MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Automobile
  • Tata Nexon : కొత్తకారు కొనేవారికి టాటా బంపరాఫర్.. ట్రెండింగ్ ఎస్‌యూవీ నెక్సాన్‌ ధర భారీగా తగ్గిందోచ్..!

Tata Nexon : కొత్తకారు కొనేవారికి టాటా బంపరాఫర్.. ట్రెండింగ్ ఎస్‌యూవీ నెక్సాన్‌ ధర భారీగా తగ్గిందోచ్..!

టాటా మోటార్స్ తన పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్‌పై అదిరిపోయే బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు ఉన్నాయి. ఈ నెల ఆగస్ట్ లో కొన్నవారికే ఈ ఆఫర్.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 05 2026, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ నెలలొ టాటా నెక్సాన్ కొంటే.. ధర ఎంత తగ్గుతుందో తెలుసా?
Image Credit : Gemini

ఈ నెలలొ టాటా నెక్సాన్ కొంటే.. ధర ఎంత తగ్గుతుందో తెలుసా?

Tata Nexon : కొత్త కారు ముఖ్యంగా ఓ మంచి ఎస్‌యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి సమయం. టాటా మోటార్స్ తమ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన నెక్సాన్‌పై ఈ నెలలో (ఆగస్ట్) భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెలలో నెక్సాన్ కొనే కస్టమర్లకు ఏకంగా రూ.75,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర డీలర్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చూపు తిప్పుకోలేని డిజైన్, ప్రీమియం క్యాబిన్
Image Credit : official website

చూపు తిప్పుకోలేని డిజైన్, ప్రీమియం క్యాబిన్

టాటా నెక్సాన్ చాలా స్ట్రాంగ్, స్పోర్టీ లుక్‌తో వస్తుంది. ముందు వైపు ఉండే LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, పెద్ద గ్రిల్ కారుకు ఓ స్పెషల్ లుక్ ఇస్తాయి. స్టైలిష్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్ దీని ఎస్‌యూవీ ఫీల్‌ను మరింత పెంచుతాయి. వెనుకవైపు కనెక్టెడ్ టెయిల్ లైట్స్ ఉండటంతో కారుకు మోడరన్ లుక్ వచ్చింది.

ఇక నెక్సాన్ ఇంటీరియర్ విషయానికి వస్తే క్యాబిన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా మారుస్తాయి. ఫ్యామిలీ ట్రిప్పుల కోసం 382 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.

Related Articles

Related image1
Tata Punch EV: మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా పంచ్ ఈవీ ఫేస్ లిస్ట్..సేఫ్టీలోనూ ది బెస్ట్
Related image2
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
34
పవర్‌ఫుల్ ఇంజిన్, 5-స్టార్ సేఫ్టీ భరోసా
Image Credit : tata motors

పవర్‌ఫుల్ ఇంజిన్, 5-స్టార్ సేఫ్టీ భరోసా

నెక్సాన్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, సీఎన్‌జీ.. ఇలా మూడు ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కారుకు గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. ఇది ఈ కారుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.

మైలేజ్ విషయంలో కూడా నెక్సాన్ పర్వాలేదనిపిస్తుంది. పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు సుమారు 17 కిలోమీటర్లు, డీజిల్ వేరియంట్ 23 నుంచి 24 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక సీఎన్‌జీ వేరియంట్ కేజీకి సుమారు 17.4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

44
టాటా నెక్సాన్ ధర ఎంత?
Image Credit : Twitter

టాటా నెక్సాన్ ధర ఎంత?

టాటా నెక్సాన్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.7.40 లక్షల నుంచి మొదలై రూ.14.30 లక్షల వరకు ఉంది. మంచి బిల్డ్ క్వాలిటీ, అదిరిపోయే ఫీచర్లు, 5-స్టార్ సేఫ్టీ, రకరకాల ఇంజిన్ ఆప్షన్ల కారణంగా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో నెక్సాన్ చాలా పాపులర్ అయ్యింది. మార్కెట్లో ఈ కారుకు మారుతి సుజుకి బ్రెజా, కియా సోనెట్ వంటి మోడళ్ల నుంచి గట్టి పోటీ ఉంది.

గమనిక: పైన చెప్పిన డిస్కౌంట్లు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడ్డాయి. ఈ ఆఫర్లు రాష్ట్రం, నగరం, డీలర్‌షిప్, స్టాక్, కారు రంగు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. మీ నగరంలో లేదా డీలర్‌షిప్‌లో ఈ డిస్కౌంట్ ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. కాబట్టి కారు కొనే ముందు కచ్చితమైన డిస్కౌంట్ వివరాల కోసం మీ దగ్గరలోని లోకల్ డీలర్‌ను సంప్రదించండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bajaj Pulsar: కొత్త లుక్.. క్రేజీ ఫీచర్లు.. మార్కెట్లోకి సరికొత్త బజాజ్ పల్సర్ 150, 125 గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
Ola Scooter Offers : కేవలం రూ.59,999 కే ఓలా స్కూటర్, నెలనెలా అతి తక్కువ EMI.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు
Recommended image3
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Related Stories
Recommended image1
Tata Punch EV: మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా పంచ్ ఈవీ ఫేస్ లిస్ట్..సేఫ్టీలోనూ ది బెస్ట్
Recommended image2
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved