- Home
- Business
- Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మతిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బలాదూర్ అంటారు
Business Idea: ఈ బిజినెస్ ఐడియా గురించి తెలిస్తే మతిపోవాల్సిందే.. సాఫ్ట్‌వేర్ జాబ్ కూడా బలాదూర్ అంటారు
Business Idea: వ్యాపారం చేయాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే సరైన అవగాహన లేకో, నష్టాలు వస్తాయని భయపడో వెనుకడుగు వేస్తుంటారు. కానీ సరికొత్తగా ఆలోచిస్తే మంచి లాభాలు పొందొచ్చు. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్వచ్ఛతకు పెరుగుతోన్న డిమాండ్
ఇప్పటి మార్కెట్‌లో కల్తీ సమస్య పెద్దగా మారింది. నిత్యం వాడే ఆహార పదార్థాలపైనా నమ్మకం తగ్గుతోంది. తినే వస్తువుల్లో కల్తీ ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ప్రజలు స్వచ్ఛమైన ఆహారాన్ని వెతుకుతున్నారు. ఇంట్లో తయారయ్యే పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పరిస్థితి చిన్న స్థాయి వ్యాపారాలకు మంచి అవకాశంగా మారింది. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే నష్టం లేకుండా ఆదాయం వచ్చే ఒక మార్గం ఇప్పుడు చూద్దాం.
ఇంటి నుంచే ప్రారంభించగల వ్యాపారం
నెయ్యి అనేది దాదాపు ప్రతి ఇంట్లో వాడే ఆహార పదార్థం. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు నెయ్యిని క్రమం తప్పకుండా ఇస్తుంటారు. స్వచ్ఛమైన నెయ్యికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఇంట్లోనే తయారయ్యే నెయ్యిపై వినియోగదారులు ఎక్కువ నమ్మకం చూపుతున్నారు. అందుకే ఇంటి స్థాయిలోనే నెయ్యి తయారీ ప్రారంభిస్తే నెలకు వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. దీనికి పెద్ద షాప్ కూడా అవసరం లేదు.
నెయ్యి తయారీకి అవసరమైన సామగ్రి
ఈ వ్యాపారం మొదలు పెట్టేందుకు భారీ పెట్టుబడి అవసరం ఉండదు.
* క్రీమ్ సెపరేటర్ మిషిన్ ఒకటి
* ఫ్యాట్ శాతం ఎక్కువగా ఉండే పాలు
* గ్యాస్ స్టౌవ్ లేదా ఇండక్షన్
* నెయ్యి నిల్వ చేసేందుకు స్టీల్ పాత్రలు
* ప్యాకింగ్ కోసం డబ్బాలు లేదా కవర్లు.
క్రీమ్ సెపరేటర్ మిషిన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా దొరుకుతున్నాయి. చేతితో తిప్పే మోడల్స్ తక్కువ ధరకు లభిస్తాయి. పాలు నేరుగా పాడి రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది.
నెయ్యి తయారీ ప్రక్రియ
మొదట పాలను క్రీమ్ సెపరేటర్ మిషిన్‌లో పోయాలి. మిషిన్ ఆన్ చేసిన తర్వాత ఒక వైపు నుంచి క్రీమ్ బయటకు వస్తుంది. మరో వైపు నుంచి తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు వస్తాయి. సేకరించిన క్రీమ్‌ను మెల్లగా వేడి చేస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యి చల్లారిన తర్వాత డబ్బాల్లో నింపి అమ్మకానికి సిద్ధం చేయొచ్చు. క్రీమ్ తీసిన పాలను టీ దుకాణాలకు లేదా స్వీట్ షాపులకు విక్రయించవచ్చు. ఇలా ఒక్క రూపాయి కూడా వృథా కాదు.
లాభాల ఎలా ఉంటాయంటే.?
లాభాల విషయానికి వస్తే ఇది ఆకర్షణీయమైన వ్యాపారంగా చెప్పొచ్చు. సుమారు 18 లీటర్ల పాలతో ఒక కిలో నెయ్యి వస్తుంది. ఉదాహరణకు 90 లీటర్ల పాలు తీసుకుంటే దాదాపు 5 కిలోల నెయ్యి తయారవుతుంది. ప్రస్తుతం స్వచ్ఛమైన నెయ్యిని కిలోకు రూ. 650 వరకు విక్రయించవచ్చు. అలా చూసుకుంటే నెయ్యి ద్వారా సుమారు రూ. 3250 ఆదాయం వస్తుంది. మిగిలిన 70 లీటర్ల పాలను లీటర్‌కు రూ. 38 చొప్పున అమ్మినా మరో రూ. 2600 వస్తాయి. మొత్తంగా ఒక బ్యాచ్‌తో సుమారు రూ. 5800 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని ఖర్చులు పోయినా భారీగా లాభం ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఆర్డర్లను స్వీకరించి నేరుగా ఇంటికి హోం డెలివరీ కూడా చేయొచ్చు. ఇక స్థానికంగా ఉన్న స్వీట్ షాప్స్, హోటల్స్‌కు కూడా సరఫరా చేయొచ్చు.

