MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ప్రస్తుతం ఇండియాలో ఎన్ని EV వెహికిల్స్ ఉన్నాయి? వీటివల్ల ఎంత పెట్రోల్ ఆదా అవుతోందో తెలుసా?

ప్రస్తుతం ఇండియాలో ఎన్ని EV వెహికిల్స్ ఉన్నాయి? వీటివల్ల ఎంత పెట్రోల్ ఆదా అవుతోందో తెలుసా?

కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్లతో తీసుకొచ్చిన 'పీఎం ఈ-డ్రైవ్' (PM e-DRIVE) స్కీమ్ ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని అమాంతం పెంచేసింది. ఈ పథకం కింద ఇప్పటివరకు ఏకంగా 34.18 లక్షలకు పైగా ఈవీలు రిజిస్టర్ అయ్యాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 02 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండియాలో పెరిగిన EV వెహికిల్స్
Image Credit : Gemini

ఇండియాలో పెరిగిన EV వెహికిల్స్

రోడ్ల మీద రయ్‌మంటూ దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ బండ్లు మన ప్రయాణాన్ని ఈజీ చేయడమే కాదు దేశంలో కాలుష్యాన్ని, పెట్రోల్ ఖర్చులను భారీగా తగ్గిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'పీఎం ఈ-డ్రైవ్' (PM e-DRIVE) స్కీమ్ రెండో ఏడాదికి దగ్గరపడుతున్న వేళ, అది చూపిస్తున్న ఇంపాక్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రస్తుతం దేశంలో EV వెహికిల్స్ సంఖ్య ఎంత?
Image Credit : chatgpt

ప్రస్తుతం దేశంలో EV వెహికిల్స్ సంఖ్య ఎంత?

మార్చి 31, 2024న 'ఫేమ్' (FAME) స్కీమ్ ముగిశాక, ఆరు నెలల పాటు రూ.778 కోట్లతో 'ఈఎంపీఎస్ 2024' (EMPS 2024) నడిచింది. ఆ తర్వాత అక్టోబర్ 1, 2024న రూ.10,900 కోట్ల భారీ బడ్జెట్‌తో 'పీఎం ఈ-డ్రైవ్' మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా EV వెహికిల్స్ వినియోగం మరింత పెరిగింది.

దేశవ్యాప్తంగా ఈవీల వాడకాన్ని పెంచడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్లు, లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను డెవలప్ చేయడానికి కేంద్రం ఈ ‘పీఎం ఈ-డ్రైవ్’ స్కీమ్ తెచ్చింది. దీంతో సెప్టెంబర్ 26, 2026 నాటికి 34.18 లక్షల ఈవీ వెహికిల్స్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాయి.

రిజిస్టర్ అయిన వెహికల్స్ డీటెయిల్స్

టూ-వీలర్స్ : మొత్తం రిజిస్ట్రేషన్లలో 91% వాటాతో (సుమారు 31.19 లక్షలు) టూ-వీలర్స్ టాప్‌లో ఉన్నాయి.

ఆటోలు : 2.88 లక్షల ఎలక్ట్రిక్ ఆటోలు రిజిస్టర్ అయ్యి 8.4% వాటాను దక్కించుకున్నాయి.

ఇతర వెహికల్స్ : 11,121 ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లతో పాటు 236 ఎలక్ట్రిక్ లారీలు రోడ్డెక్కాయి.

34
EV వెహికిల్స్ తో లాభాలివే..
Image Credit : Gemini

EV వెహికిల్స్ తో లాభాలివే..

ఈవీ వాహనాల వాడకం పెరగడంతో పర్యావరణానికి మేలు జరుగుతోంది, ఆర్థికపరంగా కూడా దేశానికి లాభం కలుగుతోంది. తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కలు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి.

EV వాహనాల వల్ల రోజుకు ఏకంగా 31.3 లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతోందట. అంటే 13 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ ఉన్న 2.4 లక్షల బైక్‌లకు ఫుల్ ట్యాంక్ కొట్టించినంత అన్నమాట..! అలాగే గాలిలో కలవాల్సిన 38.5 లక్షల కిలోల కార్బన్ డయాక్సైడ్ (CO2) తగ్గుతోందట ఇంత భారీ స్థాయిలో విషవాయువును పీల్చుకోవాలంటే మనకు ఏకంగా 6.4 కోట్ల పెద్ద చెట్లు కావాలి.

44
EV అంబులెన్సులు రానున్నాయి.
Image Credit : chatgpt

EV అంబులెన్సులు రానున్నాయి.

కేవలం ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే కాదు, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులను కూడా ఎకో-ఫ్రెండ్లీగా మార్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్ కింద 3,811 ఎలక్ట్రిక్ అంబులెన్స్‌లను రోడ్డెక్కించడానికి రూ.500 కోట్లు కేటాయించింది. ఆటోమొబైల్ కంపెనీలు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయి.

ఫోర్స్ మోటార్స్ కంపెనీ తమ పాపులర్ 'ట్రావెలర్' మోడల్‌లో, సింగిల్ ఛార్జ్‌తో 235 కి.మీ వెళ్లే ఈ-అంబులెన్స్‌ను లాంచ్ చేసి అదరగొట్టింది. స్వచ్ఛమైన గాలి, గ్రీన్ ఎకానమీ లక్ష్యంగా ఇండియా చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ జర్నీ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Bikes : ఇండియన్ యూత్ ను షేక్ చేసేలా.. ఈ నెలలో లాంచ్ అయ్యే టాప్ 5 సూపర్ బైక్స్ ఇవే
Recommended image2
Top EV Scooter : కేవలం 21 నెలల్లో 4,75,144 స్కూటర్ల అమ్మకాలా..! ఈవి మార్కెట్లో ఈ కంపెనీయే తోపు..!
Recommended image3
Best SUVs Under 8 Lakhs: 8 లక్షల లోపే 5 స్టార్ సేఫ్టీ, 21 కిమీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Related Stories
Recommended image1
EV Scooter : ఫోన్ లో కాదు ఇక స్కూటర్ డాష్ బోర్డులోనూ వాట్సాప్.. మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లలో సరికొత్త ఈవి రెడీ
Recommended image2
Top EV Scooter : కేవలం 21 నెలల్లో 4,75,144 స్కూటర్ల అమ్మకాలా..! ఈవి మార్కెట్లో ఈ కంపెనీయే తోపు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved