Maruti Grand Vitara : ఈ స్టైలిష్ కారును ఇప్పుడే కొంటే.. ఏకంగా రూ.2.19 లక్షల డిస్కౌంట్
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీపై ఈ నెలలో (డిసెంబర్ 2025) భారీ డిస్కౌంట్ ఉంది. ఇయర్ ఎండ్ ఆఫర్ కింద ఇప్పుడే ఈ కారు కొంటే ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

మారుతి గ్రాండ్ విటారాపై భారీ తగ్గింపు
మీరు దీర్ఘకాలిక ఉపయోగం కోసం నమ్మకమైన, స్టైలిష్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే ఇదే మీకు సరైన సమయం. డిసెంబర్ 2025 ముగిసేవరకు గ్రాండ్ విటారాపై రూ.2.19 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్ అందిస్తోంది మారుతి సుజుకి. ఈ ఇయర్ ఎండ్ లో కొత్తకారు కొనాలనుకునే వారికి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకేముంటుంది.
ఆకర్షణీయమైన విటారా
నెక్సా షోరూమ్‌లలో ప్రస్తుతం గ్రాండ్ విటారా అత్యంత లాభదాయకమైన డీల్‌గా కనిపిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం నగదు తగ్గింపులకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక వారంటీపై కూడా దృష్టి పెడతాయి. అందుకే కుటుంబ వినియోగం, దీర్ఘకాలిక పెట్టుబడి గురించి ఆలోచించే వారి దృష్టిని ఈ ఎస్‌యూవీ ఎక్కువగా ఆకర్షిస్తోంది.
గ్రాండ్ విటారాపై అదనపు వారంటీ
ఈ ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ప్యాకేజీలో ప్రధాన ఆకర్షణ 5 సంవత్సరాల అదనపు వారంటీ. సాధారణంగా ఈ వారంటీ కోసం అదనంగా డబ్బు చెల్లించాలి. కానీ ఇప్పుడు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ సౌకర్యం అందిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో నిర్వహణ, మరమ్మతుల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దీంతో వినియోగదారులు ఈ కారును చాలా కాలంపాటు మనశ్శాంతితో ఉపయోగించవచ్చు.
మారుతి గ్రాండ్ విటారా ధర ఎంత?
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైలేజ్-ఫ్రెండ్లీ హైబ్రిడ్ టెక్నాలజీ, బలమైన రోడ్ ప్రెజెన్స్, సౌకర్యవంతమైన క్యాబిన్ తో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఎస్‌యూవీ సిటీ, హైవే ప్రయాణాలకు సమతుల్య అనుభవాన్ని అందిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్, ట్రాన్స్‌మిషన్‌ను బట్టి రూ.10.76 లక్షల నుంచి రూ.19.72 లక్షల వరకు ఉంటుంది.
గమనిక
ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డిస్కౌంట్లు రాష్ట్రం, నగరం, డీలర్‌షిప్, స్టాక్, రంగు, వేరియంట్‌ను బట్టి మారవచ్చు. కొన్నిచోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కారు కొనే ముందు మీ సమీపంలోని మారుతి నెక్సా డీలర్‌ను నేరుగా సంప్రదించి, కచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడం మంచిది.

