MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • EV Car : సింగిల్ ఛార్జ్‌తో 600 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. 2 టన్నుల బరువునైనా మోసే సూపర్ ఈవి కారు ఇదే..

EV Car : సింగిల్ ఛార్జ్‌తో 600 కి.మీ నాన్ స్టాప్ జర్నీ.. 2 టన్నుల బరువునైనా మోసే సూపర్ ఈవి కారు ఇదే..

వోక్స్‌వ్యాగన్ తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఐడీ టిగువాన్'ను 2027లో మార్కెట్లోకి తీసుకురానుంది. సింగిల్ ఛార్జ్‌తో 600 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ కారులో మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 13 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త ఈవి
Image Credit : Volkswagen Website

వోక్స్‌వ్యాగన్ నుంచి కొత్త ఈవి

Volkswagen ID Tiguan EV : జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్‌వ్యాగన్.. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి మరో కొత్త మోడల్‌ను దించుతోంది. కంపెనీకి చెందిన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'ఐడీ టిగువాన్' (ID. Tiguan) 2027 ఆరంభంలో యూరప్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సత్తా కలిగి ఉంటుందట. ఇందులో కస్టమర్లకు మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. అద్భుతమైన క్యాబిన్ ఫీచర్లు, కొత్త డిజైన్‌తో పాటు రోజువారీ వాడుకకు అనువుగా ఉండేలా కంపెనీ దీన్ని తీర్చిదిద్దింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కొత్త డిజైన్, ప్రీమియం క్యాబిన్
Image Credit : Volkswagen Website

కొత్త డిజైన్, ప్రీమియం క్యాబిన్

వోక్స్‌వ్యాగన్ ప్యూర్ పాజిటివ్ డిజైన్ స్టైల్‌లో ఈ ఐడీ టిగువాన్ ముస్తాబవుతోంది. ఎల్ఈడీ లైట్లు, ఎత్తైన ఎస్‌యూవీ లుక్‌తో కారు ముందు భాగం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఐడీ.4, ఐడీ.5 మోడల్స్ స్థానంలో ఈ కొత్త కారును తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

కంపెనీ ఈ కారు లోపల కూడా భారీ మార్పులే చేసింది. డ్రైవర్ కోసం 10-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇచ్చారు. ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా 12-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. పనోరమిక్ సన్‌రూఫ్, మసాజ్-వెంటిలేషన్ ఫీచర్లున్న ఫ్రంట్ సీట్లు, హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

34
మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు
Image Credit : Volkswagen website

మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు

ఈ కారు బేస్ వేరియంట్‌లో 58 kWh బ్యాటరీ, 188 hp పవర్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. ఇక 77 kWh బ్యాటరీ ఉండే హై-ఎండ్ వేరియంట్ 282 hp పవర్‌ను జనరేట్ చేస్తుంది. టాప్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పాటు గరిష్ఠంగా 299 PS పవర్ లభిస్తుంది. వోక్స్‌వ్యాగన్ చెబుతున్న దాని ప్రకారం.. డబ్ల్యూఎల్‌టీపీ (WLTP) స్టాండర్డ్స్‌లో ఈ కారు వేరియంట్‌ను బట్టి సింగిల్ ఛార్జ్‌పై 600 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. అయితే వాతావరణం, డ్రైవింగ్ స్టైల్, రోడ్డు కండిషన్స్ ఆధారంగా రియల్ వరల్డ్ రేంజ్‌లో మార్పులు ఉండొచ్చు.

రెండు టన్నుల టోవింగ్ కెపాసిటీ

వన్ పెడల్ డ్రైవింగ్, కనెక్టెడ్ ట్రావెల్ అసిస్ట్, ట్రాఫిక్ లైట్లను గుర్తించే డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ లాంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. కారు బ్యాటరీతో బయటి ఎలక్ట్రిక్ పరికరాలను వాడుకునేందుకు వీలుగా వీ2ఎల్ (V2L) సిస్టమ్ కూడా ఇచ్చారు. ఈ కొత్త ఎస్‌యూవీ ఏకంగా రెండు టన్నుల బరువును లాగగలదని (టోవింగ్ కెపాసిటీ) కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

44
ఐడీ టిగువాన్ ఇండియాకు వస్తుందా?
Image Credit : Getty

ఐడీ టిగువాన్ ఇండియాకు వస్తుందా?

వోక్స్‌వ్యాగన్.. 2027 మొదట్లో యూరప్‌లో ఈ ఐడీ టిగువాన్ ఈవి కారు సేల్స్ ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ టిగువాన్ మోడల్స్‌ను ఆపేసి దీన్ని తీసుకురావడం లేదు… వాటితో పాటే ఈ ఐడీ టిగువాన్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇండియాలో ఈ కారు లాంచ్‌పై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి మన దేశంలోకి ఈ కారు ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాల్సిందే.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
EV battery replacement Cost : ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ మార్చాలంటే ఎంత ఖర్చవుతుంది?
Recommended image2
Bikes Offer : రూ.2,80,000 సూపర్ బైక్ కేవలం రూ.4,999 కే మీసొంతం.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔట్
Recommended image3
Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?
Related Stories
Recommended image1
EV battery replacement Cost : ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ మార్చాలంటే ఎంత ఖర్చవుతుంది?
Recommended image2
ప్రస్తుతం ఇండియాలో ఎన్ని EV వెహికిల్స్ ఉన్నాయి? వీటివల్ల ఎంత పెట్రోల్ ఆదా అవుతోందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved