MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు

EV scooter: ఫోన్ కంటే తక్కువ ధరలో స్కూటీ.. 150 కిలోమీటర్ల మైలేజ్, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు

EV scooter: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. అలాంటి కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 19 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లైసెన్స్ లేకుండానే నడపొచ్చా?
Image Credit : Gemini AI

లైసెన్స్ లేకుండానే నడపొచ్చా?

మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం 250W లోపు మోటార్ సామర్థ్యం, గంటకు 25 కిలోమీటర్లలోపు గరిష్ట వేగం ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉండదు. దీంతో విద్యార్థులు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Ampere Reo Elite – తక్కువ ధరలో మంచి ఎంపిక
Image Credit : our own

Ampere Reo Elite – తక్కువ ధరలో మంచి ఎంపిక

ఆంపియర్ రియో ఎలైట్ ధర సుమారు రూ.42,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 250W BLDC హబ్ మోటార్, గరిష్ట వేగం 25 కిమీ/గంట, ఒక్కసారి చార్జ్ చేస్తే 55–60 కిమీ రేంజ్, 5 నుంచి 6 గంటల్లో పూర్తి చార్జ్, బ్యాటరీపై 2 ఏళ్ల వారంటీ, స్పీడోమీటర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్, ఛార్జింగ్ పోర్ట్ వంటి ప్రాథమిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Related Articles

Related image1
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Related image2
గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
35
Okinawa R30 – ఆధునిక ఫీచర్లతో
Image Credit : our own

Okinawa R30 – ఆధునిక ఫీచర్లతో

ఒకినావా R30 ధర సుమారు రూ.58,992 గా ఉంది. ఇందులో 250W BLDC మోటార్, గరిష్ట వేగం 25 కిమీ/గంట, ఒక్కసారి చార్జ్‌తో 60 కిమీ రేంజ్, 4 నుంచి 5 గంటల్లో చార్జ్ అవుతుంది. ఇందులో LED లైట్లు, DRL, యాంటీ-థెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

45
Lohia Oma Star – అత్యంత చవకైన స్కూటర్లలో ఒకటి
Image Credit : Asianet News

Lohia Oma Star – అత్యంత చవకైన స్కూటర్లలో ఒకటి

లోహియా ఓమా స్టార్ ప్రారంభ ధర సుమారు రూ.40,850 గా ఉంది. ఈ స్కూటీలో 250W మోటార్, 70 కిమీ వరకు రేంజ్, 4.5 నుంచి 5 గంటల ఛార్జింగ్ సమయం పడుతుంది. అలాగే టర్న్ ఇండికేటర్లు, బ్యాటరీ స్టేటస్ ఇండికేటర్, బేసిక్ లైటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రేంజ్ కోరుకునేవారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు.

55
Komaki XGT KM – ఎక్కువ రేంజ్ కోసం
Image Credit : Asianet News

Komaki XGT KM – ఎక్కువ రేంజ్ కోసం

కొమాకి XGT KM ధర సుమారు రూ.42,500. ఇతర లో-స్పీడ్ స్కూటర్లతో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో 130 నుంచి 150 కిమీ వరకు రేంజ్, గరిష్ట వేగం 60 కిమీ/గంట వరకు, LED లైటింగ్, డిస్క్ బ్రేకులు, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే దీని వేగం 25 కిమీ/గంట కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, కొనుగోలు చేసే ముందు లైసెన్స్, రిజిస్ట్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

గమనిక: వాహనాల ధరలు నగరం, డీలర్, ఆఫర్లను బట్టి మారవచ్చు. కొనుగోలు ముందు అధికారిక డీలర్ వద్ద తాజా వివరాలు తెలుసుకోవడం మంచిది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
మాటలతో కంట్రోల్ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్.. రోడ్డుపై గుంతలు ఉంటే ముందే హెచ్చరిస్తుంది
Recommended image2
TVS iQube: ఓలా, ఏథ‌ర్‌ బ‌లాదూర్‌.. 10 ల‌క్ష‌ల మంది కొన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు
Recommended image3
Bike: బైక్‌లో క్రూయిజ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌.. ఇక‌పై ప్ర‌మాదాలు అస్స‌లు జ‌ర‌గ‌వు
Related Stories
Recommended image1
కోటి రూపాయలతో ఇల్లు క‌ట్టే బ‌దులు, ఇలా చేయండి.. లైఫంతా కాలు మీద కాలు వేసుకొని బ‌త‌కొచ్చు
Recommended image2
గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved