MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Top 5 Bikes : ఇండియన్ యూత్ ను షేక్ చేసేలా.. ఈ నెలలో లాంచ్ అయ్యే టాప్ 5 సూపర్ బైక్స్ ఇవే

Top 5 Bikes : ఇండియన్ యూత్ ను షేక్ చేసేలా.. ఈ నెలలో లాంచ్ అయ్యే టాప్ 5 సూపర్ బైక్స్ ఇవే

ఈ పండగల సీజన్లో ఇండియన్ టూ-వీలర్ మార్కెట్ కొత్త బైక్‌లతో కళకళలాడబోతోంది. బీఎండబ్ల్యూ, హోండా, ట్రయంఫ్, బజాజ్, యమహా లాంటి టాప్ కంపెనీలు తమ సరికొత్త పెట్రోల్ బైక్‌లను ఈ నెలలో లాంచ్ చేస్తున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 01 2026, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అక్టోబర్‌లో అదరగొట్టనున్న ఇండియన్ బైక్ మార్కెట్..!
Image Credit : x

అక్టోబర్‌లో అదరగొట్టనున్న ఇండియన్ బైక్ మార్కెట్..!

Top 5 Bikes : కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ పండగ సీజనే (అక్టోబర్ 2026) సరైన సమయ. ఈ నెలలో బీఎండబ్ల్యూ, హోండా, ట్రయంఫ్, యమహా, బజాజ్ లాంటి వరల్డ్ టాప్ ఆటోమొబైల్ కంపెనీలు తమ కొత్త బైక్‌లను ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అయ్యాయి.

రూ.2 లక్షల బడ్జెట్ లో సాధారణ బైక్స్ నుంచి రూ.13 లక్షల లగ్జరీ బైక్స్ వరకు ఈ నెలలో లాంచ్ కాబోతునున్నాయి. సామాన్యుల నుంచి కుర్రకారు వరకు అందరికీ నచ్చేలా వస్తున్న ఈ కొత్త పెట్రోల్ బైక్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బీఎండబ్ల్యూ ఎఫ్ 450 ఆర్ (BMW F 450 R)
Image Credit : BMW

బీఎండబ్ల్యూ ఎఫ్ 450 ఆర్ (BMW F 450 R)

బీఎండబ్ల్యూ కంపెనీ అక్టోబర్ 1న అంటే ఇవాళ (గురువారం) ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ స్ట్రీట్‌ఫైటర్ మోడల్‌ను అఫీషియల్‌గా లాంచ్ చేయబోతోంది. ఈ బీఎండబ్ల్యూ ఎఫ్ 450 ఆర్ బైక్ 420 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 47 పీఎస్ పవర్, 43 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టీవీఎస్ (TVS) ప్లాంట్‌లోనే దీన్ని తయారు చేస్తున్నారు. కాబట్టి మన ఇండియన్ రోడ్లకు తగ్గట్టుగా దీని బిల్డ్ క్వాలిటీ ఉంటుంది.

36
ట్రయంఫ్ బొన్నెవిల్లే 400 (Triumph Bonneville 400)
Image Credit : Triumph

ట్రయంఫ్ బొన్నెవిల్లే 400 (Triumph Bonneville 400)

ట్రయంఫ్ కంపెనీ ప్రస్తుతం ఈ బైక్‌ను ఇండియన్ రోడ్లపై ముమ్మరంగా టెస్ట్ చేస్తోంది. ఇది ఇప్పుడున్న స్పీడ్ 400 మోడల్ కంటే భిన్నంగా, ప్రత్యేకమైన ఛాసిస్, స్వింగ్‌ఆర్మ్ డిజైన్‌తో వస్తోంది. ఇందులో 349 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. రాయల్ లుక్‌తో పాటు కంఫర్టబుల్ క్లాసిక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా దీన్ని డిజైన్ చేశారు.

46
బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 (Bajaj Pulsar NS125)
Image Credit : Bajaj

బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 (Bajaj Pulsar NS125)

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్, స్పోర్టీ లుక్ కోరుకునే సామాన్యుల కోసం బజాజ్ ఈ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను షోరూమ్‌లకు తీసుకువస్తోంది. ఇందులో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. పాత 124.45 సీసీ ఇంజిన్ (12 హెచ్‌పీ పవర్) మాత్రమే ఉంటుంది. కానీ, ఆకర్షణీయమైన కొత్త కలర్స్, పూర్తిగా మార్చేసిన మోడ్రన్ డిజిటల్ మీటర్ కన్సోల్‌ను ఇందులో కొత్తగా యాడ్ చేశారు.

56
హోండా రెబెల్ 500 (Honda Rebel 500)
Image Credit : Honda Rebel 500

హోండా రెబెల్ 500 (Honda Rebel 500)

హోండా కంపెనీ తన క్రూయిజర్ బైక్ లైనప్‌లో ఈ పెద్ద 471 సీసీ ప్యారలల్-ట్విన్ ఇంజిన్ మోడల్‌ను అక్టోబర్‌లో సేల్స్‌కు తీసుకురానుంది. ఇది 46 పీఎస్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. గేర్ మార్చేటప్పుడు క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేని హోండా లేటెస్ట్ 'ఈ-క్లచ్' (E-Clutch) టెక్నాలజీతో రావడం ఈ బైక్ స్పెషాలిటీ.

66
యమహా టెనెరె 700 (Yamaha Tenere 700)
Image Credit : Yamaha Tenere 700

యమహా టెనెరె 700 (Yamaha Tenere 700)

హైవేల మీద, ఎగుడుదిగుడుగా ఉండే కొండ ప్రాంతాల్లో అడ్వెంచర్ రైడ్స్ ఇష్టపడే ప్రీమియం బైక్ లవర్స్ కోసం యమహా ఈ మోడల్‌ను తీసుకొస్తోంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top EV Scooter : కేవలం 21 నెలల్లో 4,75,144 స్కూటర్ల అమ్మకాలా..! ఈవి మార్కెట్లో ఈ కంపెనీయే తోపు..!
Recommended image2
Best SUVs Under 8 Lakhs: 8 లక్షల లోపే 5 స్టార్ సేఫ్టీ, 21 కిమీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Recommended image3
TATA Aeris: కారుపై 20 ట‌న్నుల రాళ్లు ప‌డితే ఏమ‌వుతుంది.? వీడియో చూస్తే షాక్ అవుతారు
Related Stories
Recommended image1
Bikes : 350cc రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ రూ.1.38 లక్షలే.. రూ.2 లక్షల్లో వచ్చే టాప్ 5 బైక్స్ ఇవే
Recommended image2
Top 5 Best Mileage Bikes: రూ. 60 వేల బడ్జెట్‌లో లీటరుకు 75 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved