- Home
- Automobile
- EV: ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఎలా పొందాలో తెలుసా.? ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
EV: ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఎలా పొందాలో తెలుసా.? ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ప్రభుత్వం సబ్సిడీలను అందించడమే. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే కొంతమేర సబ్సిడీ లభిస్తుంది. అయితే ఈ సదుపాయాన్ని ఎలా పొందొచ్చు.? ఇందు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us

ప్రపంచం మొత్తం వేగవంతమైన అభివృద్ధి వైపు పయనిస్తోంది. ఇంధనాన్ని ఆదా చేయడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నారు. భారతదేశంలో కూడా అత్యంత ప్రభావవంతమైన మార్పులలో, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) కొనుగోలు ఒకటి. కాలుష్యాన్ని తగ్గించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంది. ఇది వినియోగదారులకు ఎంతగానో లాభిస్తుంది.
విద్యుత్ కార్లను కొనుగోలు చేసేలా వినియోగదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది. కస్టమర్లు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినప్పుడు, వారికి సబ్సిడీగా కొంత మొత్తం లభిస్తుంది. ఈ ప్రయోజనం కోసం ఎవరైనా ఒక నిర్దిష్ట పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పర్యావరణ అనుకూలమైన ఈవీ వాహనాలు కాలక్రమేణా పెట్రోల్ లేదా డీజిల్‌తో నడిచే కార్లకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.
టూ వీలర్, 3 వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు ప్రభుత్వం సబ్సిడినీ అందిస్తుంది. ప్రస్తుతం దేశంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు వీటిపై కొన్ని రకాల అనుమానాలు, సందేహాలు ఉండేవి అయితే ప్రస్తుతం వాటిలో మార్పులు వచ్చాయి. పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి.
సబ్సిడీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.?
పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య పెరగడం వల్ల కాలుష్యం ఎక్కువుతోంది. అందుకే కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై దృష్టి సారిస్తోంది. ఈ కాలుష్య రహిత ఎలక్ట్రిక్ కారు పెట్రోల్, డీజిల్‌తో నడిచే కార్ల కంటే పర్యావరణానికి చాలా మంచిది. అందువల్ల దేశాన్ని కాలుష్య రహితంగా మార్చాలనే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం దేశవాసుల కారు కొనాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకాన్ని EPMS పథకం లేదా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ పథకం లేదా EMPS పథకం 2024 అంటారు.
పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలు విస్తృతంగా ఉపయోగించబడుతున్నప్పటికీ, విద్యుత్ లేదా బ్యాటరీ ఆధారిత వాహనాల అమ్మకం పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలు చాలా సానుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో ఇంధనానికి వెచ్చించే డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవిగా భావిస్తుంటారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్సిడీ ద్వారా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాలను సొంతం చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సబ్సిడీలు:
దేశవ్యాప్తంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ అని పేరు పెట్టారు. స్కూటర్లు, కార్లు, బైక్‌లు మొదలైన వాటి కొనుగోళ్లపై డిస్కౌంట్ పొందడానికి కస్టమర్లు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలక్ట్రిక్ కారును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా విద్యుత్తుతో నడిచేవి కాబట్టి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా వినియోగదారులకు సమస్య ఉండదు.
ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఈ కారు పర్యావరణాన్ని అస్సలు కలుషితం చేయదు.
ఈ వాహనాలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఇంధన ఖర్చులు అదుపులోకి వస్తాయి. ఫలితంగా, ఇంధన చమురు ధరలు కూడా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి: Top Electric Cars: మార్చిలో దుమ్మురేపే ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీ పథకం:
1) ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ పథకం కింద, ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ. 10,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
2) ఈ-రిక్షాలు వంటి చిన్న 3-చక్రాల కొనుగోళ్లపై రూ. 25,000 టాకా వరకు సబ్సిడీ లభిస్తుంది.
