MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • EV Scooter : ఫోన్ లో కాదు ఇక స్కూటర్ డాష్ బోర్డులోనూ వాట్సాప్.. మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లలో సరికొత్త ఈవి రెడీ

EV Scooter : ఫోన్ లో కాదు ఇక స్కూటర్ డాష్ బోర్డులోనూ వాట్సాప్.. మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లలో సరికొత్త ఈవి రెడీ

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఇండియన్ మార్కెట్లోకి కోనార్ పేరుతో కొత్త మోడల్స్ తీసుకువచ్చింది. డాష్ బోర్డులోనే వాట్సాప్ వాడుకునేలా సరికొత్త టెక్నాలజీ ఉంది. అలాగే ఆటో హోల్డ్, పార్క్ అసిస్ట్, మ్యాజిక్ కీ లాంటి ఫీచర్లు ఇచ్చారు.

3 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 25 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఏథర్ కొనార్క్ ఈవీ స్కూటర్ లాంచ్
Image Credit : Gemini AI

ఏథర్ కొనార్క్ ఈవీ స్కూటర్ లాంచ్

ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ఏథర్ ఎనర్జీ కంపెనీ కొత్త మోడల్‌ను దించింది. తమ 4వ వార్షిక కమ్యూనిటీ డే సందర్భంగా 'ఏథర్ కొనార్క్' (Ather Konarc) అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. రోజువారీ అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొత్త EL ప్లాట్‌ఫామ్‌ను కూడా ఈ కొనార్క్ మోడల్‌తో పాటే పరిచయం చేసింది.

ఈ కొనార్క్ ఈవి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 161 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. డాష్ బోర్డులో వాట్సాప్ తో పాటు ఆటో హోల్డ్, పార్క్ అసిస్ట్, మ్యాజిక్ కీ లాంటి సూపర్ ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లక్ష రూపాయలకే కొనార్క్ S 100
Image Credit : Website/konarc

లక్ష రూపాయలకే కొనార్క్ S 100

ప్రస్తుతానికి S, Z అనే రెండు వేరియంట్లలో ఏథర్ కొనార్క్ వస్తోంది. ఇందులో S సిరీస్‌లో ఉన్న మూడు మోడళ్ల ధరలను మాత్రమే కంపెనీ ప్రకటించింది. కొనార్క్ S 100 మోడల్ ప్రారంభ ధర రూ.99,999. అలాగే S 125 మోడల్ ధర రూ.1,21,999, S 161 మోడల్ ధర రూ.1,44,999 గా ఫిక్స్ చేశారు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే.

ఫ్యూచర్‌లో 200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్‌ను కూడా కొనార్క్ సిరీస్‌లో తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. 125 కి.మీ, 161 కి.మీ రేంజ్ ఇచ్చే కొనార్క్ Z మోడళ్లను కూడా తర్వాత లాంచ్ చేయనుంది. Z సిరీస్ ధరలను కంపెనీ ఇంకా అనౌన్స్ చేయలేదు.

34
2027లో మరిన్ని కొత్త మోడళ్లు
Image Credit : Website/konarc

2027లో మరిన్ని కొత్త మోడళ్లు

కొనార్క్ S 125, S 161 మోడళ్ల డెలివరీలు సెప్టెంబర్ నెలలో మొదలవుతాయని అంచనా. కానీ S 100 మోడల్ మాత్రం 2027 మొదటి త్రైమాసికంలోనే మార్కెట్లోకి వస్తుంది. 200 కి.మీ రేంజ్ ఇచ్చే S సిరీస్ మోడల్‌ను 2027 మూడవ త్రైమాసికంలో లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది ఏథర్. Z సిరీస్ మోడళ్లు 2027 రెండవ త్రైమాసికంలో వచ్చే ఛాన్స్ ఉంది.

కోనాార్క్ లో సూపర్ బ్యాటరీ

ఏథర్ కంపెనీ కొత్త EL ప్లాట్‌ఫామ్ బేస్ చేసుకుని తయారైన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ కొనార్కే. సుమారు 2.6 మిలియన్ కిలోమీటర్లు నడిపి చూసిన డేటాతో ఈ ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

కొనార్క్ S 100 మోడల్ 2.1 kWh బ్యాటరీతో… S 125 మోడల్ 2.7 kWh బ్యాటరీతో… S 161 మోడల్ 3.5 kWh బ్యాటరీతో వస్తున్నాయి. S 100 మోడల్ 4 kW పీక్ పవర్, 16 Nm టార్క్ ఇస్తుంది. S 125, S 161 మోడళ్లు 4.7 kW పీక్ పవర్, 16 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మూడు మోడళ్లు గరిష్ఠంగా 70 కి.మీ స్పీడ్‌తో వెళ్లగలవు.

44
పార్కింగ్ కోసం పార్క్ అసిస్ట్
Image Credit : Website/konarc

పార్కింగ్ కోసం పార్క్ అసిస్ట్

రోజువారీ వాడకాన్ని చాలా ఈజీ చేసే ఎన్నో ఫీచర్లతో కొనార్క్ వస్తోంది. మోటార్ సాయంతో స్కూటర్‌ను వెనక్కి నెట్టడానికి పార్క్ అసిస్ట్ ఫీచర్ ఉపయోగపడుతుంది. బండిని ఆపిన తర్వాత అదే చోట నిలబెట్టడానికి ఆటో హోల్డ్ సిస్టమ్ పనిచేస్తుంది.

కోనార్క్ Z వేరియంట్‌లో AEBS ఫీచర్ కూడా దొరుకుతుంది. ఎలక్ట్రానిక్ కంట్రోల్ ద్వారా బ్రేకింగ్‌ను మెరుగుపరచడానికి, బండి ఆగే దూరాన్ని తగ్గించడానికి, సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు వెనుక చక్రం లాక్ అవ్వకుండా ఆపడానికి ఈ సిస్టమ్ హెల్ప్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

యాప్ ద్వారా బూట్ ఓపెన్ చేయొచ్చు

మ్యాజిక్ కీ సిస్టమ్ ద్వారా ఏథర్ యాప్ వాడి స్కూటర్ బూట్ స్పేస్‌ను ఓపెన్ చేయొచ్చు. కొనార్క్ Z 161 మోడల్‌లో ఈ సిస్టమ్‌తో పాటు ఆటో-పాప్ ఫీచర్ కూడా ఉంటుంది. దీనివల్ల బూట్ స్పేస్ దానంతట అదే ఓపెన్ అవుతుంది.

డాష్ బోర్డులో వాట్సాప్, గూగుల్ మ్యాప్స్

కొనార్క్ Z మోడల్ డాష్‌బోర్డ్‌లో గూగుల్ మ్యాప్స్, వాట్సాప్ ఫీచర్లు ఉంటాయి. అయితే భద్రత దృష్ట్యా స్కూటర్ ఆగినప్పుడే డాష్ బోర్డులో వాట్సాప్ మెసేజెస్ చదవడానకి వీలుంటుంది. రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మెసేజ్ వచ్చినట్లు అలర్ట్ మాత్రమే వస్తుంది. ఇక డాష్ బోర్డులో క్రికెట్ స్కోర్ చూసుకునే ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది.

ఏథర్ కనెక్ట్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా థెఫ్ట్ అలర్ట్, టో అలర్ట్, రైడ్ స్టేటస్, ఫైండ్ మై స్కూటర్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్, OTA అప్‌డేట్స్ లాంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. టాప్ వేరియంట్‌లో వెహికల్ ఫెయిల్‌సేఫ్ ఫీచర్ కూడా ఇచ్చారు. S 125, S 161 మోడళ్లలో ఎయిర్‌వాక్ ఫీచర్ కూడా దొరుకుతుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Mileage Cars: లీటరుకు 34 కిలోమీటర్ల మైలేజ్.. టాప్ 5 మారుతి సుజుకి కార్లు ఇవే
Recommended image2
Petrol Diesel Price : పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌కు రూ.15 తగ్గుతుందా? కారణమేంటో తెలుసా?
Recommended image3
Mahindra Thar OG: సూపర్ లుక్స్, మోర్ పవర్ అండ్ కిల్లింగ్ సేఫ్టీ ఫీచర్స్ తో కొత్త మహీంద్రా థార్ OG వచ్చేసింది
Related Stories
Recommended image1
Ather Rizta: 20 నెలల్లో 2 లక్ష‌ల స్కూటీలు అమ్ముడ‌య్యాయి.. ఏంటా స్కూటీ, అంతలా ఏముంది
Recommended image2
Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచ‌ర్ ఎలా ప‌ని చేస్తుందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved