MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Folk Song: వెండి తెర‌పై యూట్యూబ్ సెన్సేష‌న్‌.. ఫోక్ సాంగ్స్‌తో మెప్పించి, ఇప్పుడు సినిమాల్లో..

Folk Song: వెండి తెర‌పై యూట్యూబ్ సెన్సేష‌న్‌.. ఫోక్ సాంగ్స్‌తో మెప్పించి, ఇప్పుడు సినిమాల్లో..

Folk Song: యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పలువురు కళాకారులు ఇప్పుడు వెండితెరపై అవకాశాలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖంగా నిలిచిన లిఖిత తాజాగా హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 04 2026, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫోక్ సాంగ్ నుంచి సినీ అవకాశాల దాకా
Image Credit : RATHOD TUNES/YT, likhitha.kds/Instagarm

ఫోక్ సాంగ్ నుంచి సినీ అవకాశాల దాకా

తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు గత కొన్నేళ్లుగా యూట్యూబ్‌లో విశేష ఆదరణ లభిస్తోంది. ఆ జాబితాలో “రాను బొంబాయికి రాను” పాట ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ పాట కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అందులో కనిపించిన లిఖితకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించిన ఆమెకు ఇప్పుడు సినిమా రంగం నుంచి అవకాశాలు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
‘సాV3’ చిత్రంతో కథానాయికగా పరిచయం
Image Credit : likhitha_tamminana_official

‘సాV3’ చిత్రంతో కథానాయికగా పరిచయం

లిఖిత హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బిగ్‌బాస్ ద్వారా గుర్తింపు పొందిన డీమోన్ పవన్, నటుడు సామ్రాట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు కృష్ణ మాయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో భావోద్వేగాలు, వాస్తవ సంఘటనలకు సంబంధించిన అంశాలు ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

35
అందుకే ప్రైవేట్ ఆల్బ‌మ్స్‌కి దూరంగా
Image Credit : likhitha.kds/Instagram

అందుకే ప్రైవేట్ ఆల్బ‌మ్స్‌కి దూరంగా

సినిమా ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన లిఖిత, హీరోయిన్‌గా తన ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి పాత్ర కోసం కొంతకాలం కొత్త ప్రైవేట్ ఆల్బమ్స్‌కు దూరంగా ఉన్నానని తెలిపారు. దర్శకుడు కథ వివరించిన వెంటనే తన పాత్రపై నమ్మకం కలిగిందని, నటీనటులంతా కథలో పూర్తిగా మమేకమై సహజంగా నటించేందుకు ప్రయత్నించామని చెప్పుకొచ్చారు.

45
డీమోన్ పవన్, సామ్రాట్‌లకు కీలక పాత్రలు
Image Credit : likhitha_tamminana_official

డీమోన్ పవన్, సామ్రాట్‌లకు కీలక పాత్రలు

బిగ్‌బాస్ తర్వాత కొత్త తరహా కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా అవకాశం వచ్చిందని డీమోన్ పవన్ తెలిపారు. సహజ నటనకు ప్రాధాన్యం ఇచ్చే కథ కావడంతో వెంటనే అంగీకరించానని చెప్పారు. మరో హీరో సామ్రాట్ మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ వాతావరణంలో సాగే కథలో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులు తనలో కొత్త కోణాన్ని ఈ సినిమాతో చూస్తారని అన్నారు.

55
షూటింగ్ పూర్తి.. విడుదలకు సన్నాహాలు
Image Credit : likhitha_tamminana_official

షూటింగ్ పూర్తి.. విడుదలకు సన్నాహాలు

‘సాV3’ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు చిత్రబృందం వెల్లడించింది. తక్కువ సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చిత్రీకరణ పూర్తి చేశామని తెలిపింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయని, లిఖితకు హీరోయిన్‌గా ఈ చిత్రం మంచి గుర్తింపు తీసుకువస్తుందని యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
Train: రైలు ఇంజన్ అద్దానికి ఇనుప జాలిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఆలోచించారా.?
Recommended image2
Youtube: 15 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌.. తండ్రి ప్రేమ‌ను ఇంత‌కంటే గొప్పగా వ‌ర్ణించగ‌ల‌మా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved