MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?

IPL : ఐపీఎల్ 2026 కప్పు ఆర్సీబీదేనా? లేదా మళ్లీ హైదరాబాద్ అడ్డుపడుతుందా?

IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)..మరోసారి కప్ కొడుతుందా లేక 2016 సెంటిమెంట్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ అడ్డుపడుతుందా? ఎవరికి ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 27 2026, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ ఫైనల్ సెంటిమెంట్.. అభిమానులకు దడ
Image Credit : our own

ఐపీఎల్ ఫైనల్ సెంటిమెంట్.. అభిమానులకు దడ

ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల తేడాతో దంచికొట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) డైరెక్ట్‌గా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో రజత్ పాటీదార్ కెప్టెన్సీలోని బెంగళూరు టీమ్ ఊహించని రేంజ్‌లో చెలరేగింది. దీంతో మే 31 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో అడుగుపెట్టిన ఫస్ట్ టీమ్‌గా ఆర్సీబీ హిస్టరీ క్రియేట్ చేసింది.

అయితే ఆర్సీబీ ఫైనల్ చేరగానే అభిమానులకు ఒక పాత భయం గుర్తొస్తోంది. ఈసారి కప్ కొడతారా లేక మళ్లీ హైదరాబాద్ టీమ్ అడ్డుపడుతుందా? అనే చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
80% లెక్కలు ఆర్సీబీ వైపే.. వరుసగా రెండోసారి కప్?
Image Credit : Pinterest

80% లెక్కలు ఆర్సీబీ వైపే.. వరుసగా రెండోసారి కప్?

ఐపీఎల్ రికార్డులను గమనిస్తే ఈసారి కూడా టైటిల్ గెలిచే ఛాన్స్ ఆర్సీబీకే ఎక్కువగా కనిపిస్తోంది. 2011లో ప్లేఆఫ్స్ రూల్స్ స్టార్ట్ అయినప్పటి నుండి జరిగిన 15 సీజన్లలో.. ఏకంగా 12 సార్లు అంటే 80 శాతం క్వాలిఫైయర్ 1 గెలిచిన టీమే ఫైనల్‌లో కూడా గెలిచి కప్ కొట్టింది.

గడిచిన 7 సీజన్లుగా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. లాస్ట్ సీజన్‌లో ఫస్ట్ టైమ్ టైటిల్ కొట్టిన ఆర్సీబీ.. ఇప్పుడు రజత్ పాటీదార్ లీడర్‌షిప్‌లో వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవ్వడానికి 80 శాతం అవకాశాలు ఉన్నాయని లెక్కలు చెప్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే చెన్నై (CSK), ముంబై (MI) తర్వాత టైటిల్‌ను డిఫెండ్ చేసుకున్న మూడో టీమ్‌గా బెంగళూరు నిలుస్తుంది.

35
ఆర్సీబీని భయపెడుతున్న 2016 నాటి సీన్
Image Credit : ANI

ఆర్సీబీని భయపెడుతున్న 2016 నాటి సీన్

లెక్కలన్నీ ఆర్సీబీకి పాజిటివ్‌గా ఉన్నా.. బెంగళూరు అభిమానులను టెన్షన్ పెడుతున్న ఒకే ఒక్క బ్యాడ్ రికార్డు ఉంది. అదే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గెలిచి కూడా ఫైనల్‌లో ఓడిపోవడం. ఐపీఎల్ హిస్టరీలో అలా క్వాలిఫైయర్ 1 గెలిచి ఫైనల్లో బోల్తా పడిన మూడు టీమ్స్‌లో ఆర్సీబీ కూడా ఒకటి.

కరెక్ట్‌గా పదేళ్ల క్రితం, అంటే 2016 సీజన్‌లో క్వాలిఫైయర్ 1 గెలిచిన బెంగళూరును ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓడించి కప్ కొట్టేసింది. ఐపీఎల్ హిస్టరీలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి టైటిల్ నెగ్గిన ఏకైక టీమ్ సన్‌రైజర్స్ మాత్రమే.

45
మళ్లీ అదే సెంటిమెంట్.. హైదరాబాద్ అడ్డుపడుతుందా?
Image Credit : our own

మళ్లీ అదే సెంటిమెంట్.. హైదరాబాద్ అడ్డుపడుతుందా?

ఇప్పుడు అభిమానులకు అస్సలు నిద్రపట్టకుండా చేస్తున్న కోఇన్సిడెన్స్ ఏంటంటే.. ఈసారి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతోంది. ఆర్సీబీ ఏమో అప్పుడే డైరెక్ట్‌గా ఫైనల్‌లో వెయిట్ చేస్తోంది.

ఒకవేళ సన్‌రైజర్స్ కనుక క్వాలిఫైయర్ 2 దాటుకుని ఫైనల్‌కు వస్తే.. మళ్లీ 2016 నాటి ఫైనల్ సీన్ రిపీట్ అవుతుందా? హైదరాబాద్ మళ్లీ ఆర్సీబీ నోటి కాడి కూడును లాగేస్తుందా? అని ఆర్సీబీ అభిమానులు టెన్షన్‌లో ఉన్నారు. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ మే 29 శుక్రవారం న్యూ చండీగఢ్‌లో జరగనుంది.

55
ఫైనల్ ఎవరితో ఉన్నా ఆర్సీబీ తగ్గేదేలే
Image Credit : ANI

ఫైనల్ ఎవరితో ఉన్నా ఆర్సీబీ తగ్గేదేలే

మరోవైపు ఆర్సీబీ టీమ్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో టీమ్ అంతా పక్కా ప్లానింగ్‌తో ఆడుతోంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ లేదా రాజస్థాన్ రాయల్స్.. ఇలా ఏ టీమ్ వచ్చినా సరే ఢీ కొట్టేందుకు బెంగళూరు రెడీగా ఉంది.

గత సీజన్ విన్నర్స్ కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ ఈసారి ఫైనల్‌లో బాగా ప్లస్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈసారైనా ఆర్సీబీ పాత భయాలను వీడి సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
RCB vs GT : నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ బాస్.. ప్లేఆఫ్స్‌లో రజత్ పాటీదార్ ఊచకోత చూశారా !
Recommended image2
RCB vs GT: ధర్మశాలలో ఆర్సీబీ విధ్వంసం.. గుజరాత్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన బెంగళూరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved