MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: క్రైమ్, యాక్షన్, రొమాన్స్‌.. ఈ వారం ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే

OTT: క్రైమ్, యాక్షన్, రొమాన్స్‌.. ఈ వారం ఓటీటీలో టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే

Top OTT Releases: ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫాంలు విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందిస్తున్నాయి. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్, రొమాన్స్, కోర్ట్‌రూమ్ డ్రామా వంటి విభిన్న కథలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. వీటిలోని టాప్ 5 లిస్ట్ మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 24 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఏ సినిమా చూడాలో తెలీదా? టాప్ 5 లిస్ట్ ఇదిగో
Image Credit : chatgpt

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో ఏ సినిమా చూడాలో తెలీదా? టాప్ 5 లిస్ట్ ఇదిగో

ఇంట్లోనే కూర్చుని కొత్త కంటెంట్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ వారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఓటీటీ ప్లాట్‌ఫాంలు విభిన్న జానర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సిద్ధమయ్యాయి. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడయో, జియో హాట్ స్టార్, జీ5 వంటి ప్రముఖ ప్లాట్‌ఫాంలలో క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్, రొమాన్స్, కోర్ట్‌రూమ్ డ్రామా వంటి విభిన్న కథలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. ఈ వారం ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న టాప్ 5 కంటెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. హుంకార్ : ది రోర్
Image Credit : X/ApplauseSocial

1. హుంకార్ : ది రోర్

సెప్టెంబర్ 25న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌కు రానున్న హుంకార్ : ది రోర్(Hunkkaar: The Roar) ఒక పవర్ ఫుల్ కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా. అనిత్, ఫాతిమా సనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సిరీస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఒక టీనేజర్ ఒక ఆధ్యాత్మిక గురువుపై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఈ కథ మొదలవుతుంది.

ఆ తీవ్రమైన ఆరోపణ తర్వాత ఆ బాధితురాలి కుటుంబం, సమాజం, మీడియా, న్యాయవ్యవస్థ మధ్య ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది కథలో ముఖ్యమైన అంశం. అసలు నిజం ఏంటి? ఆరోపణల వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అనే ప్రశ్నల చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. కోర్ట్‌రూమ్ డ్రామాలు, క్రైమ్ కథలను ఇష్టపడే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

36
2. షాక్: ట్రస్ట్ నో వన్
Image Credit : x/Prime video

2. షాక్: ట్రస్ట్ నో వన్

నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 24న విడుదల కానున్న షాక్: ట్రస్ట్ నో వన్ (Shaque: Trust No One) లో పరిణితి చోప్రా నటిస్తున్నారు. ఇది ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన ఓటీటీ ప్రాజెక్టుగా నిలవనుంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది.

సుమారు తొమ్మిదేళ్ల క్రితం మిస్ అయిన తన కుమార్తె కోసం ఒక తల్లి చేసే ఆవేదనతో కూడిన అన్వేషణ చుట్టూ కథ తిరుగుతుంది. తనకి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులపైనా అనుమానం మొదలవడంతో కథలో సస్పెన్స్ మరింత పెరుగుతుంది. ప్రతీ ఒక్కరినీ నమ్మాలా? వద్దా? అనే సందేహం కథకు అసలైన బలంగా నిలుస్తుంది.

46
3. టాక్సిక్
Image Credit : instagram

3. టాక్సిక్

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం టాక్సిక్ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ సినిమా సెప్టెంబర్ 25న జీ5 లోకి రానుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా స్వాతంత్ర్యం తర్వాతి గోవా నేపథ్యాన్ని మనకు చూపిస్తుంది.

నేర ప్రపంచం, అధికారం, కుటుంబ సంబంధాలు, ప్రతీకారం వంటి అంశాలతో కథ చాలా తీవ్రంగా సాగుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, యష్ నటన, ప్రత్యేకమైన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది.

56
4. డోంట్ బి షై
Image Credit : Prime Video

4. డోంట్ బి షై

యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన డోంట్ బి షై (Don't Be Shy) చిత్రం సెప్టెంబర్ 25న ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ నటి అలియా భట్ నిర్మించిన ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా స్నేహం, కాలేజ్ లైఫ్, ఫస్ట్ లవ్, వ్యక్తిగత ఎదుగుదల వంటి అంశాల చుట్టూ సాగుతుంది.

యూత్ లైఫ్‌లో ఎదురయ్యే రకరకాల భావోద్వేగాలు, సంబంధాలు, స్వీయ గుర్తింపు వంటి అంశాలను చాలా ఫన్నీగా, వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. రొమాంటిక్, యూత్ డ్రామా సినిమాలను ఇష్టపడే యంగ్ జనరేషన్‌కు ఇది కచ్చితంగా నచ్చుతుంది.

66
5. ది లవ్ హైపోథెసిస్
Image Credit : X/EeveeMoon08

5. ది లవ్ హైపోథెసిస్

సెప్టెంబర్ 23న ప్రైమ్ వీడియోలో విడుదలైన ది లవ్ హైపోథెసిస్ (The Love Hypothesis) ఒక ప్రెష్ రొమాంటిక్ కామెడీ మూవీ. లిలీ రీన్‌హార్ట్ , టామ్ బాట్‌మాన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు.

తన స్నేహితురాలిని నమ్మించేందుకు ఒక పీహెచ్ డీ విద్యార్థిని తన ప్రొఫెసర్‌ను ఫేక్ బాయ్‌ఫ్రెండ్‌గా నటింపజేయడంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. అయితే మొదట నకిలీగా ప్రారంభమైన ఈ డ్రామా క్రమంగా నిజమైన ప్రేమగా, భావోద్వేగాలుగా మారుతుంది. రొమాన్స్, కామెడీ, అకడమిక్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం లైట్-హార్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి మంచి ఆప్షన్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi OTT Release: హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. నయనతార మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Recommended image2
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Recommended image3
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Weather Update: తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు అతిభారీ వర్షాలు
Recommended image2
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved