MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Debt Free Guide: అప్పుల ఊబిలో మునిగిపోతున్నారా? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా అప్పులన్నీ తీర్చేయండి!

Debt Free Guide: అప్పుల ఊబిలో మునిగిపోతున్నారా? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా అప్పులన్నీ తీర్చేయండి!

Debt Free Guide: ఆర్థిక ప్లానింగ్ లేక అప్పుల ఊబిలో చిక్కుకున్నారా? వేగంగా అప్పు తీర్చి ఫ్రీ అవ్వడానికి 5 సింపుల్ టిప్స్, మీరు చేయకూడని తప్పుల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ 5 తప్పులు చేయకండి... లేదంటే ఎంత సంపాదించినా అప్పుల పాలు కావాల్సిందే!
Image Credit : others

ఈ 5 తప్పులు చేయకండి... లేదంటే ఎంత సంపాదించినా అప్పుల పాలు కావాల్సిందే!

ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరి జీవితంలో అప్పు అనేది ఒక కామన్ విషయంగా మారిపోయింది. ఇల్లు, కారు, పిల్లల చదువులు లేదా పర్సనల్ నీడ్స్ కోసం చాలామంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇన్ కమ్ లిమిటెడ్‌గా ఉన్నప్పటికీ, లోన్స్ వల్ల అప్పటికప్పుడు మన అవసరాలైతే తీరుతున్నాయి. ఆ తర్వాత ప్రతీ నెల ఈఎమ్‌ఐ కడుతూ ప్రశాంతంగానే ఉంటాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారడం వల్ల లేదా ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల వేళకి ఈఎమ్‌ఐలు కట్టలేక అప్పుల్లో ఇరుక్కుపోతుంటారు.

అలాంటి టైమ్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కారణంగా అప్పు కొండలా పెరిగిపోతుంది. దీనివల్ల ఫైనాన్షియల్ ప్రెజర్ పెరగడమే కాకుండా, విపరీతమైన మెంటల్ స్ట్రెస్ కూడా వస్తుంది. అయితే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ గనుక ఉంటే, ఏలాంటి స్ట్రెస్ లేకుండా అనుకున్న టైమ్ కంటే ముందే అప్పులన్నింటినీ ఈజీగా తీర్చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్వరగా అప్పుల నుంచి క్లియర్ అవ్వడానికి 5 గోల్డెన్ టిప్స్
Image Credit : Getty

త్వరగా అప్పుల నుంచి క్లియర్ అవ్వడానికి 5 గోల్డెన్ టిప్స్

• ఖర్చుల క్లియర్ లెక్కలు పెట్టుకోండి: ముందుగా మీ హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఈఎమ్‌ఐలతో పాటు ప్రతీ నెల అయ్యే ఇంటి ఖర్చులన్నింటికీ ఒక క్లియర్ లెక్క రాసుకోండి. మీ మంత్లీ ఇన్ కమ్‌లో కొంత మొత్తాన్ని లోన్స్ కోసం అదనంగా చెల్లించడానికి పక్కన పెట్టండి.

• ఎక్స్‌ట్రా మనీ డిపాజిట్ చేయండి: ఒకవేళ మీ లోన్ పై బ్యాంక్ ‘ప్రీపేమెంట్ చార్జెస్’ వేయకపోతే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా అదనపు మొత్తాన్ని అకౌంట్‌లో జమ చేస్తూ ఉండండి. దీనివల్ల మీ అసలు వేగంగా తగ్గిపోతుంది, దానితో పాటు వడ్డీ భారం కూడా చాలావరకు తగ్గుతుంది.

• ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందే తీర్చండి: మీపై ఒకటికంటే ఎక్కువ అప్పులు ఉంటే, ఏ లోన్ మీద ఎక్కువ వడ్డీ ఉందో దాన్ని ముందుగా క్లోజ్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వండి. దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ వడ్డీ కట్టాల్సిన నష్టం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

• బోనస్, జీతం పెంపును సరిగ్గా వాడండి: జాబ్‌లో శాలరీ హైక్ వచ్చినప్పుడు లేదా పండుగల టైమ్‌లో బోనస్ వచ్చినప్పుడు ఆ డబ్బును లగ్జరీ వస్తువులపై తగలేయకుండా, అప్పులు కట్టడానికి ఒక పెద్ద భాగాన్ని ఉపయోగించండి.

• 'లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' ఆప్షన్ తీసుకోండి: ఒకవేళ మీరు తీసుకున్న లోన్ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండి, వేరే బ్యాంకులు తక్కువ వడ్డీకే ఆ లోన్ ఇస్తుంటే, మీ లోన్‌ను వేరే బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. దీనివల్ల మీ మంత్లీ ఈఎమ్‌ఐ లేదా టోటల్ వడ్డీ భారం తగ్గుతుంది.

34
అప్పులు తీర్చేటప్పుడు చేయకూడని తప్పులు
Image Credit : Gemini

అప్పులు తీర్చేటప్పుడు చేయకూడని తప్పులు

• ఈఎంఐ డేట్ మిస్ అవ్వకండి: ఈఎమ్‌ఐ కట్టాల్సిన డేట్ మిస్ అయితే బ్యాంకులు పెనాల్టీలు వేస్తాయి. అంతేకాకుండా మీ సిబిల్ స్కోర్ ఘోరంగా పాడవుతుంది.

• అప్పు తీర్చడానికి మరో అప్పు చేయకండి: ఒక అప్పు తీర్చడానికి ఎక్కువ వడ్డీ ఉండే మరొక అప్పు చేసే తప్పు అసలు చేయకూడదు. దీనివల్ల మీరు మరింత పెద్ద ఆర్థిక సంక్షోభంలో పడిపోతారు.

• క్రెడిట్ కార్డ్ బిల్స్ పెండింగ్‌లో పెట్టకండి: క్రెడిట్ కార్డ్ బాకీలపై బ్యాంకులు అత్యధికంగా వడ్డీ వసూలు చేస్తాయి. అందుకే క్రెడిట్ కార్డ్ బిల్లును ఎప్పుడూ లేట్ చేయకూడదు.

• రూల్స్ చదవకుండా 'లోన్ ట్రాన్స్‌ఫర్' చేయకండి: లోన్‌ను వేరే బ్యాంక్‌కి మార్చేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, ఇతర హిడెన్ ఛార్జీలను కచ్చితంగా చెక్ చేయండి. కొన్నిసార్లు తక్కువ వడ్డీ అని ఆశపడి ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి వస్తుంది.

• కెపాసిటీకి మించి భారం వేసుకోకండి: మీ నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ భాగం ఈఎమ్‌ఐలకే పోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

44
ఇలా చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి?
Image Credit : others

ఇలా చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి?

మీరు గనుక ఈ రూల్స్ అన్నింటినీ పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే, మీ అప్పులు ఎంత త్వరగా క్లియర్ అయిపోయాయో మీకే తెలియదు. దీనితో పాటు మీ క్రెడిట్ స్కోర్ చాలా బాగుంటుంది. ఫలితంగా భవిష్యత్తులో అత్యవసరమైనప్పుడు తక్కువ వడ్డీకే చాలా ఈజీగా లోన్ పొందే ఛాన్స్ లభిస్తుంది. సరైన ప్రణాళికతో అడుగులు వేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం చాలా ఈజీ అవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Related Stories
Recommended image1
Telangana New Airport: తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌.. రూ. 496.86 కోట్లతో మాస్ ప్లాన్.. అదిరే డిజైన్‌తో కమ్‌బ్యాక్
Recommended image2
Hyderabad Eiffel Tower: హైదరాబాద్‌లో ఈఫిల్ టవర్.. ప్యారిస్ వైబ్స్, అడ్వెంచర్ కేఫ్ ఎక్కడుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved