- Home
- Automobile
- Best Adventure Bike : కారు ఇంజిన్ కెపాసిటీతో సూపర్ బైక్..! బెస్ట్ అడ్వెంచర్ ఏది? దాని ఫీచర్లేంటి?
Best Adventure Bike : కారు ఇంజిన్ కెపాసిటీతో సూపర్ బైక్..! బెస్ట్ అడ్వెంచర్ ఏది? దాని ఫీచర్లేంటి?
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 బైక్ అతిత్వరలో ఇండియాలో లాంచ్ కానుంది. నవంబర్ 27 నుంచి బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ బైక్ 743సీసీ ఇంజిన్, ఫీచర్లు, ధర లాంటి ముఖ్యమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750 లాంచ్
చిన్న కారు ఇంజిన్ సామర్థాన్ని కలిగిన బైక్ హిమాలయన్ 750. ఈ బైక్ త్వరలోనే ఇండియాలో లాంచ్ కానుంది… దీనిపై కీలక అప్డేట్స్ వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ అడ్వెంచర్ టూరర్ బైక్‌ను గోవాలో జరగనున్న రాయల్ ఎన్ఫీల్డ్ మోటోవర్స్ 2026 ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. దీంతో బైక్ లవర్స్‌లో ఆసక్తి పెరిగింది.
ఈ నెల 27 నుంచి 29 వరకు గోవాలో మోటోవర్స్ ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడే హిమాలయన్ 750 ధరను అధికారికంగా ప్రకటిస్తారు. నవంబర్ 27 నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కస్టమర్లు ముందే ఈ కొత్త బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.
కొత్త 743సీసీ ఇంజిన్
ఈ బైక్ కొత్త 743సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. పాత హిమాలయన్ 450 మోడల్లో సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండగా, ఈ కొత్త మోడల్ రెండు సిలిండర్లతో వస్తుంది. లాంగ్ డ్రైవ్‌లో ఇది సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 55 హెచ్‌పీ పవర్, 63 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 3,500 ఆర్పీఎమ్ వద్దే 90% టార్క్ దొరుకుతుందని కంపెనీ చెప్తోంది.
హైవేలపైనే కాకుండా, కొండ ప్రాంతాల్లో కూడా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఈ కొత్త హిమాలయన్ బైక్ ద్వారా లభిస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తోంది. 2 ఇన్ 1 సైలెన్సర్ సెటప్ కూడా ఉంది. తక్కువ, మీడియం స్పీడ్‌లో మంచి టార్క్ వచ్చేలా ఇంజిన్‌ను డిజైన్ చేశారు… దీంతో పదేపదే గేర్లు మార్చే పని తప్పుతుంది.
సస్పెన్షన్, బ్రేకింగ్ ఫీచర్లు
హిమాలయన్ 750 బైక్ ముందు భాగంలో 43 ఎంఎం షోవా అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ ఉన్నాయి. వీటిని పూర్తిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెనుక భాగంలో షోవా మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. రోడ్డుకు తగ్గట్టు సస్పెన్షన్‌ను మార్చుకోవచ్చు.
బ్రేకింగ్ విషయానికొస్తే రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ టైమ్ ముందు భాగంలో రెండు డిస్క్ బ్రేక్‌లు ఇచ్చింది. వెనుక వైపు కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. సేఫ్ జర్నీ కోసం స్విచ్చబుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్ కూడా ఉంది.
అడ్వెంచర్ రైడింగ్ ఫీచర్లు
ఈ బైక్‌కు 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రియర్ వీల్ ఇచ్చారు. అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 205 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో, రఫ్ రోడ్లపై కూడా సులభంగా దూసుకెళ్లొచ్చు.
17.8 లీటర్ల కెపాసిటీ ఉన్న పెట్రోల్ ట్యాంక్ ఉంది. సీటు ఎత్తు 815 ఎంఎం, మొత్తం బరువు 224 కిలోలు. లాంగ్ ట్రిప్స్‌లో పదే పదే పెట్రోల్ కొట్టించే పని లేకుండా పెద్ద ట్యాంక్ యూజ్ అవుతుంది.
కొత్త హిమాలయన్ 750 బైక్‌లో 5 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి - రోడ్, రోడ్ స్పోర్ట్, రైన్, ట్రైల్, కస్టమ్. క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 4 అంగుళాల రౌండ్ టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, నావిగేషన్, ఫోన్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. రెండు టైప్ సి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్‌లు కూడా ఉన్నాయి, ఒకదానిలో 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
ధర వివరాలు
హిమాలయన్ 750 బైక్ ఐదు కలర్స్‌లో వస్తుంది - అంటార్కిటిక్ సిల్వర్, సైబీరియా వైట్, వైకింగ్ బ్రాంజ్, అజ్టెక్ గ్రీన్, టెక్టోనిక్ బ్లాక్. అంటార్కిటిక్ సిల్వర్ వేరియంట్లో అదనంగా టూరింగ్ యాక్సెసరీస్ కూడా వస్తాయి. ఇండియాలో ఈ బైక్ ప్రారంభ ధర సుమారు రూ.3.79 లక్షలు ఉండొచ్చని అంచనా. టాప్ వేరియంట్ ధర రూ.4.73 లక్షల వరకు ఉండొచ్చు. అయితే నవంబర్ 27న మోటోవర్స్ ఈవెంట్లోనే అసలు ధరను అఫీషియల్‌గా ప్రకటిస్తారు.













