- Home
- Automobile
- Bikes
- Ather Rizta: 20 నెలల్లో 2 లక్షల స్కూటీలు అమ్ముడయ్యాయి.. ఏంటా స్కూటీ, అంతలా ఏముంది
Ather Rizta: 20 నెలల్లో 2 లక్షల స్కూటీలు అమ్ముడయ్యాయి.. ఏంటా స్కూటీ, అంతలా ఏముంది
Ather Rizta: ఏథర్ ఎనర్జీకి చెందిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా భారత మార్కెట్‌లో రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 2024లో విడుదలైన ఈ స్కూటర్, కేవలం 20 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. ఇంతకీ స్కూటీలో అంతలా ఏముందంటే.

రికార్డు స్థాయిలో అమ్మకాలు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల వచ్చిన ఓ ఎలక్ట్రిక్ స్కూటీ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. కేవలం 20 నెలల్లోనే ఏకంగా 2 లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. తొలి 1 లక్ష అమ్మకాలకు ఏడాది పట్టగా, రెండో 1 లక్ష అమ్మకాలు కేవలం 6 నెలల్లోనే పూర్తయ్యాయి. ఇది Riztaపై ప్రజల్లో ఉన్న భారీ డిమాండ్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఏథర్ అమ్మకాల్లో 70 శాతం Rizta నుంచే
Rizta విజయం ఏథర్ కంపెనీ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చింది. ఇప్పుడు ఏథర్ మొత్తం అమ్మకాలలో 70 శాతం కంటే ఎక్కువ Rizta స్కూటర్ నుంచే వస్తున్నాయి. ఫ్యామిలీకి సెట్ అవ్వడం, అందుబాటులో ధర, ఎక్కువ స్టోరేజ్ వంటి అంశాలు ఏథర్ మెయిన్ స్ట్రీమ్ బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం ఏథర్ దేశవ్యాప్తంగా టాప్ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్లలో ఒకటిగా ఉంది.
దేశవ్యాప్తంగా విస్తరణ, డీలర్ నెట్‌వర్క్ పెరుగుదల
Rizta ప్రభావంతో ఏథర్ తన వ్యాపారాన్ని దక్షిణ భారతానికి మాత్రమే పరిమితం చేయలేదు. మధ్య, ఉత్తర భారతదేశంలోనూ వేగంగా విస్తరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో మార్కెట్ షేర్ రెట్టింపు అయ్యింది. పంజాబ్‌లో 8 శాతం నుంచి 15 శాతం వృద్ధి, ఉత్తరప్రదేశ్‌లో 4 శాతం నుంచి 10 శాతం పెరిగింది. ప్రస్తుతం ఏథర్‌కు దేశవ్యాప్తంగా 524 డీలర్‌షిప్స్ ఉన్నాయి. మొత్తం ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు 5 లక్షల యూనిట్లను దాటాయి.
ఏథర్ రిజ్టా వేరియంట్లు, బ్యాటరీ, ధరలు
Ather Rizta మొత్తం 2 ట్రిమ్స్, 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
బ్యాటరీ, రేంజ్ వివరాలు
* 2.9 kWh బ్యాటరీ – 123 కి.మీ IDC రేంజ్
* 3.7 kWh బ్యాటరీ – 159 కి.మీ IDC రేంజ్
వేరియంట్లు
Rizta S – 2.9 kWh
Rizta S (New) – 3.7 kWh
Rizta Z – 2.9 kWh
Rizta Z – 3.7 kWh
ధర విషయానికొస్తే..
ప్రారంభ ధర: రూ. 1.15 లక్షలుగా ఉండగా.. గరిష్ట ధర: రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక Rizta S – 3.7 kWh ధర: రూ. 1.37 లక్షలు (దిల్లీ)గా ఉంది. ఈ కొత్త S వేరియంట్ పెద్ద బ్యాటరీతో తక్కువ ధరలో రావడం వల్ల అమ్మకాలు మరింత పెరిగాయి.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
56 లీటర్ల భారీ స్టోరేజ్, 34 లీటర్లు అండర్‌సీట్, స్కిడ్ కంట్రోల్, ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో యాంటీ థెఫ్ట్ అలర్ట్, పింగ్ మై స్కూటర్‌తో పాటు 7 అంగుళాల LCD స్క్రీన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, IP66 రేటింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లను అందించారు. ఇక ఈ స్కూటీ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉండగా. 0–40 కి.మీ వేగాన్ని కేవలం 4.7 సెకన్లలో చేరుకుంటుంది.

