్‌ఐపీలు సగటున 12 నుంచి 15 శాతం వరకు వార్షిక రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

అయితే పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్ రిటర్న్స్‌కు గ్యారెంటీ కాదు. ఎస్‌ఐపీలో ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ. మీరు ప్రతి నెలా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసినా, ఒక 15 నుంచి 25 ఏళ్ల పాటు కంటిన్యూ చేస్తే ఆ మనీ ఊహించని రేంజ్‌లో పెరుగుతుంది.

46
EPF + SIP కాంబో: ఈ రెండు కలిస్తే..
Image Credit : Gemini

EPF + SIP కాంబో: ఈ రెండు కలిస్తే..

కేవలం ఈపీఎఫ్‌ను నమ్ముకుంటే పెరిగే ఖర్చులను తట్టుకోలేము. అలాగే కేవలం ఎస్‌ఐపీ మీదే డిపెండ్ అయితే మార్కెట్ రిస్క్ ఉంటుంది. ఈ రెండింటినీ కలిపినప్పుడు మీకు మూడు అద్భుతమైన లాభాలు అందుతాయి..

• ఆప్టిమల్ అసెట్ అలోకేషన్: మీకు తెలియకుండానే డెట్ (EPF), ఈక్విటీ (SIP) బ్యాలెన్స్ అయిపోతాయి. దీనివల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు మీరు టెన్షన్ పడి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు.

• వాలంటరీ టాప్-అప్స్ : మీకు డెట్ కాంపోనెంట్ ఇంకా పెంచుకోవాలని ఉంటే, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా మీ బేసిక్ శాలరీలో 12 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని అదే హై-యీల్డింగ్ ఈపీఎఫ్ అకౌంట్‌లో దాచుకోవచ్చు.

• డిసిప్లిన్డ్ కాంపౌండింగ్: ఈపీఎఫ్ మనీని రిటైర్మెంట్ లేదా కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్‌లో తప్ప మధ్యలో తీయలేము. కాబట్టి అక్కడ మనీ లాక్ అయి డిసిప్లిన్డ్‌గా పెరుగుతుంది. మరోవైపు, మీ ఎస్‌ఐపీ మనీ బ్యాక్‌గ్రౌండ్‌లో అగ్రెసివ్‌గా గ్రో అవుతూ ఉంటుంది.

56
రూ. 1 కోటి ఎలా సాధ్యం? లైవ్ కాలిక్యులేషన్ ఇదే
Image Credit : Getty

రూ. 1 కోటి ఎలా సాధ్యం? లైవ్ కాలిక్యులేషన్ ఇదే

ఈపీఎఫ్, ఎస్‌ఐపీ కాంబినేషన్ ద్వారా మీ అకౌంట్ బ్యాలెన్స్ 1 కోటి రూపాయల మార్కును ఎలా దాటుతుందో ఈ చిన్న ఉదాహరణ ద్వారా సింపుల్‌గా చూద్దాం.

మ్యూచువల్ ఫండ్ ఎస్‌ఐపీ ప్లాన్:

• నెలవారీ పెట్టుబడి: రూ. 10,000

• కాలపరిమితి: 16 ఏళ్లు

• మొత్తం పెట్టుబడి: రూ. 19.2 లక్షలు

• ఊహించిన రిటర్న్స్ రేటు: 12%

• అంచనా వేసిన లాభం: రూ. 35.38 లక్షలు

• మెచ్యూరిటీ మొత్తం: రూ. 54.58 లక్షలు

ఈపీఎఫ్ ప్లాన్:

• నెలవారీ పెట్టుబడి: రూ. 12,000

• కాలపరిమితి: 16 ఏళ్లు

• మొత్తం పెట్టుబడి: రూ. 23.04 లక్షలు

• ఊహించిన రిటర్న్స్ రేటు: 8.25%

• అంచనా వేసిన లాభం: రూ. 25.23 లక్షలు

• మెచ్యూరిటీ మొత్తం: రూ. 48.28 లక్షలు

టోటల్ ఫండ్ (EPF + SIP):

మీరు 16 ఏళ్లలో ఎస్‌ఐపీ ద్వారా రూ. 54.58 లక్షలు, ఈపీఎఫ్ ద్వారా రూ. 48.28 లక్షలు సాధిస్తారు. అంటే మీ మొత్తం ఫండ్ విలువ రూ. 1,02,86,000 (రూ. 1.02 కోట్లు) అవుతుంది. అంటే మీ జేబులోంచి నెలకు ₹22,000 (10k SIP + 12k EPF) పక్కన పెడితే.. కాంపౌండింగ్ పవర్‌తో అది కాస్తా ₹1.02 కోట్లు అవుతుంది.

66
లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం బెస్ట్ రూట్
Image Credit : Getty

లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం బెస్ట్ రూట్

రూ. 1 కోటి సంపాదించడం అనేది కేవలం ఎక్కువ శాలరీ ఉన్నవాళ్లకు లేదా అగ్రెసివ్ ట్రేడర్లకు మాత్రమే సాధ్యం అనుకుంటే పొరపాటే. ఉద్యోగం చేసే ఎవరైనా సరే, ఈపీఎఫ్‌తో పాటు క్రమశిక్షణతో కూడిన ఎస్‌ఐపీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో కోటీశ్వరులు అవ్వడం చాలా ఈజీ. 

ఈపీఎఫ్ మీకు సేఫ్టీ, కచ్చితమైన పొదుపును అలవాటు చేస్తే, ఎస్‌ఐపీలు మీకు ద్రవ్యోల్బణాన్ని దాటి లాభాలను అందిస్తాయి. ఒక 15 నుంచి 25 ఏళ్ల పాటు ఈ కాంబోను కంటిన్యూ చేస్తే, రిటైర్మెంట్ లైఫ్, పిల్లల చదువులు లేదా మీ లైఫ్ గోల్స్ కోసం ఒక పెద్ద ఫైనాన్షియల్ బ్యాకప్ సెట్ అయిపోతుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన, జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రమే. ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు కావు. పెట్టుబడులు పెట్టేటప్పుడు మార్కెట్ రిస్క్‌లను గమనించి, సొంతంగా ఆలోచించి లేదా మీ ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోగలరు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Silver Rate: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి...రూ.2లక్షలకు పడిపోతున్న వెండి
Recommended image2
Second Hand Mobile: సెకండ్‌ హ్యాండ్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ బిజినెస్‌లో లాభాలు ఎలా ఉంటాయి?
Recommended image3
Inspiring Story: సరదాగా చేసిన వీడియోలే జీవితాన్ని మార్చేశాయి.. పచ్చళ్లతో మొదలై రూ.కోట్ల బిజినెస్
Related Stories
Recommended image1
WhatsApp: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పండగే.. వాట్సాప్‌లోనే పీఎఫ్ సేవలు
Recommended image2
Hero Super Splendor: తక్కువ ధరలోనే లీటరుకు 72km మైలేజీ ఇచ్చే హీరో కొత్త సూపర్ బైక్ ఇది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved