MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Automobile
  • KIA Cars Discount : కియా కారు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.. ఈ మోడల్స్ పై డిస్కౌంటే రూ.150000

KIA Cars Discount : కియా కారు కొనాలనుకుంటే ఇదే మంచి సమయం.. ఈ మోడల్స్ పై డిస్కౌంటే రూ.150000

మీరు కొత్తకారు కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది… కొన్ని పాపులర్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్ల గురించి వివరాలు ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 07 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కియా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు
Image Credit : kia

కియా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి కార్ల కంపెనీలు ఎప్పటికప్పుడు ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఇలా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా కూడా ఇండియన్ కస్టమర్ల కోసం కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారిలో ఈ ప్రకటన మంచి ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా పండగ సీజన్లలో లేదా ఆర్థిక సంవత్సరం చివర్లో అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తాయి... కానీ కియా ఇప్పుడే స్పెషల్ ఆపర్లతో హోరెత్తిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏయే మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి?
Image Credit : kia

ఏయే మోడళ్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి?

కియా ప్రకటించిన ఈ డిస్కౌంట్లతో కొన్ని పాపులర్ మోడల్స్ ధరలు భారీగా తగ్గాయి. కియా పోర్ట్‌ఫోలియోలో కార్నివాల్ (Kia Carnival), కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis), సిరోస్ (Kia Syros) వంటి పాపులర్ మోడల్స్ ఉన్నాయి... వీటి ధరలు తగ్గాయి. సాధారణంగా ఇలాంటి ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటివి ఉంటాయి.

కియా ప్రీమియం మోడల్ కార్నివాల్ పై ఏకంగా రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్ తో లభిస్తోంది. అలాగే కియా కారెన్స్ క్లావిస్ పై రూ.95,000 నుండి 1.2 లక్షల వరకు డిస్కౌంట్ లభించే అవకాశాలున్నాయి. కియా సిరోస్ MY25, MY26 మోడల్స్ పై కూడా మంచి డిస్కౌంటే ఉంది... రూ.95,000 నుండి రూ.1.40 లక్షల వరకు తగ్గవచ్చు.

34
ఆఫర్ ఎంతకాలం ఉంటుంది?
Image Credit : kia.com

ఆఫర్ ఎంతకాలం ఉంటుంది?

ఈ ఆఫర్లన్నీ పరిమిత కాలం వరకు అంటే ఆగస్ట్ చివరివరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే స్థలం, మోడల్‌ను బట్టి మార్పులుంటాయి. మీరు ఎంచుకునే కారు వేరియంట్, ఇంజిన్ రకం, రంగు, నివసించే నగరం/రాష్ట్రాన్ని బట్టి ఆఫర్ మొత్తంలో మార్పులు ఉండొచ్చు.

కంపెనీ అధికారిక ఆఫర్లతో పాటు, స్థానిక కియా షోరూమ్‌లు ఇచ్చే అదనపు యాక్సెసరీలు లేదా ఇన్సూరెన్స్ డిస్కౌంట్ల గురించి కూడా కస్టమర్లు అడిగి తెలుసుకోవచ్చు. కొందరు డీలర్లు కంపెనీ ఆఫర్లతో పనిలేకుండా కియా సెల్టోస్, సోనెట్ వంటి కార్లపైనా స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు.

44
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
Image Credit : kia official

బుకింగ్ ఎలా చేసుకోవాలి?

మీకు దగ్గర్లోని కియా షోరూమ్‌కి వెళ్లి లేదా కియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని ఈ ఆఫర్లను పొందవచ్చు.

బ్యాంక్, లోన్ ఆఫర్లు : ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీకే వెహికిల్ లోన్ సౌకర్యం, 100% ఆన్-రోడ్ ఫైనాన్స్, సులభమైన నెలవారీ వాయిదాల (EMI) స్కీమ్‌లను అందిస్తున్నాయి. కియా షోరూంలో ఏ బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయో తెలుసుకోవచ్చు.

పాత కారుకు మంచి ధర : మీ పాత కారును ఎక్స్‌ఛేంజ్ చేస్తే, మార్కెట్ ధర కన్నా ఎక్కువ బోనస్ పొందవచ్చు. 'స్క్రాపేజ్ పాలసీ' ద్వారా అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఉచిత మెయింటెనెన్స్ : కొన్ని మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్‌కు బదులుగా 2 నుంచి 3 ఏళ్ల వరకు ఉచిత మెయింటెనెన్స్, ఫ్రీ 'రోడ్‌సైడ్ అసిస్టెన్స్' సేవలను అందిస్తున్నారు.

స్టాక్ క్లియరెన్స్ సేల్ : షోరూమ్‌లలో పాత ఏడాదికి చెందిన మోడల్స్ మిగిలి ఉంటే, వాటిపై కొత్త కార్ల కన్నా రెట్టింపు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Recommended image2
Top 5 Scooters : ఇండియన్స్ ఎగబడి కొంటున్న టాప్ 5 స్కూటర్లు ఇవే
Recommended image3
Kinetic Electric Scooter : పాస్ వర్డ్ తో స్టార్టయ్యే ఈవి స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 132 కి.మీ మైలేజ్
Related Stories
Recommended image1
Kia Seltos 2026 : కేక పుట్టిస్తున్న కొత్త కియా సెల్టోస్.. డిజైన్, ఫీచర్లు అదరహో !
Recommended image2
Kia Car: పదమూడు లక్షలకే కియా లగ్జరీ కారు, సన్‌రూఫ్‌తో కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved