MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Tata Car Offers : టాటా కారు కొనాలంటే ఇదే పర్ఫెక్ట్ టైమ్.. డిస్కౌంటే రూ.2.25 లక్షలా..!

Tata Car Offers : టాటా కారు కొనాలంటే ఇదే పర్ఫెక్ట్ టైమ్.. డిస్కౌంటే రూ.2.25 లక్షలా..!

టాటా మోటార్స్ ఈ నెల (ఆగస్ట్ 2026) లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది… ఏ కారుపై ఎంత తగ్గుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 10 2026, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాటా మోటార్స్ బంపరాఫర్లు
Image Credit : X@TataMotors_Cars

టాటా మోటార్స్ బంపరాఫర్లు

TATA Motors Offer : పండగ సీజన్ మొదలయ్యింది… దీంతో టాటా మోటార్స్ అప్పుడే అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ కార్లు ఈ నెల (ఆగస్ట్) లో అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మీరు కొత్త కారు అదీ టాటాదే కొనాలనుకుంటే మాత్రం ఇదే మంచి సమయం… ఈ కంపెనీకి చెందిన పలు పాపులర్ మోడల్స్ భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి.

ఈ ఆగస్ట్ ఆఫర్ లో భాగంగానే క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ ఆఫర్లు, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది టాటా మోటార్స్. కొన్ని మోడళ్లపై లోన్ సౌకర్యాలు, త్వరిత డెలివరీ కూడా అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్లపై గరిష్ఠంగా రూ.77,500, ఎలక్ట్రిక్ కార్లపై రూ.2.25 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చని టాటా మోటార్స్ చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ టాటా కార్లపై ఎంత ఆఫర్ ఉందో తెలుసా?
Image Credit : tata motors

ఈ టాటా కార్లపై ఎంత ఆఫర్ ఉందో తెలుసా?

మీరు పెట్రోల్, డీజిల్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే టాటా లో ఆల్ట్రోజ్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు కొనుగోలుపై ఏకంగా రూ.54,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. బ్యాంక్ లోన్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.

ఇక టాటా పాపులర్ SUV నెక్సాన్‌పై అయితే మరింత డిస్కౌంట్ ఉంది. ఈ కారుపై గరిష్ఠంగా రూ.72,500 వరకు ఆఫర్ ఇస్తున్నారు. ఇక టాటా కర్వ్ మోడల్‌పై రూ.77,500 వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.

టాటా కంపెనీకి చెందిన ప్రీమియం SUV లు హారియర్, సఫారీలపై కూడా రూ.47,000 వరకు ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు.

Related Articles

Related image1
Tata Nexon : కొత్తకారు కొనేవారికి టాటా బంపరాఫర్.. ట్రెండింగ్ ఎస్‌యూవీ నెక్సాన్‌ ధర భారీగా తగ్గిందోచ్..!
Related image2
Tata Punch EV: మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా పంచ్ ఈవీ ఫేస్ లిస్ట్..సేఫ్టీలోనూ ది బెస్ట్
35
టాటా ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లు
Image Credit : tata motors

టాటా ఎలక్ట్రిక్ కార్లపై ఆఫర్లు

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ మంచి ఆఫర్లు అందిస్తోంది. నెక్సాన్ EV మోడల్‌పై రూ.60,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. అదే టాటా కర్వ్ EVపై రూ.55,000 వరకు ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం.

టాటా కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన హారియర్ EVపై గరిష్ఠ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే టాటా కారు ఉన్నవారికి లాయల్టీ ఆఫర్ కింద రూ.1 లక్ష వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. దీనితో పాటు ఉచిత ఇన్సూరెన్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది.

45
టాటా హారియర్ పై సూపర్ ఆఫర్...
Image Credit : TATA MOTORS

టాటా హారియర్ పై సూపర్ ఆఫర్...

అయితే టాటా హారియర్ EVపై ఏకంగా రూ.2.25 లక్షల గరిష్ఠ ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఈ కారు కొనుగోలు చేసే కస్టమర్లు కొన్ని విషయాలు గమనించాలి… ఈ డిస్కౌంట్ మొత్తం అందరికీ ఒకేలా వర్తించే డైరెక్ట్ డిస్కౌంట్ కాదు. కస్టమర్ అర్హత, లాయల్టీ ఆఫర్, ఇన్సూరెన్స్ బెనిఫిట్, పాత వాహనం ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, డీలర్‌షిప్ లెవల్ ఆఫర్లను బట్టి తుది ప్రయోజనం ఆధారపడి ఉంటుంది. నగరం, డీలర్‌షిప్, వేరియంట్, స్టాక్ లభ్యతను బట్టి కూడా ఆఫర్ మొత్తం మారవచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌లో చెప్పిన గరిష్ఠ ఆఫర్‌ను చూసి ఆన్-రోడ్ ధరను లెక్కించడం సరైన పద్ధతి కాదు.

55
టాటా ఆగస్ట్ ఆఫర్లు
Image Credit : tata motors

టాటా ఆగస్ట్ ఆఫర్లు

మొత్తం మీద ఆగస్ట్‌లో టాటా కారు కొనాలనుకునే వారికి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాలపై రకరకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూయల్ కార్లలో కర్వ్, నెక్సాన్ వంటి మోడళ్లు మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో హారియర్ EV, నెక్సాన్ EV, కర్వ్ EVలు మంచి ఆప్షన్లుగా ఉన్నాయి.

అయితే ప్రతి కస్టమర్‌కు లభించే అసలు ఆఫర్ మారవచ్చు. కాబట్టి బుకింగ్ చేసే ముందు దగ్గర్లోని టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్, లాయల్టీ ఆఫర్, ఇన్సూరెన్స్, తుది ఆన్-రోడ్ ధర వివరాలను విడివిడిగా నిర్ధారించుకోవడం ఉత్తమం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Upcoming Cars: కార్ లవర్స్‌కి పండగే పండగ.. రోడ్డెక్కనున్న క్రేజీ కార్లు ఇవే !
Recommended image2
రూ. 10 ల‌క్ష‌లు పెట్టి కారు కొంటున్నారా.? రెండేళ్లు ఆగి ఇలా చేస్తే, కారు దాదాపు ఉచితంగా పొందొచ్చు
Recommended image3
KIA Cars Discount : కియా కారు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.. ఈ మోడల్స్ పై డిస్కౌంటే రూ.150000
Related Stories
Recommended image1
Tata Nexon : కొత్తకారు కొనేవారికి టాటా బంపరాఫర్.. ట్రెండింగ్ ఎస్‌యూవీ నెక్సాన్‌ ధర భారీగా తగ్గిందోచ్..!
Recommended image2
Tata Punch EV: మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా పంచ్ ఈవీ ఫేస్ లిస్ట్..సేఫ్టీలోనూ ది బెస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved