MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Facts : ఆటోకు 3 చక్రాలే ఎందుకుంటాయి? కారులా 4 ఎందుకుండవు?

Facts : ఆటోకు 3 చక్రాలే ఎందుకుంటాయి? కారులా 4 ఎందుకుండవు?

చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటాయి… కానీ ఆటో రిక్షా కు మాత్రం మూడు చక్రాలే ఉంటాయి… ఇలా ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 24 2026, 07:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆటోకు 3 చక్రాలే ఎందుకు?
Image Credit : ChatGPT

ఆటోకు 3 చక్రాలే ఎందుకు?

భారతదేశంలో ప్రజా రవాణాకు ఎక్కువగా ఉపయోగించే వాహనాల్లో ఆటోలు కూడా ఒకటి. రోడ్డుపైకి వెెళితే చాలు ప్యాసింజర్ల కోసం ఎదురుచూసేవి, వారిని తీసుకుని రయ్ రయ్ అంటూ దూసుకెళ్లే ఆటోలు కనిపిస్తాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఈ ఆటోలు కీలక పాత్ర పోషిస్తున్నాయి… సొంత వాహనం లేని వాళ్లు ఆశ్రయించేది ఈ ఆటోలనే. స్కూల్ విద్యార్థుల నుండి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల, చిరు వ్యాపారుల వరకు ఎంతోమందిని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి ఆటోరిక్షాలు.

ఆటోలు ప్యాసింజర్ల ప్రయాణానికే కాదు కొందరి జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఈ ఆటోలు నడుపుకుని చాలామంది డ్రైవర్లు ఉపాది పొందుతున్నారు… భార్యాపిల్లలను పోషించుకుంటున్నారు. కొందరు సొంతంగా ఆటో కొనుక్కుని నడుపుకుంటే మరికొందరు అద్దెకు తీసుకుని నడుపుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. 

ఆటోలో ప్రయాణించే ప్యాసింజర్లు, ఆటో డ్రైవర్లు సరే… మరి ఈ ఆటో స్టోరీ ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని వాహనాలకు 4 చక్రాలుంటే ఈ ఆటోకు మాత్రం 3 చక్రాలుంటాయి? ఇలా ఎందుకు అనే అనుమానం వచ్చిందా? ఆటోకు మూడు చక్రాలే ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఇరుకు రోడ్లలో ఈజీ టర్నింగ్
Image Credit : Gemini AI

1. ఇరుకు రోడ్లలో ఈజీ టర్నింగ్

ఆటోలను ఎక్కువగా రద్దీగా ఉండే రోడ్లు, ఇరుకైన వీధుల్లో ప్రయాణించేందుకే డిజైన్ చేశారు. మూడు చక్రాలు ఉండటం వల్ల వాటి టర్నింగ్ రేడియస్ (తిరగడానికి పట్టే ప్రదేశం) చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా ఇరుకైన రోడ్లు, రద్దీగా ఉండే సందుల్లో కూడా ఆటోను సులభంగా యూ-టర్న్ చేయొచ్చు లేదా తిప్పొచ్చు. కానీ నాలుగు చక్రాల వాహనాలు ఇంత రద్దీలో సులభంగా దూసుకెళ్లలేవు.

Related Articles

Related image1
Facts : 1 మిలియన్ ని 1M అంటారు.. మరి థౌజండ్ ని 1T కాకుండా 1K అని ఎందుకంటారు?
Related image2
Facts : అమెరికా ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఎందుకు కనిపించవో తెలుసా?
36
2. తక్కువ తయారీ, నిర్వహణ ఖర్చు
Image Credit : Gemini AI

2. తక్కువ తయారీ, నిర్వహణ ఖర్చు

నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే మూడు చక్రాల వాహనాల తయారీ, నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఒక చక్రం తక్కువ కావడం వల్ల దాని డిజైన్, తయారీకి అవసరమైన విడిభాగాల ఖర్చు బాగా తగ్గుతుంది. టైర్లు మార్చడం, బ్రేక్ సర్వీస్ వంటి నిర్వహణ ఖర్చులు కూడా మూడు చక్రాలకే కాబట్టి తక్కువగా ఉంటాయి. బరువు తక్కువగా ఉండటం వల్ల ఇంజిన్‌పై భారం తగ్గి, ఇంధన సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది చిన్న వ్యాపారులకు, రోజువారీ ప్రయాణికులకు చౌకైన ఆప్షన్‌గా నిలుస్తుంది.

46
3. ఎక్కువ మైలేజ్
Image Credit : Gemini AI

3. ఎక్కువ మైలేజ్

నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే మూడు చక్రాల వాహనాల బరువు చాలా తక్కువగా ఉంటుంది. వాహనం బరువు తగ్గితే ఇంజిన్‌పై భారం తగ్గి, ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇది ఆటో డ్రైవర్ల రోజువారీ లాభానికి చాలా ముఖ్యం. ఒకవేళ ఆటోకు నాలుగు చక్రాలు అమర్చితే దాని వేగం తగ్గిపోతుంది. చిన్న రోడ్లలో గమ్యాన్ని వేగంగా చేరుకోలేరు. అందుకే ఆటోలకు మూడు చక్రాలనే అమర్చుతారు.

56
4. తక్కువ ధర
Image Credit : Gemini AI

4. తక్కువ ధర

ఆటోలను ఎక్కువగా మధ్యతరగతి, సామాన్య వినియోగదారులు లేదా స్వయం ఉపాధి పొందే వారిని లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తారు. నాలుగు చక్రాల కారు ధర కంటే ఆటో ధర చాలా రెట్లు తక్కువ. కాబట్టి సామాన్యులు కూడా సులభంగా లోన్ తీసుకుని దీనిని కొనుగోలు చేయగలరు. తయారీ, మరమ్మతుల ఖర్చు కూడా తక్కువే. నాలుగు చక్రాల వాహనాలు ఎక్కువ ఇంధనాన్ని వాడటమే కాకుండా, ట్రాఫిక్ రద్దీని కూడా పెంచుతాయి. కానీ ఆటోలు ఈ సమస్యను గణనీయంగా తగ్గిస్తాయి.

66
5. ఈ మూడు చక్రాల డిజైన్ తో ప్రమాదం
Image Credit : AI Generated

5. ఈ మూడు చక్రాల డిజైన్ తో ప్రమాదం

మూడు చక్రాల డిజైన్ పట్టణ రవాణాకు సరిగ్గా సరిపోతుంది. విలాసవంతమైన ప్రయాణం కాకుండా, తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణాన్ని అందించడమే దీని ఉద్దేశం. అయితే ఈ మూడు చక్రాల డిజైన్ తో అన్నీ లాభాలే కాదు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. 

నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే మూడు చక్రాల వాహనాల్లో స్థిరత్వం (స్టెబిలిటీ) కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ వేగంతో టర్న్ చేసేటప్పుడు బోల్తా పడే ప్రమాదం ఎక్కువ. కాబట్టి దీన్ని నిర్దిష్ట వేగ పరిమితితో నడపాలి. ఇకపై మీరు ఆటోలో ప్రయాణించేటప్పుడు, దాని మూడు చక్రాలు కేవలం ఒక సాధారణ డిజైన్ కాదని గుర్తుంచుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Buying Guide : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? అయితే జాగ్రత్త.. ఈ ఒక్కటి చెక్ చేయకపోతే బొక్కబోర్లా పడతారు
Recommended image2
Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?
Recommended image3
Best 7 Seater EV : ఫుల్ ఛార్జ్ చేస్తే 679 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. బెస్ట్ 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Related Stories
Recommended image1
Facts : 1 మిలియన్ ని 1M అంటారు.. మరి థౌజండ్ ని 1T కాకుండా 1K అని ఎందుకంటారు?
Recommended image2
Facts : అమెరికా ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఎందుకు కనిపించవో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved