- Home
- Business
- Ligier Mini EV: రూ.లక్షకే ఎలక్ట్రిక్ కారు.. బైక్ కంటే ఈ బుల్లి కారు కొనుక్కోవడం బెటర్ కదా..
Ligier Mini EV: రూ.లక్షకే ఎలక్ట్రిక్ కారు.. బైక్ కంటే ఈ బుల్లి కారు కొనుక్కోవడం బెటర్ కదా..
Ligier Mini EV: మీరు చదివింది నిజమే.. రూ.లక్ష కే ఎలక్ట్రిక్ కారు ఇండియా రోడ్లపై తిరగనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లిజియర్ అనే కంపెనీ మినీ ఎలక్ట్రిక్ వెహికల్ ను ఇండియాలో లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. బైక్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్న ఈ బుల్లి కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇప్పుడు ఇంటికో బైక్ ఎలా అయితే ఉందో.. త్వరలోనే ఇంటికో ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు జోరు అంతలా పెరుగుతోంది. మీరు కూడా ఈవీ కొనాలనుకుంటున్నారా? కేవలం రూ.లక్ష కే ఎలక్ట్రిక్ కారు మీరు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ట్రయల్స్ లో ఈ కారు మార్కెట్ లోకి వస్తే ధర తగ్గొచ్చు లేదా పెరగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రూ.లక్షకు కాస్త అటూఇటుగా ఉంటుందని సమాచారం.
ఫ్రెంచ్ దేశానికి చెందిన లిజియర్ కంపెనీ మినీ ఈవీ(Ligier Mini EV) ఇండియాలో లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ మినీ ఎలక్ట్రిక్ ఈవీ రెండు డోర్ల హ్యాచ్‌బ్యాక్ వెహికల్. దీన్ని ప్రస్తుతానికి భారతదేశంలో టెస్ట్ చేస్తున్నారు. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఇది MG కామెట్ EVకి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు అంటున్నారు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ కారు ధర రూ.1 లక్షకు కాస్త అటుఇటుగా ఉంటుందని అంటున్నారు. ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారులో అవసరమైన అన్ని ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
పనితీరు, పరిధి అంచనాలు
ఇప్పటికే ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న కార్లలో ఇది కూడ ఒకటి. Ligier Mini EV వివిధ బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. టాప్ టైర్ వేరియంట్‌లో 12.42 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 192 కిమీ వరకు వెళ్తుంది.
అయితే భారతదేశంలో విడుదల చేయనున్న కారు మోడల్ లో బ్యాటరీ వేరియంట్లు తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ఆధారంగా ఈ కారు ఇండియాలో ఒక్క ఛార్జింగ్ కి 190 నుంచి 200 కి.మీ వరకు దూసుకుపోతుందని సమాచారం.
ధర, విడుదల తేదీ
లిజియర్ మినీ ఈవీ రూ.1 లక్షల ధర ఉంటుందని సమాచారం. అయితే ఇంత తక్కువకు ఎలక్ట్రిక్ కారు అమ్మడం అసాధ్యమని పోటీ కంపెనీలు అంటున్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ బుల్లి కారు 2025లోనే ఇండియా మార్కెట్ లోవిడుదలయ్యే అవకాశం ఉంది.