MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • నావిగేష‌న్, కాల్ అల‌ర్ట్‌, మ్యూజిక్ కంట్రోల్‌, ట‌చ్ స్క్రీన్‌.. స్కూటీలో ఇవేం ఫీచ‌ర్లు భ‌య్యా అస‌లు

నావిగేష‌న్, కాల్ అల‌ర్ట్‌, మ్యూజిక్ కంట్రోల్‌, ట‌చ్ స్క్రీన్‌.. స్కూటీలో ఇవేం ఫీచ‌ర్లు భ‌య్యా అస‌లు

Electric Scooters: ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు డిమాండ్ పెర‌గుతోంది. దీంతో దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఎల‌క్ట్రిక్ స్కూటీల‌ను లాంచ్ చేస్తున్నాయి. అధునాత‌న ఫీచ‌ర్ల‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాంటి కొన్ని బెస్ట్ స్కూటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 09 2026, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ
Image Credit : tvsmotor.com

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ

టీవీఎస్ కంపెనీకి చెందిన iQube ST ఈ స్కూటర్ టాప్ వేరియంట్. ఇందులో 7 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్, OTA అప్డేట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా క్రాష్ అలర్ట్, ఫాల్ అలర్ట్, హిల్ హోల్డ్ అసిస్టు వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ 3.5 kWh, 5.3 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 1.71 లక్షలు (ఎక్స్ షోరూమ్).

25
ఓలా ఎస్‌1 ప్రో
Image Credit : Google

ఓలా ఎస్‌1 ప్రో

ఓలా ఎల‌క్ట్రిక్ కంపెనీకి చెందిన Ola S1 Pro Gen 3 ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంది. ఇందులో కూడా 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే అందించారు. ఇది MoveOS 5 సిస్టమ్ పై పనిచేస్తుంది. ఈ స్కూటర్‌లో SOS అలర్ట్, రోడ్ ట్రిప్ మోడ్, భారత్ మోడ్, మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా బ్రేక్ బై వైర్, డ్యూయల్ ఛానల్ ABS, డిజిటల్ కీ, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, యాప్ కనెక్టివిటీ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 1.02 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణ‌యించారు.

Related Articles

Related image1
అప్ప‌ట్లో కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మియాపూర్ కావ‌డం ఖాయం
Related image2
అంతా అయిపోంద‌నిపిస్తోందా.? ఈ ఒక్క పాట వింటే మీ జీవితం కొత్త‌గా మొద‌ల‌వ‌డం ఖాయం
35
అథెర్ రిజ్టా
Image Credit : Google

అథెర్ రిజ్టా

అథెర్ రిజ్టా ప్రస్తుతం భారత్‌లో మంచి ఆదరణ పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ ఉంటుంది. ఈ స్క్రీన్‌లో స్వైప్, స్లైడ్, జూమ్ లాంటి టచ్ జెచర్స్ సపోర్ట్ చేస్తాయి. ఈ స్కూటర్‌లో లైవ్ లోకేషన్ షేరింగ్, స్కిడ్ కంట్రోల్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, క్రాష్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర సుమారు రూ. 1.30 లక్షలు (ఎక్స్ షోరూమ్).

45
సింపుల్ వ‌న్
Image Credit : Google

సింపుల్ వ‌న్

ఫీచర్ల పరంగా Simple One స్కూటర్ కూడా ముందంజలో ఉంది. ఇందులో 7 ఇంచెస్‌ TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్కూటర్‌లో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, స్మార్ట్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్, మ్యూజిక్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 4.5 kWh, 5.0 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే గ‌రిష్ఠంగా 265 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర సుమారు రూ. 1.69 లక్షలు (ఎక్స్ షోరూమ్).

55
అథెర్ 450 ఎక్స్
Image Credit : Mint

అథెర్ 450 ఎక్స్

Ather 450X కూడా టచ్‌స్క్రీన్ ఫీచర్‌తో వచ్చే ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 7 ఇంచెస్‌ TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ స్కూటర్‌లో అలెక్సా ఇంటిగ్రేషన్, కాల్, మ్యూజిక్ కంట్రోల్చ, టర్న్ బై టర్న్ నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 161 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 1.46 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ola : పెట్రోల్ బాధలకు చెక్.. ₹50 వేల తగ్గింపుతో ఓలా కొత్త బైక్, స్కూటర్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Recommended image3
BMW ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్
Related Stories
Recommended image1
అప్ప‌ట్లో కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మియాపూర్ కావ‌డం ఖాయం
Recommended image2
అంతా అయిపోంద‌నిపిస్తోందా.? ఈ ఒక్క పాట వింటే మీ జీవితం కొత్త‌గా మొద‌ల‌వ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved