Toyota Hyryder టయోటా హైరైడర్: ఫీచర్లు కేక.. కొత్త లుక్ చూపు తిప్పుకోలేరు!
మంచి సేఫ్టీ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్ ఉన్న ఒక ఫ్యామిలీ కారు కోసం చూసేవాళ్లకు ముందుగా గుర్తొచ్చే పేరు టయోటా కిర్లోస్కర్ మోటార్ తయారు చేసిన అర్బన్ క్రూజర్ హైరైడర్ SUV. 2025లో మరింత మంచి ఫీచర్లతో, ఇంజిన్ అప్‌గ్రేడ్‌తో రిలీజ్ చేసింది. దీనిపై ఓ లుక్కేయండి.

టయోటా కిర్లోస్కర్ మోటార్ అర్బన్ క్రూజర్ హైరైడర్ SUV కొత్త ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్‌డేట్ చేసిన మోడల్ కాస్త ధర ఎక్కువైనా మంచి ఫీచర్లు జోడించారు. ఇప్పుడు దీని ధర ఎక్స్-షోరూమ్ ధర 11.34 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా లాంటి పాపులర్ మోడళ్లతో పోటీ పడుతోంది.
సేఫ్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్
టయోటా అనగానే భద్రతకు పెద్ద పీట వేస్తారనే పేరుంది. దానికి తగ్గట్టుగానే చాలా సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది కొత్త హైరైడర్. ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా అమర్చారు.
మెకానికల్ అప్‌డేట్స్, పవర్‌ట్రెయిన్ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంది. దీన్ని సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ లేదా టయోటా సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కలపొచ్చు. పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తాయి. హైబ్రిడ్ వెర్షన్ ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. 91 బీహెచ్‌పీ పవర్, 141 ఎన్ఎం పీక్ టార్క్ ఇస్తుంది.
ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ 6-స్పీడ్ ఆటోమేటిక్
ఈ ఎడిషన్‌లో మెయిన్ అప్‌డేట్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ డ్రైవర్‌ట్రెయిన్ ఇంప్రూవ్‌మెంట్. ఇదివరకు 5-స్పీడ్ మాన్యువల్‌తో ఉన్న AWD మోడల్ ఇప్పుడు 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో వస్తోంది.