- Home
- Business
- Business Idea: ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా.? లక్షాధికారి అయ్యే బెస్ట్ బిజినెస్ ఐడియా
Business Idea: ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా.? లక్షాధికారి అయ్యే బెస్ట్ బిజినెస్ ఐడియా
Business Idea: ఉద్యోగం చేసే చాలా మంది ఏదో ఒక రోజు వ్యాపారం మొదలు పెట్టాలనే ఆశతో ఉంటారు. అయితే తాము సంపాదించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఎప్పటికీ డిమాండ్ తగ్గని టైల్స్ వ్యాపారం
ఉద్యోగం చేసి చేసి విసిగిపోయారా.? తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా.? సంపాదనతో పాటు మరికొందరికి పని అవకాశం కల్పించాలని భావిస్తున్నారా.? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసమే. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఎప్పటికీ అవసరం ఉండే రంగం ఇది. అదే టైల్స్ తయారీ వ్యాపారం.
అంత డిమాండ్ ఎందుకు.?
ప్రస్తుతం కొత్త ఇళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇంటి నిర్మాణంలో ఫ్లోరింగ్, పార్కింగ్, ఓపెన్ ఏరియాలకు టైల్స్ తప్పనిసరి అవుతున్నాయి. ఈ కారణంగా సిమెంట్ టైల్స్, పేవర్ బ్లాక్స్, డిజైన్ టైల్స్ వంటి వాటికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఒకసారి మార్కెట్ పట్టుకుంటే స్థిర ఆదాయం లభిస్తుంది.
టైల్స్ తయారీ యూనిట్ ప్రారంభానికి అవసరాలు
ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో కూడా ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి 250 నుంచి 300 గజాల ఓపెన్ స్థలం కావాలి. త్రిఫేజ్ కరెంట్ సదుపాయం, నీటి వసతి, చిన్న గోడౌన్ లేదా షెడ్, లైసెన్స్‌లు, స్థానిక పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి ఉండాలి. అలాగే MSME రిజిస్ట్రేషన్ తీసుకుంటే రుణాలు సులభంగా లభిస్తాయి.
ఖర్చు వివరాలు
అవసరమైన యంత్రాలు, కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ రూ. లక్ష వరకు ఉంటుంది. వైబ్రేషన్ మిషన్ లేదా ప్రెస్ మిషన్, కలర్ మిక్సర్, టైల్స్ మౌల్డ్స్ (వివిధ డిజైన్లు)తో పాటు ఇసుక, స్టోన్ డస్ట్, సిమెంట్, కలర్ పౌడర్, చిన్న కంకర వంటి ముడి సరుకు కావాల్సి ఉంటుంది. ఒక్కో టైల్స్ తయారీ ఖర్చు సుమారు రూ. 8 నుంచి రూ. 10 వరకు వస్తుంది.
లాభాలు ఎలా ఉంటాయి.?
మార్కెట్‌లో ఒక టైల్స్ ధర రిటైల్‌లో రూ. 25 నుంచి రూ. 30 వరకు ఉంటుంది. హోల్‌సేల్‌లో రూ. 15 నుంచి రూ. 20 వరకు విక్రయించవచ్చు. రోజుకు 1000 టైల్స్ తయారు చేస్తే తయారీ ఖర్చు సుమారు రూ. 10,000 అవుతుంది. దీంతో రోజుకు సుమారు రూ. 15,000 వరకు ఆదాయం వస్తుంది. ఇందులో రూ. 5000 లాభం పొందొచ్చు. అలా చూసుకుంటే తక్కువలో తక్కువ నెలకు రూ. లక్షకుపైగా లాభం పొందొచ్చన్నమాట. డిమాండ్ పెరిగితే ఆదాయం ఇంకా ఎక్కువగా మారుతుంది.
అదనపు సూచనలు
స్థానిక బిల్డర్లు, కాంట్రాక్టర్లతో నేరుగా ఒప్పందాలు చేసుకోవాలి, నాణ్యత తగ్గకుండా చూడాలి. కొత్త డిజైన్ మౌల్డ్స్ వాడితే మార్కెట్‌లో గుర్తింపు పెరుగుతుంది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల పనులకు సరఫరా చేసే అవకాశం ఉంది. ఆన్‌లైన్ ప్రచారం ద్వారా కూడా ఆర్డర్లు తెచ్చుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఈ వ్యాపారం మొదలు పెట్టే ముందు ఆ రంగంలో అనుభవం ఉన్న వారిని నేరుగా కలిసి సలహాలు తీసుకోవడం మంచిది.

