- Home
- Entertainment
- Folk Song: 10 రోజుల్లో 10 కోట్ల వ్యూస్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాధురీ రాథోడ్ కంబ్యాక్ సాంగ్!
Folk Song: 10 రోజుల్లో 10 కోట్ల వ్యూస్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాధురీ రాథోడ్ కంబ్యాక్ సాంగ్!
Folk Song: ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. అలా ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది మాధురి రాథోడ్ న్యూ సాంగ్. ఆ పాట విశేషాలేంటో చూద్దామా..

మాధురి రాథోడ్ కొత్త పాట
ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా వాటి హవానే నడుస్తోంది. ఇప్పుడు యూట్యూబ్ లో మరో కొత్త సాంగ్ దుమ్మురేపుతోంది. అదే ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ కంబ్యాక్ సాంగ్. ఇటీవల కాస్త పర్సనల్ ఇష్యూస్ తో ఫోక్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మాధురి.. ఈ సాంగ్ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంతకీ ఆ పాట ఏంటి? దాని ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
భామా సుందరాలో ఫోక్ సాంగ్
భామా సుందరాలో వెన్నెల.. బంగారు కుందనాలో వెన్నెల.. అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన పది రోజుల్లోనే దాదాపు పది మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. పాటలో మాధురి కనిపించిన తీరు, ఆమె డ్యాన్స్ ఫోక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. నిజానికి మాధురి రాథోడ్ పేరు వినగానే చాలామందికి ఆమె ఎనర్జిటిక్ డ్యాన్స్, మనసుకు తాకే ఎక్స్ ప్రెషన్స్ గుర్తుకొస్తాయి. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత మాధురి నుంచి వచ్చిన ఈ సాంగ్ తనని ఫోక్ అభిమానులకు మరింత దగ్గర చేసిందనే చెప్పాలి.
పాట ప్రత్యకత
ఈ పాటలో మాధురి రాథోడ్‌తో కలిసి వెంకట్ అజ్మీరా కూడా కనిపించారు. సాధారణంగా ఒక ఫోక్ సాంగ్ ప్రేక్షకులకు నచ్చాలంటే మంచి సాహిత్యం, ఆకట్టుకునే మ్యూజిక్, దానికి సెట్ అయ్యే విజువల్స్ అవసరం. అయితే ఈ మూడు అంశాలను సమన్వయం చేసే ప్రయత్నం ‘భామా సుందరాలో’ పాటలో కనిపిస్తుంది. వెంకట్ అజ్మీరా ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు, పాటలో భాగస్వామిగా కనిపించడం విశేషం.
నా జీవితం కళకే అంకితం..
ఈ పాటకు దివంగత రామస్వామి సాహిత్యం అందించారు. వెంకట్ అజ్మీరా మ్యూజిక్ అందించగా శేఖర్ వైరస్ డైరెక్షన్ అండ్ కొరియోగ్రఫి చేశారు. సింగర్స్ నరసింహులు, ముకుంద ఈ పాటను ఆలపించారు. ఈ పాట ద్వారా మాధురి రాథోడ్ తన జీవితం కళకే అంకితమనే సందేశాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సాంగ్ మాధురికి మంచి కంబ్యాక్ సాంగ్ అని, మాధురి రాథోడ్ లాంటి టాలెంటెడ్ డ్యాన్సర్ కి మంచి అవకాశాలు రావాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.





