Car Offers : అక్టోబర్ లో ఈ కారు కొంటే.. ఏకంగా రూ.2.34 లక్షలు సేవ్
అక్టోబర్ నెలలో అంటే పండగ సీజన్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది. కొన్నికార్లను ఏకంగా రూ.2 లక్షలకు పైగా తగ్గింపు ధరతో అందిస్తోంది. ఈ హోండా కార్ల ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్, మారుతి సుజుకి, మహీంద్రా లాంటి కంపెనీల హవా ఉన్నా.. జపనీస్ బ్రాండ్ హోండాకు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. క్వాలిటీ, లైఫ్, నమ్మకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ హోండా కార్లను భారతీయులు బాగా ఇష్టపడతారు.
అయితే ఈ పండుగ సీజన్‌లో సేల్స్ పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకట్టుకోవడానికి హోండా ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ అక్టోబర్ నెలలో హోండా కారు కొనేవారికి లక్షల రూపాయల డిస్కౌంట్ లభిస్తోంది. చాలా మోడళ్లు కనీవిని ఎరుగని స్థాయి తగ్గింపు ధరకు లభిస్తున్నాయి.
1. హోండా ఎలివేట్ (Honda Elevate)
ఇండియాలో హోండా కంపెనీకి చెందిన ఎలివేట్ కారు పెద్ద సక్సెస్ మోడల్. మంచి లుక్, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న ఈ ఎస్‌యూవీపైనే ఈ నెలలో అత్యధికంగా రూ.2,34,600 వరకు భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు. ఇందులో 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. కస్టమర్ల ఇష్టాన్ని బట్టి మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఈ కారు కొనుక్కోవచ్చు.
2. హోండా సిటీ, న్యూ సిటీ (Honda City & New City)
మిడ్-సైజ్, ప్రీమియం సెడాన్ కార్ల సెగ్మెంట్‌లో రారాజుగా ఉన్న హోండా సిటీ, న్యూ సిటీ కార్లపై కూడా ఈ నెలలో ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా జనాల్లో మంచి క్రేజ్ ఉన్న న్యూ సిటీ మోడల్‌పై రూ.1,70,900 వరకు డిస్కౌంట్ ప్రకటించింది హోండా. దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు.
ఈ హోండా న్యూ సిటీ కారులో 1.5 లీటర్ పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఆఫీస్ ట్రిప్స్, లాంగ్ డ్రైవ్‌లకు తగ్గట్టుగా మాన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ వేరియంట్లలో ఈ కారు దొరుకుతుంది.
3. హోండా అమేజ్ (New Amaze & 2nd Gen)
తక్కువ బడ్జెట్‌లో మంచి కాంపాక్ట్ సెడాన్ కారు కొనాలనుకునే వాళ్ల కోసం కూడా హోండా కంపెనీలో ఆఫర్లున్నాయి. హోండా న్యూ జనరేషన్ అమేజ్ కారుపై రూ.66,800 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ.7.65 లక్షలు.
ఇక పాత మోడల్ అయిన సెకండ్ జనరేషన్ అమేజ్‌పై రూ.57,600 తగ్గింపు ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.98 లక్షలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బడ్జెట్‌కు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.
కస్టమర్లు గమనించాల్సిన విషయాలు..
హోండా ప్రకటించిన ఈ అక్టోబర్ ఆఫర్లతో కొత్త కారును తక్కువ ధరకే, ఈజీ ఈఎంఐలో సొంతం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్. ఈ ఆఫర్లు వాడుకోవాలనుకునే కస్టమర్లు వెంటనే దగ్గర్లోని హోండా షోరూమ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
అయితే ఈ డిస్కౌంట్ అమౌంట్, స్టాక్ వివరాలు మీ నగరాన్ని బట్టి కొద్దిగా మారే ఛాన్స్ ఉంది. అందుకే డిస్కౌంట్ వివరాల గురించి షోరూమ్‌లో కనుక్కోవడం బెటర్… ఆ తర్వాతే ఏ కారు కొనాలో డిసైడ్ అవ్వండి.