3) నాలుగు చక్రాల వాహనాలకు రూ. 1.5 లక్షల రూపాయల వరకు సబ్సిడీ లభిస్తుంది, కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే దరఖాస్తుదారులు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలలో నమోదు చేసుకుంటేనే ఈ సబ్సిడీ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ సందర్భంలో, ఎలక్ట్రానిక్ కారు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలి.
ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.?
స్టెప్ 1: అధికారిక EV సబ్సిడీ పోర్టల్‌ను సందర్శించండి
EV సబ్సిడీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి రాష్ట్రం దాని స్వంత ప్రత్యేక పోర్టల్‌ను కలిగి ఉంది. కేంద్ర సబ్సిడీల కోసం, మీరు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అధికారిక FAME ఇండియా పోర్టల్‌ను సందర్శించాలి. రాష్ట్ర-నిర్దిష్ట సబ్సిడీల కోసం, మీరు మీ రాష్ట్ర EV పోర్టల్‌ను సందర్శించాలి.
స్టెప్ 2: సంబంధిత పథకాన్ని ఎంచుకోండి
మీ వాహన రకానికి వర్తించే సబ్సిడీ పథకాన్ని ఎంచుకోండి, అది ఎలక్ట్రిక్ 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ లేదా బస్సు అయినా. అక్కడ కేంద్ర, రాష్ట్ర సబ్సిడీ ఆప్షన్స్ కనిపిస్తాయి.
స్టెప్ 3: దరఖాస్తు ఫామ్ ఫిల్ చేయండి.
మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, ఆధార్ కార్డ్ లేదా వ్యాపారం కోసం GST/PAN వంటి అవసరమైన సమాచారంతో దరఖాస్తు ఫామ్‌ను ఫిల్ చేయండి. మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫోటో ఐడి కాపీ వంటి పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 4: మీ పత్రాలను సమర్పించండి
అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి. ప్రాసెసింగ్‌లో జాప్యాలు జరగకుండా ఉండటానికి అవి స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. బ్యాంక్ ఖాతా ధృవీకరణ కోసం క్యాన్సెల్ చెక్ లేదా మీ బ్యాంక్ పాస్ బుక్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.
స్టెప్ 5: ధృవీకరణ ప్రక్రియ
సమర్పించిన తర్వాత, మీ పత్రాలను అధికారులు ధృవీకరిస్తారు. అన్నీ సరిగ్గా జరిగితే, మీ దరఖాస్తు ప్రాసెస్ చేస్తారు. తర్వాత మీ సబ్సిడీ నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
స్టెప్ 6: మీ దరఖాస్తును ట్రాక్ చేయండి
మీ దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, సంబంధిత రాష్ట్ర EV పోర్టల్‌ను సందర్శించండి. అందులో మీ అప్లికేషన్ ID లేదా వాహన వివరాలను ఉపయోగించి మీ దరఖాస్తును ట్రాక్ చేయండి.
ఇది కూడా చదవండి: లాంగ్ డ్రైవ్ కి వెళ్లేందుకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే! ధర కూడా తక్కువే
EV సబ్సిడీ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మీరు ఈ క్రింది పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి:
వాహన రిజిస్ట్రేషన్ సమయంలో లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్‌ను సమర్పించండి.
వాహన రిజిస్ట్రేషన్ సమయంలో సంతకం కాపీని సమర్పించండి.
వ్యక్తిగత దరఖాస్తుదారులు ఆధార్ కార్డు లేదా GST సర్టిఫికేట్ లేదా వ్యాపారాల కోసం పాన్ కార్డును చూపించాల్సి ఉంటుంది.
వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC)
బ్యాంక్ స్టేట్‌మెంట్ కోసం క్యాన్సిల్ చెక్ లేదా పాస్‌బుక్‌ను సమర్పించాలి.
ఈ తప్పులు చేయకూడదు:
తప్పు సమాచారం: సమర్పించే ముందు అన్ని వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
అన్ని డాక్యుమెంట్స్: మీరు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేశారో లేదో కన్ఫామ్ చేసుకోండి.
ఎలక్ట్రిక్ వాహనం కొనే ముందు ఈ విషయాలు బాగా తెలుసుకోండి:
1) మీరు కొనాలనుకుంటున్న కారు గురించి సెర్చ్ చేయండి: అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కారు ఎన్ని కిలోమీటర్లు నడుస్తుందది, ఆ వాహనానికి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? కారు ఆన్‌రోడ్ ధర ఎంత వంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి.
2) పర్యవేక్షణ అవసరం: ప్రతి నెలా మీరు ఎంత దూరం డ్రైవ్ చేస్తారో అంచనా వేయండి. మీ ఆదాయానికి అనుగుణంగా కారు ధర లేదా ఈఎమ్‌ఐ ఉండేలా చూసుకోండి.
3) సబ్సిడీని చెక్ చేయండి: మీరు సెలక్ట్ చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనానికి ప్రభుత్వ సబ్సిడీ ఎంత లభిస్తుందో ముందుగానే తెలుసుకోవడం తెలివైన పని.
4) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను చెక్ చేసుకోండి: ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయాలలో ఒకటి. మీ ప్రాంతంలో ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోండి.
5) టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి: కారు కొనుగోలు చేసే ముందు కచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయాలి. దీంతో కారులో ఏమైనాలో లోటుపాట్లు ఉంటే అర్థమవుతుంది.
ఇది కూడా చదవండి: రూ.లక్షకే ఎలక్ట్రిక్ కారు.. బైక్ కంటే ఈ బుల్లి కారు కొనుక్కోవడం బెటర్ కదా..
కారు కొన్న తర్వాత మొదట చేయవలసిన పని:
ముందుగా ఇంట్లో అనుకూలమైన ప్రదేశంలో కారు ఛార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేయండి. ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉన్నప్పటికీ, గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వాహనాల బ్యాటరీలు చాలా ఖరీదైనవి. కాబట్టి, కొనుగోలు చేసే ముందు బ్యాటరీ యొక్క వారంటీ నిబంధనలను అర్థం చేసుకోండి.
ఇది కూడా చదవండి: కారు కొనడం మీ కలా.? రూ. 3 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ కారు సొంతం చేసుకోండి..
బ్యాటరీ నిర్వహణ చిట్కాలు:
1) మీ ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ లైఫ్ టైమ్ ఎక్కువగా ఉండాలంటే యాక్సలరేటర్‌ను నెమ్మదిగా నొక్కండి. ఒకేసారి ఎక్కువ వేగంతో వెళ్లాలనుకుంటే బ్యాటరీపై ప్రభావం పడుతుంది.
2) ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, ఛార్జింగ్ లొకేషన్‌ను నిర్ణయించుకోవాలి: మీరు ట్రిప్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తే, ముందుగా మీ కారు ఒకే ఛార్జ్‌తో ఎంత దూరం వెళ్లే అవకాశం ఉందో చెక్ చేసుకోండి. మీరు వెళ్లే మార్గంలో ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించడానికి కార్ కంపెనీ యాప్ ఉపయోగపడుతుంది.
3) ఓవర్‌ఛార్జ్ చేయవద్దు: మీడియం ఛార్జ్ లో ఉంటేనే బ్యాటరీలు బాగా పనిచేస్తాయని గుర్తుంచుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్యాటరీలు 20% నుంచి 80% ఛార్జ్ వద్ద మంచి లైఫ్ను ఇస్తాయి. కాబట్టి రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచకూడదు.
4) చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలో కారును పార్క్ చేస్తే బ్యాటరీ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ కూల్ ప్లేస్‌లలో ఉండే వారు కారును గ్యారేజ్ లోపల ఉంచేందుకు ప్రయత్నించాలి.
ఇది కూడా చదవండి: వామ్మో.. EV కారు 600 కి.మీ.ల రేంజా? టాటా హారియర్ కుమ్మిపడేసిందిగా!