MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Second Hand Car: కారు తక్కువ ధరకు వస్తోందని కొనేస్తున్నారా? ఇవి చెక్ చేయకపోతే నష్టం తప్పదు!

Second Hand Car: కారు తక్కువ ధరకు వస్తోందని కొనేస్తున్నారా? ఇవి చెక్ చేయకపోతే నష్టం తప్పదు!

Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చాలామంది పైన మెరుపు, తక్కువ ధర చూసి కొనేస్తుంటారు. కానీ పాత కారు కొనేముందు కొన్ని విషయాలు పక్కాగా చెక్ చేయాలి. లేకపోతే కొన్న ధరకంటే రిపేర్ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మరి ఏం చెక్ చేయాలో చూద్దాం.

3 Min read
Author : Kavitha G
Published : Oct 29 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : AI

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ కారు బెస్ట్ ఆప్షన్. కొత్త కారు కంటే తక్కువ ధరకే రావడం దీనిలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. కానీ, కేవలం బయట పాలిష్, అందం చూసి కారు కొంటే.. ఆ తర్వాత రిపేర్లకే తడిసి మోపెడవుతుంది. అందుకే, పాత కారు కొనేముందు దాని కండిషన్, ఇంజిన్, డాక్యుమెంట్లు, యాక్సిడెంట్ హిస్టరీని మనం కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కారు ఎంపిక
Image Credit : Asianet News

కారు ఎంపిక

కారు కొనేముందే మనకు ఎలాంటి కారు కావాలి, ఎంత ఖర్చు చేయగలం అనేది ముందుగానే డిసైడ్ చేసుకోవాలి. కేవలం కారు ధరను బట్టే బడ్జెట్ ఫిక్స్ చేసుకోకూడదు. ఇన్సూరెన్స్, సర్వీసింగ్, ఆర్సీ (RC) పేరు మార్పిడి, ట్యాక్స్, భవిష్యత్తులో వచ్చే రిపేర్ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోవాలి.

రోజువారీ ప్రయాణం, కుటుంబ అవసరాలను బట్టి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ (CNG) లేదా ఎలక్ట్రిక్ కారు.. ఏది సెట్ అవుతుందో చూసుకోవాలి. కారును చెక్ చేసేటప్పుడు బాడీపై పెద్ద గీతలు, తుప్పు పట్టడం, పెయింట్ సరిగా లేకపోవడం, యాక్సిడెంట్ అయిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి.

డోర్లు, బోనెట్, డిక్కీ అన్నీ తెరిచి, మూసి అవి సరిగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి. కారు లోపల కూడా చెక్ చేయాలి. సీట్ల క్వాలిటీ, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్, హెడ్‌లైట్స్, ఇండికేటర్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలి.

35
ఇంజిన్, మెకానికల్ పార్ట్స్ చెక్ చేయడం
Image Credit : Unsplash

ఇంజిన్, మెకానికల్ పార్ట్స్ చెక్ చేయడం

పాత కారు అసలు కండిషన్ తెలుసుకోవాలంటే ఇంజిన్, మెకానికల్ పార్ట్స్ చెక్ చేయడం చాలా ముఖ్యం. మీకు కారు టెక్నికల్ విషయాలు పెద్దగా తెలియకపోతే, మీకు తెలిసిన నమ్మకమైన మెకానిక్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. ఇంజిన్, క్లచ్, గేర్‌బాక్స్, బ్రేకులు, బ్యాటరీ కండిషన్ చెక్ చేయాలి. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు వింత శబ్దాలు వస్తున్నాయా, పొగ వస్తుందా, ఆయిల్ లీక్ అవుతుందా అనేది గమనించాలి.

టెస్ట్ డ్రైవ్ ముఖ్యం

కారు కొనేముందు కచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. వీలైతే 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు నడిపి చూసి.. ఇంజిన్, గేర్ షిఫ్టింగ్, స్టీరింగ్, బ్రేకులు ఎలా పనిచేస్తున్నాయో చెక్ చేయాలి. డ్రైవ్ చేస్తున్నప్పుడు వింత శబ్దాలు, ఎక్కువ వైబ్రేషన్ రావడం, స్టీరింగ్ ఒకవైపు లాగడం లేదా బ్రేక్ వేసినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే కారణం ఏంటో ఆరా తీయాలి.

45
డాక్యుమెంట్లు చెక్ చేయడం
Image Credit : Asianet News

డాక్యుమెంట్లు చెక్ చేయడం

సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు డాక్యుమెంట్లు చెక్ చేయడం అత్యంత ముఖ్యమైన పని. కారు ఆర్సీ (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ (PUC), సర్వీస్ రికార్డ్స్ అన్నీ సరిచూసుకోవాలి. కారుపై ఏదైనా లోన్ ఉందా లేదా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది నిర్ధారించుకోవాలి.

గతంలో లోన్ తీసుకుని ఉంటే, దాన్ని పూర్తిగా క్లియర్ చేశారా, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా అని చూడాలి. ఆర్సీలో ఉన్న ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్.. కారుపై ఉన్న నంబర్‌తో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సర్వీస్ రికార్డ్స్ ఉంటే, కారును టైమ్‌కి సర్వీసింగ్ చేశారా, గతంలో ఏమేం రిపేర్లు వచ్చాయో సులభంగా తెలుసుకోవచ్చు.

55
ఓడోమీటర్ రీడింగ్ చెక్ చేయడం
Image Credit : Asianet News

ఓడోమీటర్ రీడింగ్ చెక్ చేయడం

కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో తెలుసుకోవడానికి ఓడోమీటర్ రీడింగ్ చూడొచ్చు. కానీ, మీటర్‌లో కనిపించే దాన్ని గుడ్డిగా నమ్మేయడం పొరపాటు. సర్వీస్ రికార్డ్స్‌లో ఉన్న రీడింగ్‌తో పోల్చి చూసి, రెండూ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. ఏదైనా అనుమానం వస్తే ఇంకాస్త లోతుగా విచారించాలి.

కారు గతంలో ఎప్పుడైనా పెద్ద యాక్సిడెంట్‌కు గురైందేమో చూడాలి. బయట కొత్తగా పెయింట్ వేశారు కదా అని అది యాక్సిడెంట్ అయిన కారు అని ఫిక్స్ అవ్వలేం. అలాగని, చూడటానికి అందంగా ఉన్న కారుకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదని కూడా అనుకోకూడదు. అవసరమైతే, నిపుణుల సాయంతో బాడీని, ముఖ్యమైన భాగాలను చెక్ చేయించడం మంచిది.

మార్కెట్ ధరతో పోల్చి చూడటం

ఒకే మోడల్, ఒకే ఏడాదిలో వచ్చిన కార్ల ధరలను పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో చెక్ చేయాలి. మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే కారును అమ్మేస్తుంటే, దానికి కారణం ఏంటో ఆరా తీయాలి. కారు సర్వీస్ హిస్టరీ, తిరిగిన కిలోమీటర్లు, యాక్సిడెంట్ బ్యాక్‌గ్రౌండ్, ప్రస్తుత కండిషన్.. ఇవన్నీ ధరపై ప్రభావం చూపుతాయి. కేవలం తక్కువ ధరకు వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో తొందరపడి కారును కొనకూడదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Lunch
SASA
329
AUSAUS
(117.0 ov)411/8
Day 3 - Session 1
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Car Sunroof: కారుకు బయట సన్ రూఫ్ వేయిస్తే వారంటీ పోతుందా? ఇన్సూరెన్స్‌లో కూడా చిక్కులేనా?
Recommended image2
Top 7 SUV Cars : 9 సెకన్లలోనే 0 టు 100 కి.మీ స్పీడ్..! జెట్ స్పీడ్ తో దూసుకెళ్లే ఎస్‌యూవీ కార్లు ఇవే
Recommended image3
Top 3 Low Budget Cars : రూ.3.70 లక్షలకే 24 kmpl మైలేజ్ కారు.. రూ.5 లక్షల్లోపు ధరలో బెస్ట్ 3 కార్లు ఇవే
Related Stories
Recommended image1
Folk Song: 10 రోజుల్లో 10 కోట్ల వ్యూస్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాధురీ రాథోడ్ కంబ్యాక్ సాంగ్!
Recommended image2
Curly Hair: ఉంగరాల జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved