- Home
- Automobile
- TATA Sierra : వింటేజ్ లుక్ లో ఏముంది గురూ..! కేవలం 24 గంటల్లో 70000 కార్లు బుక్కయ్యాయా..!!
TATA Sierra : వింటేజ్ లుక్ లో ఏముంది గురూ..! కేవలం 24 గంటల్లో 70000 కార్లు బుక్కయ్యాయా..!!
ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో తిరిగి మార్కెట్లోకి వచ్చిన టాటా సియెర్రా భారీ ఆదరణ పొందింది. కేవలం 24 గంటల్లోనే ఎన్ని కార్లు బుక్ అయ్యాయో తెలిస్తే నోరెళ్లబెడతారు.

దుమ్ము లేపుతున్న టాటా సియెర్రా
భారత కార్ మార్కెట్లో టాటా సియెర్రా ఒక ఐకానిక్ పేరు. 22 ఏళ్ల తర్వాత ఆధునిక టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో "పాత లెజెండ్ కొత్త అవతారం"గా మళ్లీ వచ్చింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే బుకింగ్స్ వెల్లువెత్తాయి. టాటా సియెర్రా ఈవి అమ్మకాల్లో దుమ్మురేపుతూ దూసుకుపోతోంది.
మళ్ళీ భారత మార్కెట్లోకి టాటా సియెర్రా
భారత కార్ మార్కెట్లో ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపుతో తిరిగిన టాటా సియెర్రా... సుమారు 22 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చింది. అయితే ఈ కారు కొనుగోళ్లపై ఊహించిన దానికంటే చాలా పెద్ద స్పందన వచ్చింది. 1991-2003 మధ్య అందుబాటులో ఉన్న ఈ మోడల్, భారతీయుల జ్ఞాపకాలలో నిలిచిపోయింది... ఇప్పుడు సరికొత్త రూపంలో తిరిగి వచ్చింది.
కేవలం 24 గంటల్లో ఇన్ని బుకింగ్సా..!
నవంబర్ 25న టాటా మోటార్స్ కొత్త సియెర్రాను లాంచ్ చేసింది. డిసెంబర్ 16న బుకింగ్స్ మొదలవగా, మొదటి రోజే 70 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. మరో 1.35 లక్షల మంది కొనడానికి ఆసక్తి చూపారని టాటా మోటార్స్ తెలిపింది. ఇది ఆటోమొబైల్ రంగంలో సరికొత్త రికార్డులు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
టాటా సియెర్రా ప్రత్యేకతలు
కొత్త టాటా సియెర్రాలో 1.5 లీటర్ క్రయోజెట్ డీజిల్, 1.5 లీటర్ TGDi హైపెరియన్ పెట్రోల్, 1.5 లీటర్ NA రెవోట్రాన్ పెట్రోల్ అనే మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCA గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
సియెర్రా ఫీచర్లు
మూడు పెద్ద స్క్రీన్ల డాష్‌బోర్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, JBL సౌండ్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. లెవల్-2 ADAS, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు సియెర్రా భద్రతను పెంచుతున్నాయి.
టాటా సియెర్రా ధర ఎంత?
టాటా సియెర్రా ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి రూ.21.49 లక్షల వరకు ఉంది. ఈ "ధర-ఫీచర్ల" సమతుల్యత వల్లే ఇంత ఆదరణ పొందింది. జనవరి 15 నుంచి డెలివరీలు మొదలవుతాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు గట్టి పోటీ ఇస్తుంది.
టాటా సియెర్రా 2026 లో టాప్ లో నిలుస్తుందా..?
టాటా సియెర్రా రీ-లాంచ్ కేవలం కారు పునరాగమనం కాదు, టాటా మోటార్స్ ధైర్యం. ధరకి తగ్గ ఫీచర్లు, భద్రత దీనిని "విలువైన SUV"గా మార్చాయి. ఈ కంబ్యాక్ సియెర్రాను 2025-26లో టాప్ SUVగా నిలబెడుతుంది.

