MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • రివోల్ట్ నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ బైక్.. రివ‌ర్స్ మోడ్‌, బ్లూటుత్ క‌నెక్టివిటీతో పాటు మ‌రెన్నో ఫీచ‌ర్లు

రివోల్ట్ నుంచి కొత్త‌ ఎల‌క్ట్రిక్ బైక్.. రివ‌ర్స్ మోడ్‌, బ్లూటుత్ క‌నెక్టివిటీతో పాటు మ‌రెన్నో ఫీచ‌ర్లు

Revolt: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో రివోల్ట్ మోట‌ర్స్ కొత్త ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ను తీసుకొచ్చింది. రివోల్ట్ రిఎవ్ఎక్స్ పేరుతో లాంచ్‌ చేసిన ఈ బైక్‌కు సంబంధించిన ఫీచ‌ర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 12 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌
Image Credit : Revolt.com

పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌

రివోల్ట్ ఆర్‌వీఎక్స్‌లో 4kW మిడ్‌-డ్రైవ్‌ PMSM ఎలక్ట్రిక్‌ మోటార్‌ను ఉపయోగించారు. దీని గరిష్ఠ పవర్‌ 5.3kW వరకు ఉంటుంది. వెనుక చక్రానికి గరిష్ఠంగా 230Nm టార్క్‌ అందుతుందని కంపెనీ చెబుతోంది. ఈ బైక్‌ కేవలం 3.9 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వేగాన్నిఅందుకోగలదు. బూస్ట్‌ మోడ్‌లో గరిష్ఠంగా 90 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. పనితీరుకు ప్రాధాన్యం ఇచ్చే యువతను దృష్టిలో పెట్టుకుని RVXను రూపొందించినట్లు రివోల్ట్ మోట‌ర్స్ తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
160 కి.మీ రేంజ్‌.. రిమూవబుల్‌ బ్యాటరీ
Image Credit : Revolt.com

160 కి.మీ రేంజ్‌.. రిమూవబుల్‌ బ్యాటరీ

ఆర్‌వీఎక్స్‌లో 3.24kWh NMC బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ బ్యాటరీని అవసరమైనప్పుడు బైక్‌ నుంచి తొలగించుకోవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 160 కి.మీ వరకు IDC రేంజ్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫాస్ట్‌ ఛార్జర్‌ ఉపయోగిస్తే బ్యాటరీని 0 నుంచి 80 శాతం వరకు సుమారు 80 నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చు. రోజువారీ ప్రయాణాలకు ఈ రేంజ్‌ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లో అద్భుతం.. 65 అంత‌స్తుల‌తో సౌతిండియాలోనే అత్యంత ఎత్తైన టవర్స్ నిర్మాణం
Related image2
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 18 నుంచి ఆ మార్గంలో వ‌న్‌వే. ఏకంగా ఏడాది పాటు
34
నాలుగు రైడింగ్‌ మోడ్‌లు
Image Credit : Revolt.com

నాలుగు రైడింగ్‌ మోడ్‌లు

Revolt RVXలో రైడర్‌ అవసరానికి అనుగుణంగా ఎకో, నార్మ‌ల్‌, స్పోర్ట్ అనే మూడు ప్రధాన రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. వీటితో పాటు బూస్ట్ మోడ్‌ కూడా అందించారు. Boost మోడ్‌ను ఉపయోగించినప్పుడు బైక్‌ గరిష్ఠ పనితీరును అందిస్తుంది. వేగంగా యాక్సిలరేషన్‌ కావాల్సిన సమయంలో ఇది ఉపయోగపడుతుంది. బూస్ట్‌ అవసరం లేని పరిస్థితి వచ్చిన తర్వాత సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా తిరిగి స్పోర్ట్‌ మోడ్‌కు మారుతుంది.

44
ఫీచర్లు, సేఫ్టీతో ఆకట్టుకునే హార్డ్‌వేర్‌
Image Credit : Revolt.com

ఫీచర్లు, సేఫ్టీతో ఆకట్టుకునే హార్డ్‌వేర్‌

RVXలో ముందు భాగంలో USD ఫ్రంట్‌ ఫోర్క్‌, వెనుక మోనోషాక్‌ ఉన్నాయి. ముందు, వెనుక రెండు చక్రాలకు డిస్క్‌ బ్రేకులు అందించారు. బైక్‌లో 3.5 అంగుళాల IP67 రేటెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో బ్లూటూత్‌ కనెక్టివిటీ, టెలిమాటిక్స్‌, OTA అప్‌డేట్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా జియో-ఫెన్సింగ్‌, కాల్‌, మెసేజ్‌ అలర్ట్స్‌, హిల్‌-హోల్డ్‌ అసిస్ట్‌, రివర్స్‌ మోడ్‌, వాక్‌ అసిస్ట్‌, ఇమ్మొబిలైజర్‌, వెహికల్‌ లొకేటర్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో రోజువారీ వినియోగంతో పాటు స్మార్ట్‌ ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చే వారికి ఆర్‌వీఎక్స్‌ ఉపయోగకరంగా ఉండేలా కనిపిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
క్రీడలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచ‌ర్ ఎలా ప‌ని చేస్తుందంటే.?
Recommended image2
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో కాలితే ఇన్సూరెన్స్ డ‌బ్బులు వ‌స్తాయా.? ఎలాంటి సంద‌ర్భాల్లో రిజ‌క్ట్ అవుతుంది
Recommended image3
లైసెన్స్ అవ‌స‌రం లేద‌ని.. ఏ వ‌య‌సు వారైనా ఎల‌క్ట్రిక్ స్కూటీ న‌డ‌పొచ్చా.? చ‌ట్టం ఏం చెబుతోంది.?
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో అద్భుతం.. 65 అంత‌స్తుల‌తో సౌతిండియాలోనే అత్యంత ఎత్తైన టవర్స్ నిర్మాణం
Recommended image2
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆగ‌స్టు 18 నుంచి ఆ మార్గంలో వ‌న్‌వే. ఏకంగా ఏడాది పాటు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved