MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • Bikes
  • Hero Super Splendor: తక్కువ ధరలోనే లీటరుకు 72km మైలేజీ ఇచ్చే హీరో కొత్త సూపర్ బైక్ ఇది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Hero Super Splendor: తక్కువ ధరలోనే లీటరుకు 72km మైలేజీ ఇచ్చే హీరో కొత్త సూపర్ బైక్ ఇది.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!

Hero Super Splendor XTEC 2.0: లీటరుకు 72 కిమీ మైలేజ్, అదిరిపోయే బ్లూటూత్ ఫీచర్లతో హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 మార్కెట్లోకి వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ హీరో బైకు ధర, ఇతర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 27 2026, 07:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హీరో నుంచి మైండ్ బ్లోయింగ్ బైక్.. ఇక పెట్రోల్ టెన్షన్ లేదు.. ఫీచర్లు నెక్స్ట్ లెవెల్
Image Credit : heromotocorp

హీరో నుంచి మైండ్ బ్లోయింగ్ బైక్.. ఇక పెట్రోల్ టెన్షన్ లేదు.. ఫీచర్లు నెక్స్ట్ లెవెల్

1990ల కాలం నాటి నుంచి ఇండియన్ మిడిల్ క్లాస్ గుండెల్లో ‘స్ప్లెండర్’ అంటే ఒక ఎమోషన్. నమ్మకానికి మరో పేరైన హీరో మోటోకార్ప్, మార్కెట్లోకి సరికొత్త అవతారంలో హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 (Hero Super Splendor XTEC 2.0) మోడల్‌ను లాంచ్ చేసింది.

నేటి జనరేషన్ యువకులకు నచ్చేలా అల్ట్రా మోడ్రన్ ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో ఈ బైక్‌ను డిజైన్ చేశారు. దీని ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 86,500 గా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ సరికొత్త బైక్ ఫీచర్లు చూస్తే మాత్రం ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్ లో లుక్ అదిరింది బాస్
Image Credit : heromotocorp

డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్ లో లుక్ అదిరింది బాస్

డిజైన్ పరంగా హీరో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. ఓల్డ్ మోడల్స్‌తో పోలిస్తే ఇందులో రిఫ్రెష్డ్ డ్యూయల్-టోన్ గ్రాఫిక్స్, స్టైలిష్ 3D ఎంబ్‌లమ్, స్పోర్టీ రిమ్ టేపులు యాడ్ చేశారు. దీనివల్ల బైక్‌కు ఒక ప్రీమియం, మాస్ లుక్ వచ్చింది.

అంతేకాదు, లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు కూడా సూపర్ కంఫర్ట్ ఇచ్చేలా ‘డ్యూయల్-టెక్స్చర్డ్ స్టిచ్డ్ సీటు’ను ఇందులో అమర్చారు. రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు దీనివైపే పడటం గ్యారెంటీ మరి.

Related Articles

Related image1
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Related image2
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
36
మైలేజ్ వింటే షాక్ అవుతారు.. లీటరుకు 72 కి.మీ
Image Credit : heromotocorp

మైలేజ్ వింటే షాక్ అవుతారు.. లీటరుకు 72 కి.మీ

ఈ రోజుల్లో బండి కొనాలంటే మొదట చూసేది మైలేజ్. ఈ విషయంలో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 కింగ్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్.. 10.7 bhp పవర్, 10.6 Nm టాప్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (APFI) టెక్నాలజీతో పాటు హీరో సిగ్నేచర్ i3S (ఐడల్ స్టాప్-స్టార్ట్) సిస్టమ్ వల్ల ఈ బైక్ లీటరుకు ఏకంగా 72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

46
ఫుల్లీ డిజిటల్ స్క్రీన్.. రైడింగ్‌లోనే కాల్స్, మెసేజ్ అలర్ట్స్
Image Credit : our own

ఫుల్లీ డిజిటల్ స్క్రీన్.. రైడింగ్‌లోనే కాల్స్, మెసేజ్ అలర్ట్స్

టెక్నాలజీ విషయానికి వస్తే ఈ బైక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను సెట్ చేశారు. ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ఫోన్‌కు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, మిస్డ్ కాల్ అలర్ట్లతో పాటు ఫోన్ బ్యాటరీ స్టేటస్‌ను కూడా బైక్ స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు.

వీటితో పాటు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయల్ అలర్ట్ కూడా ఉన్నాయి. అలాగే జర్నీలో మొబైల్ ఛార్జింగ్ అయిపోతే టెన్షన్ పడకుండా USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు.

56
సేఫ్టీ ఫస్ట్.. హజార్డ్ లైట్లతో సరికొత్త సెక్యూరిటీ
Image Credit : our own

సేఫ్టీ ఫస్ట్.. హజార్డ్ లైట్లతో సరికొత్త సెక్యూరిటీ

రైడర్ల సేఫ్టీ కోసం హీరో మోటోకార్ప్ ఈ వేరియంట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చింది. సూపర్ స్ప్లెండర్ సిరీస్‌లోనే ఫస్ట్ టైమ్ ఇందులో హజార్డ్ లైట్లను ప్రవేశపెట్టారు. దట్టమైన పొగమంచు లేదా వర్షం పడేటప్పుడు ఈ లైట్లు ఎంతగానో యూజ్ అవుతాయి.

బెస్ట్ బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్రాఫిక్‌లో ఈజీగా బండిని ఆఫ్ చేయడానికి హ్యాండిల్‌బార్‌పైనే ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. స్మూత్ రైడింగ్ కోసం ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది.

66
మీకు నచ్చిన కలర్ లో కొత్త హీరో బైక్
Image Credit : our own

మీకు నచ్చిన కలర్ లో కొత్త హీరో బైక్

ఈ సరికొత్త బైక్ మొత్తం ఐదు సూపర్ స్టైలిష్ కలర్ ఆప్షన్లలో దొరుకుతుంది. గ్లోసీ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మ్యాట్ నెక్సస్ బ్లూ, మ్యాట్ చెస్ట్‌నట్ బ్రౌన్ రంగులలో ఇది అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ షోరూమ్స్‌లో ఈ సరికొత్త XTEC 2.0 బైక్స్ సేల్స్‌కు రెడీగా ఉన్నాయి. స్టైల్, మైలేజ్, తక్కువ బడ్జెట్‌లో మంచి బైక్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
రివోల్ట్ నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ బైక్.. రివ‌ర్స్ మోడ్‌, బ్లూటుత్ క‌నెక్టివిటీతో పాటు మ‌రెన్నో ఫీచ‌ర్లు
Recommended image2
Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచ‌ర్ ఎలా ప‌ని చేస్తుందంటే.?
Recommended image3
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో కాలితే ఇన్సూరెన్స్ డ‌బ్బులు వ‌స్తాయా.? ఎలాంటి సంద‌ర్భాల్లో రిజ‌క్ట్ అవుతుంది
Related Stories
Recommended image1
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Recommended image2
IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved