MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Top 5 Cheapest Bikes : పండగ సీజన్లో కేవలం రూ.60,000 కే.. మైండ్ బ్లోయింగ్ మైలేజ్ బైక్ మీ సొంతం

Top 5 Cheapest Bikes : పండగ సీజన్లో కేవలం రూ.60,000 కే.. మైండ్ బ్లోయింగ్ మైలేజ్ బైక్ మీ సొంతం

ఈ దసరా లేదా దీపావళి పండగల వేళ కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో అదిరిపోయే మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ మీకోసం. వాటి ధర, మైలేజ్, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 07 2026, 10:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్
Image Credit : honda,hero

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్

పండగ సీజన్‌లో కొత్త బైక్ కొనాలని చాలామంది అనుకుంటారు… కానీ లక్షల రూపాయలు పెట్టేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా ఇంటినుండి ఆఫీసుకు లేదంటే వ్యాపారం చేసుకునే ప్రాంతానికి వెళ్లివచ్చేందుకు మాత్రమే బైక్ ఉపయోగించేవారు తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ చూస్తుంటారు. కాలేజీ యువత కూడా బెస్ట్ మైలేజ్ బైక్స్ కోరుకుంటారు. ఇలాంటివారు కమ్యూటర్ బైక్స్ తీసుకోవడం బెటర్. ఈ సెగ్‌మెంట్‌లో 100 నుంచి 110 సీసీ బైక్స్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది.

ఆటోమొబైల్ మార్కెట్ వివరాల ప్రకారం… హీరో హెచ్ఎఫ్ 100, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, టీవీఎస్ స్పోర్ట్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 బైక్స్ తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్స్. అయితే నగరం, షోరూమ్‌ను బట్టి వీటి ధరలు మారుతుంటాయి… కాాబట్టి మీ నగరంలో ఏ బైక్ ధర ఎంత ఉందో తెలుసుకోవడం ఉత్తమం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హీరో హెచ్ఎఫ్ 100
Image Credit : https://www.heromotocorp.com/

హీరో హెచ్ఎఫ్ 100

తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ లిస్ట్‌లో హీరో హెచ్ఎఫ్ 100 ముందుంటుంది. సాధారణ ఉద్యోగులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 4-స్పీడ్ గేర్‌బాక్స్, సిటీ రైడింగ్‌కు తగ్గ డిజైన్ దీని సొంతం. హైదరాబాద్ లో దీని ధర రూ.61589 (ఎక్స్ షోరూమ్) గా ఉంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ కూడా తక్కువ ధరలో లభిస్తుంది. హీరో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం దీని ధర రూ.59,477 గా ఉంది. 97.2 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ కొన్ని వేరియంట్లలో ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఉంది.

కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఈ బైక్ ఒక వేరియంట్ లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రోజూ ఆఫీస్ లేదా కాలేజీకి వెళ్లేవాళ్లు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే ఈ రెండు మోడల్స్‌ను ఒకసారి పరిశీలించవచ్చు.

36
టీవీఎస్ స్పోర్ట్
Image Credit : Tvs

టీవీఎస్ స్పోర్ట్

బడ్జెట్ ధరలోనే కాస్త పవర్ ఫుల్ బైక్ కావాలనుకునే వారు టీవీఎస్ స్పోర్ట్ మోడల్‌ను చూడొచ్చు. ఇందులో 109.7 సీసీ ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్, మైలేజ్ పెంచే టెక్నాలజీ ఉన్నాయి. కంపెనీ వివరాల ప్రకారం దీని ఇంజిన్ 6.03 kW గరిష్ట పవర్‌ను, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మంచి మైలేజ్ కోసం ఎకానమీ ఇండికేటర్ కూడా ఇందులో ఇచ్చారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.69400 గా ఉంది.

46
హోండా షైన్ 100
Image Credit : Honda

హోండా షైన్ 100

ప్రస్తుతం మార్కెట్లో హోండా షైన్ 100 కు మంచి డిమాండ్ ఉంది. హోండా తీసుకొచ్చిన ఈ అప్‌డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ.68,767గా ఉంది. ఇందులో 98.98 సీసీ ఇంజిన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా దీన్ని అప్‌గ్రేడ్ చేశారు. రోజువారీ అవసరాలకు సింపుల్ బైక్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.

56
బజాజ్ ప్లాటినా 100
Image Credit : Google

బజాజ్ ప్లాటినా 100

బడ్జెట్ బైక్స్ జాబితాలో బజాజ్ ప్లాటినా 100 ఉంది. బజాజ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం దీని ప్రారంభ ధర రూ.72,942 గా ఉంది. ఇందులో 99.59 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 8.2 హెచ్‌పీ పవర్, 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. పొడవైన సీటు, మంచి సస్పెన్షన్, ఎలక్ట్రిక్ స్టార్ట్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గుంతల రోడ్లపై కూడా కంఫర్ట్‌గా వెళ్లాలనుకునే వారికి ప్లాటినా 100 బెస్ట్ ఛాయిస్.

కేవలం ధరను మాత్రమే చూసి ఈ ఐదు బైక్స్‌ను అంచనా వేయకండి. మీరు రోజూ ఎంత దూరం ప్రయాణిస్తారు, మీ ఊరి రోడ్లు ఎలా ఉన్నాయి, మీకు ఎంత మైలేజ్ కావాలి అనే విషయాలను బట్టి సరైన బైక్‌ను ఎంచుకోండి. మీ అవసరాలకు ఏది సరిపోతుందో చూసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది.

66
ఎక్కువ మైలేజ్ బైక్
Image Credit : stockPhoto

ఎక్కువ మైలేజ్ బైక్

మీకు తక్కువ ధర మాత్రమే ముఖ్యమైతే హెచ్ఎఫ్ 100 మోడల్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ ధరలో అదనపు ఫీచర్లు, మంచి మైలేజ్ కావాలంటే హెచ్ఎఫ్ డీలక్స్ చూడొచ్చు. కాస్త పెద్ద ఇంజిన్, రోజువారీ ప్రయాణంలో మైలేజ్ కావాలంటే టీవీఎస్ స్పోర్ట్ బెస్ట్. ఇక 100 సీసీ కమ్యూటర్ బైక్ కావాలంటే హోండా షైన్ 100ను పరిశీలించవచ్చు. గుంతల రోడ్లపై కంఫర్ట్ కావాలనుకునే వారికి ప్లాటినా 100 సరిపోతుంది.

అయితే షోరూమ్ ధర మాత్రమే ఫైనల్ కాదు. రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కలిపితే ఆన్-రోడ్ ధర పెరుగుతుంది. పండుగ సీజన్‌లో కంపెనీలు, డీలర్లు ఇచ్చే ఆఫర్లు కూడా మారుతుంటాయి. కాబట్టి ఆన్-రోడ్ ధరను లెక్కేసుకుని మీకు బెస్ట్ అనిపించిన బైక్‌ను ఎంచుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Budget Cars: పండగ సేల్... చాలా తక్కువ ధరకే వెంటిలేటెడ్ సీట్స్ ఉన్న టాప్ 5 కార్లు
Recommended image2
Car Offers : అక్టోబర్ లో ఈ కారు కొంటే.. ఏకంగా రూ.2.34 లక్షలు సేవ్
Recommended image3
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Related Stories
Recommended image1
Bike Mileage : బైక్ మైలేజ్ పెరిగి పెట్రోల్ ఖర్చు తగ్గాలా? అయితే ఈ 7 టిప్స్ ఫాలో అవ్వండి
Recommended image2
Bike Seat: బైక్ వెనక సీటు ఎత్తుగా ఎందుకు ఉంటుంది..? స్టైల్ అయితే కాదు, కారణం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved