MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Tata Cars : కేవలం రూ.5.29 లక్షలకే కొత్త కారు.. మైలేజ్, ఫీచర్స్ గురించి తెెలిస్తే మైండ్ బ్లాక్

Tata Cars : కేవలం రూ.5.29 లక్షలకే కొత్త కారు.. మైలేజ్, ఫీచర్స్ గురించి తెెలిస్తే మైండ్ బ్లాక్

కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? టాటా మోటార్స్ బడ్జెట్ ధరలో 'టాటా ఏరిస్' (Tata Aeris) కారును మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర, మైలేజ్, ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 26 2026, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాటా ఏరిస్ కారు ధర ఎంత?
Image Credit : Tata Motors

టాటా ఏరిస్ కారు ధర ఎంత?

టాటా మోటార్స్ తమ పాత టిగోర్ కారు ప్లేస్‌లో కొత్త 'ఏరిస్' సెడాన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని బేస్ మోడల్ ధర కేవలం రూ.5.29 లక్షలు. పెట్రోల్ వేరియంట్లు రూ.5.29 లక్షల నుంచి రూ.8.74 లక్షల వరకు, సీఎన్‌జీ మోడల్స్ రూ.6.29 లక్షల నుంచి రూ.9.74 లక్షల వరకు ఉన్నాయి. స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, క్రియేటివ్, అకాంప్లిష్డ్ అనే ఐదు వేరియంట్లలో ఈ కారు దొరుకుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాటా ఏరిస్ బుకింగ్స్ స్టార్ట్
Image Credit : Tata Aeris car

టాటా ఏరిస్ బుకింగ్స్ స్టార్ట్

బేస్ వేరియంట్ అయిన 'స్మార్ట్'లో పెట్రోల్, సీఎన్‌జీ మాన్యువల్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. మిగతా వేరియంట్లలో ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ కారును కేవలం ప్రైవేట్ కస్టమర్ల కోసమే అమ్ముతామని టాటా చెప్పింది. ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. అక్టోబర్ 11 నుంచి కార్ల డెలివరీలు స్టార్ట్ అవుతాయి.

టిగోర్ ప్లేస్‌లో కొత్త కారు

పాత టిగోర్‌తో పోలిస్తే ఏరిస్ లుక్ చాలా మారింది. ముందు భాగంలో సన్నటి లైట్లు, బ్లాక్ గ్రిల్, కొత్త బంపర్, ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో పాత రూఫ్‌లైన్ ఉన్నా.. కొత్త అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్ యాడ్ చేశారు. వెనుక వైపు కొత్త టెయిల్ లైట్స్, స్పాయిలర్, బంపర్ ఉన్నాయి. లోపల క్యాబిన్ చూస్తే టియాగో గుర్తొస్తుంది. లైట్ కలర్ ఇంటీరియర్ వల్ల లోపల చాలా స్పేస్ ఉన్న ఫీలింగ్ వస్తుంది.

35
టాటా ఏరిస్ ఫీచర్లు
Image Credit : Tata Motors

టాటా ఏరిస్ ఫీచర్లు

ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్, 6 స్పీకర్లు, ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, కీ-లెస్ ఎంట్రీ లాంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. టాప్ ఎండ్ మోడల్స్‌లో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టైర్ ప్రెజర్ మానిటర్ (TPMS) కూడా ఇస్తున్నారు. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ సెన్సార్లు ఉన్నాయి.

45
టాటా ఏరిస్ ఇంజిన్
Image Credit : Tata Motors

టాటా ఏరిస్ ఇంజిన్

టిగోర్‌లో వాడిన 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే ఏరిస్‌లోనూ కంటిన్యూ చేశారు. పెట్రోల్ మోడల్ 86 hp పవర్, 113 Nm టార్క్‌ను ఇస్తుంది. అదే సీఎన్‌జీ మోడల్ అయితే 76 hp పవర్, 97 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింట్లోనూ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (AMT) ఆప్షన్లు ఉన్నాయి. ఇక డిక్కీ (బూట్ స్పేస్) కెపాసిటీ 419 లీటర్లు.

టాటా ఏరిస్ మైలేజ్

కొత్త టాటా ఏరిస్ పెట్రోల్ వేరియంట్ సుమారు 19.2 కి.మీ/లీటర్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

సిఎన్జి (CNG) వేరియంట్ సుమారు 26 నుండి 28 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుందట.

55
టాటా ఏరిస్ ధర
Image Credit : Tata Motors

టాటా ఏరిస్ ధర

డాండెలీ డ్రిజిల్, డేటోనా గ్రే, నైట్రో క్రిమ్సన్, డ్యూన్ గ్లో, ప్యూర్ గ్రే, ప్రిస్టీన్ వైట్ అనే ఆరు రంగుల్లో ఈ కారు దొరుకుతుంది. తక్కువ బడ్జెట్‌లో సెడాన్ కొనాలనుకునే వాళ్ళను, సీఎన్‌జీతో డైలీ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వాళ్ళను టాటా టార్గెట్ చేసింది. అయితే రూ.5.29 లక్షలు అనేది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ కలిపితే ఆన్-రోడ్ ధర ఇంకా పెరుగుతుంది.

మార్కెట్లో ఉన్న మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ లాంటి కాంపాక్ట్ సెడాన్లకు టాటా ఏరిస్ గట్టి పోటీ ఇస్తుంది. కాబట్టి కేవలం ప్రారంభ ధరను మాత్రమే చూసి మోసపోకుండా.. మీకు పెట్రోల్ కావాలా సీఎన్‌జీ కావాలా, మాన్యువల్ బెస్టా ఆటోమేటిక్ బెస్టా అనేది మీ అవసరాన్ని బట్టి సరైన వేరియంట్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
EV Scooter : ఫోన్ లో కాదు ఇక స్కూటర్ డాష్ బోర్డులోనూ వాట్సాప్.. మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లలో సరికొత్త ఈవి రెడీ
Recommended image2
Best Mileage Cars: లీటరుకు 34 కిలోమీటర్ల మైలేజ్.. టాప్ 5 మారుతి సుజుకి కార్లు ఇవే
Recommended image3
Petrol Diesel Price : పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌కు రూ.15 తగ్గుతుందా? కారణమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Tata Cars Offers : ఈ కారుపై డిస్కౌంటే రూ.3.5 లక్షలా..! టాటా బంపర్ ఆఫర్ ఇస్తోందిగా
Recommended image2
Top 3 Tata Cars : అమ్మకాల్లో అదరగొడుతున్న టాప్ 3 టాటా మోడల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved