MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Idea: సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా.. రోజుకు 3 గంటల పనితో నెలకు రూ. లక్ష సంపాదన.!

Business Idea: సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా.. రోజుకు 3 గంటల పనితో నెలకు రూ. లక్ష సంపాదన.!

Business Idea: వేసవి కాలంలో ఐస్ క్రీమ్ పార్లర్ల కంటే మొబైల్ ఐస్ క్రీమ్ ట్రక్కులు మంచి లాభాలను అందిస్తాయి. ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్, ఫ్రీజర్లు, బ్రాండింగ్, స్టాక్‌తో కలిపి సుమారు 10 లక్షల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

1 Min read
Author : Pavithra D
Published : Apr 06 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా
Image Credit : Money\Twitter

సమ్మర్ స్పెషల్ బిజినెస్ ఐడియా

వేసవి కాలం వచ్చిందంటే చాలు చల్లని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ డిమాండ్‌ను వ్యాపారంగా మార్చుకోవాలనుకునే వారికి "ఐస్ క్రీమ్ ట్రక్" ఒక వినూత్నమైన, లాభదాయకమైన మార్గం. సాధారణంగా ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాలంటే ఒకే చోట ఉండాలి. కానీ ఐస్ క్రీమ్ ట్రక్ ద్వారా మనం కస్టమర్ల వద్దకే వెళ్ళవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్టుబడి, నిర్వహణ
Image Credit : Pinterest

పెట్టుబడి, నిర్వహణ

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు 10 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో సెకండ్ హ్యాండ్ ట్రక్ కొనుగోలుకు 2-5 లక్షలు, ఫ్రీజర్లు, వెహికల్ డిజైనింగ్‌కు మరికొంత, మిగిలిన మొత్తాన్ని స్టాక్, లైసెన్సుల కోసం కేటాయించవచ్చు. సాధారణ సైకిల్ మీద అమ్మే ఐస్ క్రీమ్స్ ఒకే బ్రాండ్‌కు పరిమితమవుతాయి, కానీ ట్రక్ ద్వారా 15-20 రకాల బ్రాండ్లను, విభిన్న ఫ్లేవర్లను కస్టమర్లకు అందించవచ్చు.

35
లాభాల శాతం
Image Credit : Getty

లాభాల శాతం

ఐస్ క్రీమ్ వ్యాపారంలో లాభాలు బ్రాండ్‌ను బట్టి మారుతుంటాయి. పేరున్న కార్పొరేట్ బ్రాండ్స్ అమ్మితే 10 శాతం నుంచి 15 శాతం వరకు మార్జిన్ లభిస్తుంది. అదే కొత్తగా వస్తున్న బ్రాండ్స్ లేదా లోకల్ క్వాలిటీ బ్రాండ్స్ అయితే 25 శాతం నుంచి 30 శాతం వరకు లాభం పొందవచ్చు. రోజుకు ఒక లక్ష రూపాయల అమ్మకాలు జరిగితే, అందులో దాదాపు 25 వేల రూపాయల వరకు నికర లాభం ఉండే అవకాశం ఉంది.

45
సీజన్ మాత్రమే కాదు, ఏడాది పొడవునా
Image Credit : Money\Twitter

సీజన్ మాత్రమే కాదు, ఏడాది పొడవునా

ఐస్ క్రీమ్ అంటే కేవలం వేసవిలోనే తినేది అన్న భావన ఇప్పుడు మారింది. ప్రజలు ఏడాది పొడవునా వీటిని ఇష్టపడుతున్నారు. సమ్మర్‌లో అమ్మకాలు విపరీతంగా ఉంటే, మిగిలిన కాలాల్లో కొంచెం తక్కువగా ఉండవచ్చు, కానీ వ్యాపారం మాత్రం ఆగదు.

55
ప్రతీ నెలా చక్కటి లాభాలు..
Image Credit : Money\Twitter

ప్రతీ నెలా చక్కటి లాభాలు..

అంతేకాకుండా, సీజన్‌కు అనుగుణంగా ట్రక్కులో ఇతర ఆహార పదార్థాలను కూడా చేర్చుకోవచ్చు. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే యువతకు, తక్కువ రిస్క్ ఉన్న ఈ ఐస్ క్రీమ్ ట్రక్ ఐడియా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Success Story: రూ.3లక్షలతో మొదలై రూ.100 కోట్ల టర్నోవర్ వరకు.. టీ అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్
Recommended image2
Amazon Sale: వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే మంచి టైమ్.. అమెజాన్ లో బెస్ట్ డీల్స్ ఇవిగో
Recommended image3
Gold Price Fall: నవరాత్రి వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. దిగొచ్చిన బంగారం
Related Stories
Recommended image1
Business Ideas: లాభాలు తప్పితే.. పైసా కూడా నష్టాలు తెచ్చిపెట్టని బిజినెస్‌లు ఇవే..
Recommended image2
Business Idea: తక్కువ ఖర్చు.. అదిరిపోయే లాభం.! ఈ తిరుగులేని వ్యాపారంతో నెలకు లక్షల్లో సంపాదన..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved